Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో అరాచకం, అక్రమం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయి

-నాలుగేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించి ఆయన ఆస్తులు పెంచుకున్నారు
-తన తండ్రి వైఎస్‍ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి.. తాను సిఎం అయ్యాక మరో మూడున్నర లక్షల కోట్లు దోచుకున్నారు

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యునతి కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రకటించిన మినీ మేనిఫెస్టో వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలపడానికి చేపట్టిన చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) కార్యక్రమం. జోన్-1 పరిధిలోని అరకు పార్లమెంట్, పార్వతీపురం నియోజకవర్గం నుందు నియోజకవర్గం ఇంచార్జీ బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం ఇంఛార్జి గారు పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనాయకులు, స్థానిక నాయకులతో కలిసి బస్సుయాత్రను ప్రారంభించడం జరిగింది. యాత్ర ప్రారంభించిన అనంతరం సీతానగరం మండలం అప్పయ్యపేటలో మూసివేసిన సుగర్ ఫ్యాక్టరీ ను సందర్శించారు. కార్యక్రమం అనంతరం జెండా వూపి బస్సు యాత్ర ప్రారంభించారు. అనంతరం సీతానగరంలో 380 మోటార్ సైకిల్లతో ర్యాలీగా వెళ్లి సువర్ణముఖి నదిపై అసంపూర్తిగా వున్న బస్సు బ్రిడ్జిని పరిశీలించి సెల్ఫీ తీసుకోవటం జరిగింది.

అనంతరం చిన బొందపల్లిలో యం.అర్ నగర్ politechnical కాలేజీ , జంజావతి కలువ పరిశీలించారు, అక్కడినుండి పార్వతీపురం పట్టణం నందుగల సీ కన్వెన్షన్ హాలులో బహిరంగ సభ గ్రామాలనుండి వచ్చిన జన సమూహంలో భారీగా జరిగింది. అనంతరం పార్వతీపురం పట్టణంలో గల అర్. ఓ.బి బ్రిడ్జిని పరిశీలన చేసిన అనంతరం అడ్డపుసీల వద్ద గల తిడ్కో గృహ సముదాయము పరిశీలించి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఇటీవల తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించడం జరిగింది. కార్యక్రమం నియోజకవర్గంలొ విజయవంతం అయింది.

ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ కావాలి ప్రతిభా భారతి , పోలిట్బ్యూరో సభ్యులు గుమ్మిడి సంధ్యారాణి ,పోలిట్బ్యూరో సభ్యులు,కిమిడి కళా వెంకటరావు , పోలిట్బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు , ఎస్ కోట నియోజకవర్గ ఇన్చార్జి కోళ్ల లలితకుమారి , రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ద్వరపురెడ్డి జగదీష్ , పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ , కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీస్వరి , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజు దేవ్ , పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకులు గోవిందరాజులు , రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పీలా గోవింద్ , విజయనగరం జిల్లా యూత్ అధ్యక్షులు వేమలి చైతన్య బాబు, పార్వతీపురం జిల్లా ముఖ్య నాయకులు అన్ని మండలాల మండలపార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

జోన్-2 టిడిపి చైతన్య రథయాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు(రాంబాబు) ఆధ్వర్యంలో తాళ్ళరేవు మండలం పాత ఇంజరం వద్ద బస్సుయాత్రను ప్రారంభించారు. అక్కడ నుండి పాండిచ్చేరి యానాం మీదుగా ఎదుర్లంక బ్రిడ్జి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది ట్రాక్టర్లు, కార్లు, వేలాది మోటారు బైకులతో వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఎదుర్లంక వంతెన వద్ద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, దివంగత లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు, టిడిపి అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జి గంటి హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పశువుల్లంక వద్ద వంతెన నిర్మాణం వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. అక్కడ నుండి మురమళ్ళ, గాడిలంక మీదుగా ముమ్మిడివరం వరకూ చైతన్యరథ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అరాచకం, అక్రమం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి రాగానే వైసీపీ అరాచకాలపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టిడిపి నాయకులు, కార్యకర్తలపై జగన్ రెడ్డి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులన్నింటినీ ఒక్క జిఓతో రద్దు చేస్తామని ప్రకటించారు.

నాలుగేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించి ఆయన ఆస్తులు పెంచుకున్నాడని ఆరోపించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి తాను సిఎం అయ్యాక మరో మూడున్నర లక్షల కోట్లు దోచుకున్నాడని యనమల ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 19కి 19 సీట్లు గెలుస్తామని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పారు.

సంక్షేమ పథకాలకు దేశంలో శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. నాడు ఎన్టీఆర్ తిండి, బట్ట, ఇల్లు ప్రతి పేదవాడి సంక్షేమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ఆ తరువాత చంద్రబాబు ప్రతి పేదవాడూ ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో మరిన్ని సంక్షేమ పథకాలు సృష్టించారని తెలిపారు. జగన్ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డాడని, అప్పులు తెచ్చి పేదవాడి పేరు అడ్డం పెట్టుకుని సొంత ఖజానాకు తరలించుకున్నాడని ఆరోపించారు.

ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ మినీ మేనిఫెస్టోలో హామీలిచ్చామని చెప్పారు. ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని యనమల ప్రకటించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, తిరిగి రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలంటే చంద్రబాబును సిఎం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళాలని కోరారు.

ముమ్మిడివరం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనప్పటికీ ఆ సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయడం లేదన్నారు. ఇక్కడ సముద్రంలో జిటీపిఎస్ కార్యకలాపాల మూలంగా మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు.

ముమ్మిడివరం నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది టిడిపి హయాంలోనని గుర్తు చేశారు. దివంగత లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తన హయాంలోనే ఈ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు అవినీతి అక్రమార్జనలు తప్ప మరో పని లేదని, వారికి ప్రజా సమస్యలు పట్టవని ఆయన మండిపడ్డారు.

అమలాపురం పార్లమెంట్ టిడిపి ఇంఛార్జి గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో ప్రకటించారని, అదే విధంగా ఈ ప్రాంత భవిష్యత్తుకు తాను గ్యారంటీ ఇస్తున్నానని హరీష్ చెప్పారు.

తన తండ్రి దివంగత లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఇక్కడి ప్రజలు కూడా ఆయనకు అన్నీ వేళలా అండగా నిలిచారని గుర్తు చేశారు. తనకు, బుచ్చిబాబుకు కూడా అదే మాదిరి అండగా నిలుస్తున్న ఈ ప్రాంతవాసుల రుణం తీర్చుకుంటానని తెలిపారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి మాట్లాడుతూ మినీ మేనీఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల గురించి వివరించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రకటించిన తల్లికి వందనం, మహాశక్తి, దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరమని ఆమె అన్నారు.

రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. పోలీసులు సైతం జైలుపాలయ్యే పరిస్థితి వచ్చిందంటే జగన్ పాలనలో అవినీతికి అద్దం పడుతుందన్నారు.

ఈ సభలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎంపి ఎజెవి బుచ్చిమహేశ్వరరావు, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, రామచంద్రపురం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, అయితాబత్తుల ఆనందరావు, పెందుర్తి వెంకటేష్, దాట్ల బుచ్చిబాబు, ప్రత్తిపాడు టిడిపి ఇంఛార్జి వరుపుల సత్యప్రభ, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు మెట్ల రమణబాబు, నామన రాంబాబు, డొక్కా నాథ్ బాబు, బొడ్డు వెంకటరమణ చౌదరి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు కాలా సత్తిబాబు, జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, జిల్లా తెలుగురైతు అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, టిడిపి సీనియర్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, మందాల గంగ సూర్యనారాయణ, గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శులు ధూళిపూడి బాబి, దంతులూరి వాసురాజు, దాట్ల పృధ్వి రాజు, మండల అధ్యక్షులు రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు, టేకుమూడి అనంతలక్ష్మి, నడింపల్లి సుబ్బరాజు, అర్ధాని శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు ముదునూరి రామలింగరాజు, పిన్నమరాజు శివ, సాగి సూరిబాబు రాజు, పెరబత్తుల రాజశేఖర్, కడలి ఉమామహేశ్వరరావు, ఎంపీటీసీ వనచర్ల వెంకటేశ్వరరావు, బీర సత్య కుమారి, కట్టా సత్తిబాబు, రెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

జోన్-3 నందిగామ నియోజకవర్గంలో భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్ర ఇన్‌చార్జి తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో జరిగింది. తెదేపా చైతన్య రథయాత్రకు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. తొలుత కంచికచర్ల మండలం పరిటాల సెంటర్‌లో మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘననివాళుల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, నందిగామ ఇన్‌చార్జి తంగిరాల సౌమ్య, తిరువూరు ఇన్‌చార్జి శావల దేవదత్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, మండల పార్టీ అధ్యక్షులు మేకల సుధాకర్, కోగంటి బాబు, వీరంకి వీరాస్వామి, కోండ్రగుంట శ్రీనివాస్‌కుమార్, పార్టీ నాయకులు, శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

అనంతరం పరిటాల పాతగ్రామ పంచాయితీ బిల్డింగ్ కూల్చేసి అదే స్థలంలో ఆర్‌బీకే, గ్రామ సచివాలయంలకు 2020లో పనులు మొదలుపెట్టి నేటికీ పూర్తికాలేదు పూర్తికాని కట్టడాల వద్ద సెల్ఫీచాలెంజ్ విసిరారు. అనంతరం కీసర గ్రామంలో టోల్‌ప్లాజాకు సమీపంలో ఉన్న ఇసుక డంప్ నుండి అనధికారికంగా రాత్రికి రాత్రి వేలట్రిప్పుల ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అవినీతి ఎండగడుతూ, అధికారుల అలసత్వాన్ని ఖండిస్తూ ఇసుక డంప్ వద్ద సెల్ఫీ చాలెంజ్ విసిరారు.

నందిగామ పట్టణం 19వార్డు హనుమంతపాలెం గ్రామం నందు గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సామాన్యులు కార్పొరేట్ స్థాయిలో జీవించాలని 22 ఎకరాల స్థల సేకరణ చేసి, 2496 టిడ్కో గృహాలను పూర్తిచేసి ఎన్నికల కోడ్‌తో లబ్ధిదారులకు అందజేయలేకపోయాం, వైసీపీ ప్రభుత్వం వచ్చాక కనీస అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకుండా, లబ్ధిదారులకు కేటాయిస్తే టీడీపీకి పేరు వస్తుందనే కక్ష్యపూరిత వైఖరితో వ్యవహరించి నేటికి టిడ్కో గృహ సమూదాయాన్ని కేటాయించలేదు, దీనిని ఖండిస్తూ సెల్ఫీచాలెంజ్ విసిరారు

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పరిపాలన కాలంలో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాడో నిదర్శనం ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణం. టీడీపీ ప్రభుత్వంలో 2లక్షల 75వేల ఇళ్లను పూర్తిచేశాము, మౌలిక సదుపాయాలు మాత్రమే మిగిలాయి, ఎన్నికల్లో జగన్ వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు కట్టిన ఇళ్లను నేను అధికారంలోకి వస్తే డిపాజిట్ అక్కర్లేదు, లబ్ధిదారుల మార్జిన్ మనీ అక్కర్లేదు ఉచితంగా ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నమ్మి లబ్ధిదారులు మోసపోయారు, ప్రభుత్వ పూచీతో రుణాలు తీసుకున్న లబ్ధిదారుల వెంటపడుతున్న బ్యాంకులు, 2లక్షల 75వేల ఇళ్ల లబ్ధిదారుల ఉసురు జగన్‌మోహన్‌రెడ్డికి తగిలి తీరుతుందన్నారు, ఇలాంటి అసమర్థ పరిపాలన ఎందుకని సీఎం జగన్‌ని ప్రశ్నించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దసరాకు చంద్రబాబు గారు ప్రకటించనున్న మేనిఫెస్టోతో వైసిపి బంగాళాఖాతంలో కలవడం ఖాయం, సమాజానికి పట్టెడు అన్నం పెట్టే రైతు ఆరు గాలం కష్టించిన పండించిన పంట అమ్ముకోలేక దళారీల భారిన పడి మోసపోతున్నాడు, అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు ప్రతి సంవత్సరం రూ.20,000 అందిస్తాం,
ఆడబిడ్డ నిధి క్రింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం, కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి బిడ్డకు ఒక్కొక్కరికి 15000 ఇస్తాం, పూర్ టూ రిచ్ కింద ప్రతి పేదవాడు ధనవంతుడ్ని చేసే కార్యక్రమం చేపడతాం, ఇసుక దోపిడీ సొమ్ములు ప్రతి పది రోజులకు ఒక్కో జిల్లాకు ఏడు కోట్లు చొప్పున పన్ను కడుతున్నారు, బామ్మర్ది చేత మైలవరం ఎమ్మెల్యే నెలకు ఇరవై ఒక్క కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కప్పం కడుతున్నాడు, నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన. నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాం, ఈ సైకో 9సార్లు కరెంటు చార్జీలు పెంచారు సామాన్యుడు నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదు.

నందిగామ ఇన్‌చార్జి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ మా ప్రభుత్వంలో పూర్తిచేసిన టిడ్కో గృహసముదాయాన్ని వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు న్యాయం జరిగేంతవరకు టీడీపీ పోరాడుతుందన్నారు.

నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో స్థానిక అధికార పార్టీ నేతల అవినీతి, ధనదాహానికి కనుమరుగైపోయిన పల్లగిరి-రాఘవాపురం కొండలను అక్రమ గ్రావెలింగ్‌తో పూర్తిగా కనుమరుగైన పరిస్థితిని చూపిస్తూ సెల్ఫీచాలెంజ్ విసిరారు.

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ నందిగామ-జగ్గయ్యపేట ఈ రెండు నియోజకవర్గాల మధ్య ప్రకృతి ప్రసాదించిన ఎర్రమట్టి పల్లగిరి కొండలను ఈ రోజున జగన్‌మోహన్‌రెడ్డి విధ్వంసకారుడై వారియొక్క నాయకులు, ఎమ్మెల్యేల చేత ఇలాంటి కొండల్ని గర్భం నుంచి తొలిచి అమ్ముకుంటున్నారు, సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు తెలియజేయాలని మేము ఇక్కడకు వచ్చామని పేర్కొన్నారు.

గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కూడలి గ్రామంనందు 3.5 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన బ్రిడ్జిని ఈ వైసీపీ ప్రభుత్వం రాగానే స్థల సేకరణ చేయకుండా రోడ్డు నిర్మాణాన్ని మరియు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిన పడకేసి నందిగామ మరియు వీరులపాడు మండలాల గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అసంపూర్ణంగా మిగిలిపోయిన బ్రిడ్జి నిర్మాణాన్ని చూపిస్తూ సెల్ఫీచాలెంజ్ విసిరారు.

వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామంలో పత్తి రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతన్న కంట కన్నీరు పెట్టిస్తుందని, పండించిన పంటకు కనీసం మద్దతు ధర కల్పించట్లేదని, పత్తి విత్తనాలను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. వీరులపాడు గోకరాజపల్లి గ్రామ కూడలిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు, పల్లెనిద్ర చేశారు. టిడిపి బస్సు యాత్ర నందిగామ నియోజకవర్గం టిడిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది.

జోన్-4 భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్రను రాజంపేట పార్లమెంట్ పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి అంగరంగ వైభవంగా బాణాసంచా, కేరళ డ్రమ్స్, డీజే, బైక్ ర్యాలీ తో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి సబ్ జైలు వద్దకు వెళ్లి సెల్ఫీ చాలెంజ్ దిగిన అక్కడ నుండి బయలుదేరి వాల్మీకిపురం టౌన్ లోకి ప్రవేశించి గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పట్టణంలో పాత బస్టాండ్ నుండి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు.

అటు నుంచి బయలుదేరి గుర్రంకొండ మండలం తరిగొండకు చేరుకోగానే మండల నాయకులు సాధర స్వాగతం పలికి ర్యాలీగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ వరకు విచ్చేసినారు. హజ్ రత్ మురాద్ షా వల్లి బాబా దర్గ వద్ద సెల్ఫీ దిగి అటు నుంచి బయలుదేరి గుర్రంకొండ టౌన్ కు చేరుకుని ర్యాలీగా పట్టణంలో సప్తగిరి బ్యాంకు నుండి నక్క మధు కల్యాణ మండపం చేరుకొని మీటింగ్ నిర్వహించారు.

మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం భారీ కార్ల ర్యాలీ తో ఎల్లుట్ల గ్రామం శీలంవారిపల్లికి చేరుకున్న ముఖ్య నాయకులు, కార్యాకర్తలకు మహిళలు హరతులతో, బాణాసంచాతో ఘన స్వాగతం పలికారు. శీలంవారిపల్లి లో వెలిసిన శ్రీ కాలభైరవ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే గ్రామస్తులు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించినారు. అక్కడే పల్లె నిద్ర నిర్వహించినారు.

ఈరోజు పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గం ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి , రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి ,తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ , పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి , మాజీ ఎమ్మెల్సీ & రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ,మాజీ ఎమ్మెల్యే షాజహాన్ , రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , రాష్ట్ర సాంస్కృతిక విభాగమ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ , రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి సోమల సురేష్ ,రాజంపేట పార్లమెంట్ బీ సీ సంఘం అధ్యక్షులు సురేంద్ర యాదవ్ , రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు , రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఆసూరి బాలాజీ , పీలేరు యువత అధ్యక్షులు మహేందర్ రెడ్డి , రాయచోటి నియోజకవర్గం ముఖ్య నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యం, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి,రాజంపేట నియోజకవర్గం నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు, రాష్ట్ర / నియోజకవర్గ / మండల / గ్రామ నాయకులు, తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

జోన్ -5 పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్ గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో గల గ్రామ దేవత వద్ద పూజలు చేసి, అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది, డాక్టర్ అంబేత్కర్ విగ్రహానికి పూల మాలు వేసి నాయకులు,కార్యకర్తలు అందరూ హాజరై బస్సు యాత్ర ను ప్రారంభించడం జరిగింది. నంతరం ఓర్వకల్ మండలం లొద్దిపల్లి గ్రామం చేరుకొని టీడీపీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. భోజన విరామం అనంతరం ర్యాలీగా బయలుదేరి ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో పాదయాత్ర చేసి ఊరి సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.

ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామంలో పాదయాత్ర చేసి డాక్టర్ అంబేత్కర్ విగ్రహానికి పూల మాలు వేసి ఊరి సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఓర్వకల్ మండలం లో కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్-గని గ్రామం మరియు APIIC పారిశ్రామిక కేంద్రం, జై రాజ్ ఇస్పాత్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ, విమానాశ్రయం, ఉర్దూ విశ్వవిద్యాలయం దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చెయ్యడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు NMD ఫరూక్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, పార్లమెంట్ ఇంచార్జి మండ్ర శివానంద రెడ్డి, MLC మరియు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బిటి నాయుడు,నియోజకవర్గ ఇంచార్జ్ లు గౌరు చరిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం సుబ్బారెడ్డి, జయ సూర్య మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ,రాష్ట్ర కమిటీ కార్యదర్శి వలసల రామకృష్ణ, ఏవీఆర్ ప్రసాద్ మరియు నంద్యాల పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, కర్నూలు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముంతాజ్ బేగం, నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లికార్జున మరియు పాణ్యం, ఓర్వకల్, గడివేముల, కల్లూరు మండల అధ్యక్షులు ముఖ్య నాయకులతో పాటు జిల్లాలో లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE