Suryaa.co.in

Andhra Pradesh

పాత కలయికకు రాజమండ్రిలో కొత్త రూపునిచ్చారు

పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో విడిపోయింది ఎప్పుడు..?
చంద్రబాబు కోసమే పుట్టిన పార్టీ జనసేన
సున్నా సున్నా కలిసినా, హెచ్చించినా సున్నానే: మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు అభిమానుల రూపంలో తెలుగు గడ్డపై ఇంకా నరకాసురులు ఉన్నారు.:
టీడీపీ వారు దిష్టిబొమ్మలు తగలేసే కార్యక్రమమాన్ని చేయాలని పిలుపునిచ్చారు. దీన్ని చూస్తే అనిపిస్తోంది…ఇంకా ఈ తెలుగు గడ్డపై నరకాసురుడు, రావణాసురుడి వారసులు లేదా అభిమానులు నారా చంద్రబాబునాయుడి మద్దతు దారుల్లా ఈ తెలుగు గడ్డపై ఇంకా మిగిలి ఉన్నారని అనిపిస్తోంది. వారిచ్చిన దిష్టిబొమ్మల దహనం పిలుపు ఒక అట్టర్‌ ప్లాప్‌ షో అయిందనేది అర్ధమవుతోంది. నేడు రాజమండ్రిలో పుత్రుడు, దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం కూడా అట్టర్‌ ప్లాప్‌ షో. సున్నా సున్నా కలిస్తే సున్నా అవుతుందని, సున్నా సున్నా హెచ్చిస్తే సున్నానే అవుతుందని మా నాయకుడు మొన్ననే చెప్పారు. అదే ఇక్కడ కనిపించింది.

పాత కలియికే ఇది. పాతకలయికకు రాజమండ్రిలో కొత్త రూపాన్ని ఇచ్చారు. మేమేమీ వైఎస్సార్సీపీకి వ్యతిరేకం కాదు…వారి విధానాలకే వ్యతిరేకం అని పవన్‌ కల్యాణ్‌ అంటున్నాడు. మేం మాత్రం నీకు వ్యతిరేకమా పవన్‌ కల్యాణ్‌..? నీకూ మాకూ ఏమన్నా తగాదా ఉందా? అసలు నీ విధానం ఏంటి..? టీడీపీతో నువ్వు ఈ రోజు కలిశావా? 2014లో నువ్వు తెలుగుదేశంతోనే కదా ముందుకు వెళ్లావ్‌..? 2019లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేశావ్‌..ఇప్పుడు మళ్లీ కలిసి పోటీ చేస్తున్నావు. అందుకే కదా నిన్ను ప్యాకేజీ స్టార్‌ అన్నది..నువ్వు ప్యాకేజీ స్టార్‌ వి కాబట్టే నీ విధానాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. నీ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నీ విధానమే తప్పు…టీడీపీ కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ నీది.

టీడీపీకి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే వెంటనే కాసుకోడానికి వస్తావు. మొన్న విడిగా పోటీ చేశాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు..దాని వల్ల ఎవరికి లాభం..టీడీపీకేగా లాభం..? ఇవాళ ఓట్లు చీలనివ్వవు.. అప్పుడేమో ఓట్లు చీలనిస్తావు..దీన్ని బట్టి అర్ధం కావడం లేదా నీ విధానం ఏమిటో? చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడం కోసం ఈ సమావేశం రాజమండ్రిలో పెట్టాం అని పవన్‌ అంటున్నాడు. అంటే చంద్రబాబు మనోధైర్యం కోల్పోయాడు..ఆయనకు మనోధైర్యం ఇవ్వడం కోసమే తప్ప ప్రజల కోసం ఏమీ చర్చించలేదనేది సుస్పష్టం.

పవన్‌ కల్యాణ్‌ను టీడీపీ నేతలు రిసీవ్‌ చేసుకుంటుంటే లోకేశ్‌ ముఖం మాడిపోయింది:
వేదికంతా చూస్తే సీనియర్‌ నాయకులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన తీరు చూస్తే లోకేశ్‌ కిమ్మనలేకపోయాడు. వచ్చేశాడు..మా దత్తపుత్రుడు వచ్చేశాడని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. నూటికి నూరు పాళ్లు టీడీపీ బలహీనపడిందని ఎప్పుడో చెప్పిన నువ్వు దాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రోజు కలిశాను అని స్పష్టంగా చెప్పావు. అందుకే చెప్పాం..ఎన్ని సున్నాలు కలిసినా అది సున్నానే తప్ప బలమైన వ్యవస్థగా మారదు.

చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా చేస్తున్నారంటూ పవన్‌ అంటున్నారు. అసలు పవన్‌ నీకు వ్యవస్థలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నావా? ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్‌ బెయిల్‌ ఇవ్వొద్దనే చెప్తారు… న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. నీకు తెలియకపోతే తెలుసుకో పవన్‌ కల్యాణ్‌. ఒకటి గుర్తు పెట్టుకోండి..చంద్రబాబు అరెస్ట్‌ అక్రమని అనాలంటే కేసు అన్నా కొట్టేయాలి..లేదా క్వాష్‌ పిటిషన్‌ అన్నా అనుమతించాలి. ఆధారాలతో సహా అరెస్ట్‌ చేసి కోర్టులో పెడితే జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఇచ్చారు. ఏ కోర్టుకు వెళ్లినా పిటిషన్లు తిరస్కరిస్తున్నారంటే కేసు ఎంత బలంగా ఉందో అర్ధం అవుతోంది. దీనికి ప్రభుత్వంపై, జగన్‌ పై విరుచుకుపడితే ఏం లాభం..? టీడీపీని కాపాడటం కోసం భుజాన వేసుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు.

మీరంతా కలిసే వస్తారని మేం డే వన్‌ నుంచీ చెప్తున్నాం:
మేం డే వన్‌ నుంచి చెప్తున్నాం..చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసే వస్తారు..కలిసే పోటీ చేస్తారు అని చెప్తూనే ఉన్నాం. మేం చెప్పిందే జరుగుతుంది..మీరు కలిసి వచ్చినా..కలవకుండా వచ్చినా అన్నిటికీ మేం సిద్ధంగా ఉన్నాం. కొణిదల పవన్‌ కల్యాణ్‌ గారు…టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిని హింసిస్తే ఏం చేశావయ్యా..? ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడినప్పుడు ఎంతో మందిని అరెస్ట్‌ చేసినప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడలేదేం? ఆ అరెస్టులు అక్రమం అనిపించలేదా? అందుకేగా నిన్ను ప్యాకేజీ స్టార్‌ అని పిలిచేది. నువ్వు కేవలం చంద్రబాబు చెప్పినట్లు మాట్లాడేవాడివే తప్ప నీకంటూ ఒక సొంత ఆలోచనే లేదు. జనసైనికులారా సిద్ధంగా ఉండండి..చంద్రబాబు పల్లకి మోయడానికి అని మేం మూడేళ్ల క్రితమే చెప్పాం.

అమిత్‌షాతో భేటీ ప్రగల్భాల్లో మీ డొల్లతనం బయటపడింది:
నేడు కిషన్‌ రెడ్డి చాలా వాస్తవాలు చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ వెళ్లి అమిత్‌షాని కలిసి ఇది అక్రమ అరెస్ట్‌ అని చెప్తాను అన్నాడు..కానీ కలవలేదు. కానీ నారా లోకేశ్‌ మాత్రం వెళ్లి అమిత్‌షాను కలిశాడు..అమిత్‌షానే నన్ను రమ్మంటే వెళ్లాను అన్నాడు. అమిత్‌షాను కలపమని ఢిల్లీలో ఉండి ప్రాదేయపడితే కిషన్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇప్పించానని చెప్పాడు. అంతవరకే నా ఉద్దేశం..శతృవులను సైతం అమిత్‌షా కలుస్తారని కూడా చెప్పాడు. ఆయన పెద్దమ్మ…ఎవరు పిలిచారనేది అప్రస్తుతం..కానీ బాబు ఆరోగ్యం గురించి మాట్లాడారు అంటూ చెప్పుకొచ్చారు. ఏ బెంచ్‌కి వచ్చింది…ఏ జడ్జి దగ్గర ఉంది అని కూడా అడిగారంటూ చెప్పారు. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల మీ డొల్లతనం బయపటడుతోంది.

రాజమండ్రిలో కలిసినటువంటి కలయిక చరితాత్మకమైన కలయిక అన్నారు..అసలు మీరెప్పుడైనా విడిపోయారా? ఇవాళేదో కొత్తగా కలిసినట్లు మాట్లాడుతున్నారు..ఇవి దురదృష్టకరమైన పరిణామం. ప్రజల సమస్యల కోసం మేం చర్చించాం అంటారు..చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత ప్రజా సమస్యలు గుర్తొచ్చాయా? ఇలాంటి కలయికలను ప్రజలు హర్షించరు.

వారిచ్చే మేనిఫెస్టో టీడీపీని కాపాడటానికే:
వారిచ్చే మేనిఫెస్టో ఏపీని కాపాడటానికో..టీడీపీని కాపాడటానికో అర్ధం కావడం లేదు. నిన్న లేఖ రాస్తూ నేను జైళ్లో లేను..ప్రజల గుండెల్లో ఉన్నానన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ వార్త విని 154 మంది మరణించారనేది ఎంత నిజమో చంద్రబాబు కూడా ప్రజల గుండెల్లో ఉన్నాడనేది కూడా అంతే నిజం. జైళ్లో ఉన్న ప్రతి వాడు ప్రజల గుండెల్లో ఉండలేడు అనేది వారు గుర్తించాలి. తెలుగు దేశం అని తెగులు పట్టుకుని చాలా సంవత్సరాలైంది..అది ఇప్పుడు చస్తుంది.. ఆ తెగులును కాపాడటానికి పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తెగులుకు అంతిమ సంస్కారం జరగబోతోంది.

ఈ భారతావనిలో ఏ తప్పూ లేకుండా 42 రోజులు జైల్లో పెట్టడం సాధ్యమా? బయటకు వెళితే సాక్షులను తారుమారు చేస్తారనే కదా లోపల ఉంచింది.. ఆయన బయట ఉండగానే కదా ఆయన పీఏ శ్రీనివాస్‌ దేశం దాటిపోయింది. అందరికీ తెలిసిన సత్యం..రేవంత్‌ రెడ్డితో కట్టలు కట్టలు డబ్బులు ఇచ్చి ఒక ఎమ్మెల్సీని కొనాలని చూశాడు. ఇదొక్క ఉదాహరణ చాలదా..? నీ బుద్ది అక్కడే బయటపడిందిగా..? ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో చంద్రబాబు ఎన్ని చేశాడో..? వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఈ దేశంలోనే నెంబర్‌ వన్‌ చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్‌చేయడం మా వల్లేమవుతుంది..?

కానీ ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్‌ చేయలేకపోతున్నావు..అందుకే మీరు దొరికిన దొంగ. లోపల చంద్రబాబు ఊసలు లెక్కేసుకోవడం..బయటున్న పుత్రుడు, దత్తపుత్రుడు రోజులు లెక్కేసుకోవడమే. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి. కరకట్ట ఇళ్లు ఇది నా సొంతం అన్నాడు..ఒక సారి రెంట్‌కు తీసుకున్నాను అన్నాడు. చంద్రబాబును నమ్మేవారు ఎవరూ లేరు.

LEAVE A RESPONSE