ఏపీలో అరాచకపాలన నడుస్తోంది. జగన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడు. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని చంద్రబాబు పై అక్రమంగా కేసు బనాయించి జైలు పాల్జేశాడు. విభజన తర్వాత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో 2014లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
గుజరాత్ సహా 8 రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. సీమెన్స్ సంస్థతో కలిసి 90 శాతం ఆ సంస్థ …10 శాతం ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. 4 ఏళ్లు సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కింద 6 మేజర్ సెంటర్లు, 36 స్కిల్ సెంటర్లు పెట్టడం జరిగింది. వాటిని నేను స్వయంగా సందర్శించాను.
ప్రజలకు అద్భుతమైన టెక్నాలజీ అందించాలని భావించిన చంద్రబాబు గారు ఆ సెంటర్లలో అత్యాధునిక శిక్షణ అందించారు. 2 లక్షల 30 వేల మందికి ఆ సెంటర్లలో శిక్షణిచ్చారు. 73 వేలమందికి ఉద్యోగాలొచ్చాయి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదు. మా ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలు కోసం చెల్లించిన రూ.371కోట్లలో రూపాయి దుర్వినియోగం కాలేదు.
ప్రతి రూపాయిని టీడీపీ ప్రభుత్వం సక్రమంగా యువత భవితకోసం సద్వినియోగం చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అని అబద్ధాలు చెప్పారు. నేడు అభూత కల్పనలు సృష్టించారు. 2021లో ఎఫ్ ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని అరెస్ట్ చేశారంటే మిమ్మల్ని ఏమనాలి?
స్కిల్ డెవలప్ మెంట్ విధి విధానాలపై కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో పాస్ చేయించుకుంటే మీరు వేధిస్తారా? తన అవినీతి బురదను ప్రత్యర్థులపైనా చల్లాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో మోసం చేశాడు. పోలవరం అటకెక్కాడు. సారా రాష్ట్రం చేశాడు. ఇసుక దోపిడీ చేశాడు. బాబాయ్ వివేకాను కిరాతకంగా హతమార్చాడు.
ఇవన్నీ బయటకు వస్తాయని, ప్రజలు ఆలోచిస్తారనే ఉద్దేశంతో కుట్ర చేశాడు. విచారణ పేరుతో చంద్రబాబు ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. విచారణ వీడియోలు సాక్షి చానెల్ కి ఎలా వచ్చాయి? సీఐడీ ఆఫీసా లేక వైసీపీ కార్యాలయమా? గంటలకు గంటలు చంద్రబాబును తిప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు.
చంద్రబాబు అరెస్ట్ అక్రమమని పలు పార్టీలు మాట్లాడితే వారిపై దిగజారి విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఆంధ్రుడు మేల్కొనాలి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేం ప్రజల్లోకి వెళతాం. జగన్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తాం.