Suryaa.co.in

Andhra Pradesh

న్యాయమూర్తి నిర్ణయంపై హైకోర్డు అంతర్గత కమిటీ వేయాలి

– లేకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థమీద గౌరవం కోల్పోయే అవకాశం ఉంది
– జగన్ పై 30 కి పైగా కేసులు ఉన్నా…అవి ముందుకు సాగడం లేదు.
ఏపికి వస్తున్న పవన్ అడ్డగించడం అప్రజాస్వామికం
పవన్ పై బిజెపి విష్టుకుమార్ రాజు ప్రసంశలు జల్లు
బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్టుకుమార్ రాజు

విశాఖa; చంద్రబాబు అరెస్టు లో కుతంత్రం ఉంది…జి 20 సమావేశాలను ఆంధ్రా ప్రజలు చూడనీయకుండా చేశారు. ముందస్తు ప్రణాళిక రచించి..చంద్రబాబుని అరెస్టు చేశారు. న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయంపై హైకోర్డు అంతర్గత కమిటీ వేయాలి.లేకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థమీద గౌరవం కోల్పోయే అవకాశం ఉంది.

మీ బాబాయ్ ని చంపిని వారిని మీరు బ్రహ్మాండంగా కాపాడుతున్నరని ప్రజలకి కూడా తెలుసు. జగన్ పై 30 కి పైగా కేసులు ఉన్నా…అవి ముందుకు సాగడం లేదు. చంద్రబాబు సభలకు ప్రజలు ఎక్కువగావస్తున్నారు…ప్రజల నుంచి దూరం చేయడానికే ఈ కుట్ర. లోకేష్ యువగళం పాదయాత్రను ఆపాలని చూస్తున్నారు. బాబు జైల్ కివెళ్తే…వైసిపి నేతలు సంబరాలు చేసుకోవడం తప్పు.

ఏపిలో జరుగుతున్న ఆరాచక శక్తులపై పోరాడుతున్న పవన్ కి అభినందనలు.చంద్రబాబు అరెస్టు సమయంలో …ఏపికి వస్తున్న పవన్ అడ్డగించడం అప్రజాస్వామికం.

LEAVE A RESPONSE