టీబీ ముక్త్ భారత్ అవేర్‌నెస్ క్రికెట్ మ్యాచ్ లో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం రమేష్
న్యూఢిల్లీ: క్షయవ్యాధి తో పోరాడేందుకు, ప్రాణాంతక వ్యాధి నిర్మూలనపై అవగాహన పెంచేందుకు రాజ్యసభ లోక్ సభ సభ్యులు నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్ ఇండియా గేట్ సమీపంలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ఈరోజు జరిగిన 20 ఓవర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ జట్టుకు అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహించగా, కిరణ్ రిజిజు రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్టుకు నాయకత్వం వహించిన నేపథ్యంలో, రాజ్య సభ చైర్మన్ ఎలెవన్ జట్టు తరపున వికెట్ కీపర్ గా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీ.ఎం రమేష్ బరిలో దిగారు.కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ జట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సారథ్యంలోని రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్టుపై 73 పరుగుల తేడాతో విజయం సాధించింది.