Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో అరాచకం, అక్రమం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయి

-నాలుగేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించి ఆయన ఆస్తులు పెంచుకున్నారు
-తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 42 వేలకోట్లు దోచుకున్న జగన్ రెడ్డి
-తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యునతి కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రకటించిన మినీ మేనిఫెస్టో వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలపడానికి చేపట్టిన చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) కార్యక్రమం

జోన్-3 టిడిపి చైతన్య రథయాత్ర శుక్రవారం నాడు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నిర్వహించారు. నియోజకవర్గం ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో, మండల పార్టీ అధ్యక్షులు సారథ్యంలో పామర్రు మండలం మంటాడ గ్రామంలోని వెంకటేశ్వర దేవస్థానంలో ప్రతేక పూజలు నిర్వహించి అనంతరం చైతన్య బస్సు యాత్ర ప్రారంభించారు. తదుపరి నిమ్మకూరులోని తెలుగుదేశం పార్టీ హయాంలో కొంతమేర పనులు మొదలు పూర్తి చేసిన BELL కంపెనీ వద్ద సెల్ఫీ పాయింట్ తీసుకొని అనంతరం నిమ్మకూరులోని ఎన్టీఆర్దం పతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

అనంతరం క్రోసూరు గ్రామంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను మరియు పాడైపోయిన రహదారుల వద్ద సెల్ఫీ తీసుకొని అనంతరం మొవ్వ గ్రామంలో పర్యటించి అక్కడ ఉన్న మహానుభావుల విగ్రహలకు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు అనంతరం కూచిపూడి కళాక్షేత్రం ను సందర్శించి అక్కడ సెల్ఫీ తీసుకున్నారు.

అనంతరం కృష్ణా పురం గ్రామ మరియు వీరంకి లాకుల గ్రామంలో పర్యటించారు అనంతరం కపిలేశ్వరాపురం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర,పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య,మాజీ మంత్రి దేవినేని ఉమా,పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసన సభ్యులు బోడె ప్రసాద్, గుడివాడ నియోజకవర్గం ఇంచార్జి మాజీ MLA రావి వెంకటేశ్వర రావు,మాజీ జడ్పీటిసి గద్దె అనురాధ, నియోజకవర్గ పరిసలకు జువ్వది రాంబాబు,పెడన నియోజకవర్గ ఇంచార్జి కాగిత కృష్ణ ప్రసాద్, పామర్రు నియోజకవర్గ ఇంచార్జి వర్ల కుమార్ రాజా,రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య ),రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్ ), నిమ్మగడ్డ సత్యసాయి,పులి కిరణ్ బాబు, కుదరవల్లిప్రవీణ్ చంద్ర, ఈడే ఫకీర్,రాజుల పాటి ప్రవీణ్ కుమార్,కొల్లూరు బాపూజీ, చలసాని రమేష్ చౌదరి, రాంబాబు మసిముక్కు,వీరపనేని శివరాం ప్రసాద్,లుక్క రేణుక రావు,ఖాజా విజయలక్ష్మి, చెన్నుపాటి వేణు,గుమ్మడి నాగబాబు,మైనేని ఇంద్ర,చెమిటి ఉమా, వీరంకి అరుణకుమారి,, లక్ష్మీ నాంచారమ్మ,, పువ్వాడ ఉషారాణి గోలి సింహాచలం,పాలడుగు మాధవి తదితరులు పాల్గొన్నారు.

జోన్-4 ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవిష్యత్తుకు తెలుగుదేశం భరోసా మహిళా సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం
తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ , తిరుపతి ఇంచార్జ్ మానూరు సుగుణమ్మ
వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, అన్నీ వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానివ్వటం తెలుగుదేశంతోనే సాధ్యమని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ , నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మానూరు సుగుణమ్మ అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నియోజకవర్గం లో నాయకులు పర్యటించి తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధిని సెల్ఫీలు తీసుకుంటూ , తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు.

మహాశక్తి ద్వారా ఆడబిడ్డ నిధి పథకం పేరుతో 18 నుండి 59 సం లు ఉన్న మహిళలకు ప్రతీ నెల 15 వందల రూపాయలు, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుతున్న ప్రతీ ఒక్కరికి 15 వేల రూపాయలు, దీపం పథకం పేరుతో ఉచితంగా యేటా 3 గ్యాస్ సిలిండర్లు, అక్క చెల్లెమ్మలందరికి ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమం కోసం ప్రవేశపెట్టటం జరిగిందని, నాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు మహిళలకు ఆస్థిలో సమాన హక్కు కల్పిస్తే, అనంతరం చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేయటం తెలుగుదేశం హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు.

తెలుగుదేశం మహిళా సంక్షేమ ప్రభుత్వం అని, రాబోయే ఎన్నికల్లో మహిళాలోకం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారని, రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశంతోనే సాధ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రిలు పనబాక లక్ష్మి, నల్లారి కిషోర్ కుమార్, బచ్చా చంగల్ రాయలు, బాలయ్య యాదవ్, గూడురూ నియోజకవర్గ ఇన్చార్జ్ పసిమ్ సునీల్ కుమార్,శ్రీకాళహస్తి ఎస్సీవి నాయుడు మాజీ ఫార్మర్ మినిస్టర్ పరసారత్నం, మరియు పార్లమెంట్ పరిధిలో స్టేట్, జిల్లా మరియు అనుబంధ కమిటీలు , తిరుపతి నియోజకవర్గానికి చెందిన టౌన్ పార్టీ అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇంచార్జిలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జోన్ -5 బనగానపల్లె నియోజవకర్గంలో బస్సుయాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో జోన్-5 బస్సు యాత్ర కార్యక్రమం బనగానపల్లె ఇంచార్జి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా బనగానపల్లి లోని పట్టణం మార్కెట్ యార్డ్ లో సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. అనంతరం పట్టణం నుంచి బైక్ ర్యాలీ చేసి నందవరం చేరుకొని శ్రీ చోడేశ్వరి మాత గుడిలో పూజ చేశారు.

అనంతరం ర్యాలీ గా బయలుదేరి పలుకూరు లో రోడ్ షో చేసి బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు NMD ఫరూక్, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, పార్లమెంట్ ఇంచార్జి మండ్ర శివానంద రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, బనగానపల్లి పరిశీలకుడు బాజీ చౌదరి ,నియోజకవర్గ ఇంచార్జ్ లు బీసీ జనార్దన్ రెడ్డి, ఎం సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు వలసల రామకృష్ణ, వి రామచంద్రరావు,ఏవీఆర్ ప్రసాద్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ సూర్య మరియు బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల మరియు సంజామల మండల అధ్యక్షులు ముఖ్య నాయకులతో పాటు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE