Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో అరాచక, విద్వేష పూరిత పాలన

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ: ఏపీలో నేడు అరాచక, విద్వేషపూరిత పాలనను నేడు మనమంతా చూస్తున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ లో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా మండల,పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల సభ్యుల సమావేశంలో పురందేశ్వరి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమెతన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎస్సీలకు మాట్లాడే హక్కులేకుండా చేస్తున్నారన్నారు ఎవరైనా ప్రభుత్వం పై గళం విప్పితే కేసులు పెడుతున్న తీరును మనం చూస్తున్నామన్నారు.

అనేక ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఇసుక ను దోచుకుంటూ.. కోట్లు కూడేసుకుంటున్నారు. అడిగిన వారిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఎస్సీ యువకుడు పురుగుమందు తాగిన ఘటనను పురందేశ్వరి ప్రస్దావిస్తూ రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక ఎస్సీ యువకుడు పురుగుల మందు తాగి చనిపోయాడు ఈ సంఘటనకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని బిజెపి ప్రశ్నిస్తోందన్నారు.

వైసీపి పార్టీ సామాజిక బస్సు యాత్ర చేసింది అయితే దొమ్మేరులో ఎస్సీవర్గానికి చెందిన యువకుడు పురుగుమందు తాగిన ఘటనకు మీ యాత్ర ఏం సంకేతం ఇస్తోందని ప్రశ్నించారు. ఈ తరహా పాలనను అరాచక పాలన అనరా అంటూ తీవ్ర స్వరంతో ప్రభుత్వం పై మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోంది.రాజమహేంద్రవరం కడియం మండలం లో గోదావరి నదీ గర్భంలో అడ్డగోలుగా యంత్రాలతో ఇసుక తవ్వే స్తున్నారని తాను స్వయంగా కార్యకర్తల తో వెళ్లి చూడడం జరిగిందన్నారు.

నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పుకునే జగన్ ఆ కుటుంబానికి ఏమి న్యాయం చేశారని ప్రశ్నిస్తున్నానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, మోడీ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి అంటూ పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకుంటే మనం ధీటుగా నిలబడాలన్నారు .జాతీయ పార్టీ ఇచ్చిన మార్గదర్శకాలు కు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్ధాగత పటిష్టతకు కార్యకర్తలతో సమావేశం అవుతున్నానని కార్యకర్తలు ఇచ్చిన సమాచారంతోనే వారి మనోభావాలకు అనుగుణంగా పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు.

అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని నిర్ణయించాం.రాయలసీమలో జిల్లాల లో పర్యటన పూర్తయ్యిందన్నారు. కోస్తాలో మూడు జిల్లాల పర్యటన పూర్తి చేశాం. ప్రతి రాజకీయ పార్టీ పునాది పటిష్టంగా ఉంటే.. అనుకూల, ప్రతికూల పరిస్థితి ఉండదని బీజేపీ అగ్రనాయకత్వం బలంగా విశ్వసిస్తుంది. అందుకే ఎపీలో బీజేపీ పునాది పటిష్టపరిచేలా కార్యక్రమాలు చేపడుతున్నాం.మండలాలు, పోలింగ్ కేంద్రాల వ్యవస్థను పటిష్టపరిస్తే.. ఎటువంటి పరిణామాలు అయినా ఎదుర్కొవచ్చు.నా పర్యటనలో సంస్థాగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను.నాయకులు, కార్యకర్తలు పరస్పర సహకారంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

రాజకీయ కోణం వైపు కూడా ఆలోచన చేయాలని నేను నమ్ముతున్నాను.ఎపీ విభజన జరిగిన తర్వాత కొన్ని అపోహలను ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి.ఎఫీకి బీజేపీ సాయం అందించడంలేదని, అభివృద్ది కుంటుపడిందని చెప్పుకొచ్చారు .బీజేపీ ప్రభుత్వం మోడీకి ఏం చేసిందని, ఎన్ని నిధులు ఇచ్చిందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.

అమరావతి ఎపీ రాజధాని అనే మాటకు బీజేపీ కట్టుబడి ఉంది .రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ఇస్తూ అరుణ్ జైట్లీ ఆనాడు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ బిజెపి అమరావతికి కట్టుబడి ఉందని కార్యకర్తల హర్షద్వానాల మద్య ప్రకటించారు.మంచి రాజధాని వస్తుందనే రైతులుకు కేంద్రం అనేక వెసులుబాటు కల్పించారు.విజయవాడ నగరానికి భూగర్భ డ్రైనేజీ, రోడ్లు కోసం 500కోట్లు కేంద్రం ఇచ్చింది.

స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ (స్పా) ను విజయవాడలో కేంద్రం ఏర్పాటు చేసింది.అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా రాజధాని ప్రాంతంలో వనరులకు కేంద్రం నిధులు ఇచ్చింది.గొల్లపూడి నుంచి మంగళగిరి వరకు రోడ్ కోసం 1200కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసింది .అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల ఒకటిన్నర కిలో మీటర్లు పని ఆపేయాల్సి వచ్చింది.కేంద్రం ఎంత సహకారం అందిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి.

విజయవాడ, మచిలీపట్నం మధ్య జాతీయ రహదారి నిర్మాణం చేశారు
దుర్గగుడి, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణాలు కేంద్రం వల్లే పూర్తి అయ్యాయి.వివిధ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకు వేల కోట్ల రూపాయలు నిధులు కేంద్రమే విడుదల చేసింది.హస్తకళలు కనుమరుగు కాకుండా కొండపల్లి బొమ్మలకు ఒన్ ప్రొడక్టు, ఒన్ డిస్టిక్టు పేరుతో గుర్తింపు ఇచ్చింది.500 పడకల ఇ,యస్.ఐ ఆసుపత్రి కి కేంద్రం నిధులు ఇచ్చింది
రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు విజయవాడలోనే చేశారు.కేంద్రం అందించిన సహకారం చూసి నాకే ఆశ్చర్యం కలిగింది.శక్తి కేంద్ర సభ్యులు, బూత్ అధ్యక్షులు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.వేరే ప్రసారమాధ్యమాలు మనకు అవసరం లేదు.. కార్యకర్తలే మన ప్రచార సాధనాలు అన్నారు.

బీజేపీ యన్టీఆర్ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖఉలు, బూత్ అధ్యక్షుల సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరిశ్రీరాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ నిర్వహిస్తున్న సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని అడ్డూరి శ్రీరాం వివరిస్తూ సంస్ధాగతంగా ఏమేరకు బలపడిందీ వివరించారు.

సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి , మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెవైం రాష్ట్ర అద్యక్షుడు మిట్టా వంశీ, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సుబ్బయ్య, కృష్ణ భగవాన్, బబ్బూరి శ్రీరామ్, బొడ్డు నాగలక్ష్మి, భొగవల్లి శ్రీధర్ ,గాయత్రి, సుమతి, మాదల రమేష్ , నరసరాజు, చైతన్యశర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE