– అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రహదారుల్లో గుంతలు పూడ్చుట, కొత్త రోడ్లు నిర్మాణం, మంచినీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వంకు చెందిన జలజీవన్ నిధులు మంజూరు అయ్యాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో రైల్వే శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు అయ్యాయని, అనపర్తి రైల్వే స్టేషన్ అమృత భారత్ పథకం కింద 30 కోట్లతో సుందరంగా తయారవుతోందని చెప్పారు. కొత్తూరు దగ్గర ఫ్లైఓవర్, లక్ష్మీ నరసాపురం కాపవరం దగ్గర ఫ్లైఓవర్, ఇళ్ళపల్లి దగ్గర ఫ్లైఓవర్ మూడు కూడా నిధులు మంజూరు దశలో ఉన్నాయి. ఆల్రెడీ కొత్తూరు దగ్గర టెండరు కూడా పిలిచారని చెప్పారు. మొత్తంగా అభివృద్ధికి రూ.452 కోట్లు, సంక్షేమం కోసం 314 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.