Suryaa.co.in

Telangana

బీహార్లో బడాయి కోసం చెక్కులు ఇవ్వడానికి వెళ్లారు

– చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
– కార్పొరేట్ ఆసుపత్రిలో ఆడపడుచులకు ఎందుకు చికిత్స అందిస్తున్నారో చెప్పాలి
– అపోలో వైద్యులు ఐసీయూలో ఉన్న పేషెంట్లను చూడనివ్వడం లేదు
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ వైద్యం వికటించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు ఆరు నెలల వరకు పని చేసుకునే అవకాశం లేనందున వారికి పది లక్షలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలు చనిపోతున్న పట్టించుకోకుండా బీహార్లో బడాయి కోసం చెక్కులు ఇవ్వడానికి వెళ్లారు. వైద్యం వికటించి చనిపోయిన వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలి.

ప్రభుత్వ ఆసుపత్రిలో బాగా వైద్యం అందిస్తున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు లు ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆడపడుచులకు చికిత్స అందిస్తున్నారో చెప్పాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు, డాక్టర్లు లేనందువలన కార్పొరేట్ ఆసుపత్రిలో ఆశ్రయించారు. అపోలో వైద్యులు ఐసీయూలో ఉన్న పేషెంట్లను చూడనివ్వడం లేదు. అంటే పేషెంట్ల పరిస్థితి సీరియస్ గా ఉందని అర్థం. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆడపడుచుల వద్ద ఏ ప్రభుత్వ అధికారినీ ఉంచకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. ప్రభుత్వం తరఫున మంత్రిగాని ఇతరులు ఎవరు బాధితులను ఇంతవరకు పరామర్శించలేదు. 24 గంటలు గడిస్తే గాని చికిత్స పొందుతున్న వారి పరిస్థితి చెప్పలేము అని అపోలో వైద్యులు చెబుతున్నారు.

LEAVE A RESPONSE