Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రా చౌతాలా చంద్రబాబు

– చంద్రబాబు చేసింది సాదాసీదా క్రైం కాదు
– రూ.118 కోట్ల ముడుపుల ఐటీ నోటీసులు చాలా సీరియస్‌ క్రైం
– చంద్రబాబు అవినీతి సముద్రంలో ఇది ఒక నీటిబొట్టు మాత్రమే
– తండ్రీ కొడుకులు ఇద్దరూ జైలుకు వెళ్లడం ఖాయం
– ఎన్నికలకు ముందే టీడీపీ టోటల్‌గా దివాళా
– వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి

ఐటీ నోటీసులతో చంద్రబాబు విలవిలలాడుతున్నాడు:
-ఐటీ నోటీసుల విషయంలో చంద్రబాబు గిలగిలా కొట్టుకుంటూ విలవిల్లాడుతున్నాడు.
-ఐదు రోజులుగా చంద్రబాబు, ఆయన తనయుడు, ఎల్లో మీడియా అంతా ఎక్కడి దొంగలు అక్కడే .. అన్న చందంగా ఉన్నారు.
-తమ మీడియాలోనే కాకుండా ఇతర మీడియాల్లోనూ ఆ వార్తలు రాకుండా మేనేజ్ చేయడం అత్యంత జుగుప్సాకరం.
-ఎల్లో సిండికేట్‌ జర్నలిజాన్ని.. వ్యాపార సిండికేట్‌గా మార్చుకుని బాబుకు భజన చేస్తున్నారు.
– చంద్రబాబు వెన్నుపోటు పొడిచినా, ఓటుకు కోట్లు కేసైనా, అమరావతి స్కాం, ఐటీ స్కాం ఏదైనా ఎలా కవరప్‌ చేయాలా అనే ప్రయత్నంలో ఎల్లో మీడియా ఉంటుంది.
-తాను ఎటువంటి అవినీతి చేసినా అది తనకు కనిపించదని చంద్రబాబు అనుకుంటాడు. ఆయన అపర ధృతరాష్ట్రుడు లాంటి వాడు.
-ఆయన వందిమాగధులు కూడా కళ్లకు గంతలు కట్టుకున్న గొప్ప వ్యక్తులు.
-ఈ గాంధారుల లిస్టులో మొదటి వాడు రామోజీరావు. రెండోవాడు రాధాకృష్ణ, మూడోవాడు టీవీ5 నాయుడు, మిగతా స్థానాల్లో దత్తపుత్రుడు, పురందేశ్వరి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంతా ఉన్నారు.
-మాకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియాతో సమస్య లేదు కానీ చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియాగా మారిన రామకృష్ణ, నారాయణలతోనే సమస్య.

ఇది చంద్రబాబు అవినీతి సముద్రంలో ఒక నీటి బొట్టే:
-చంద్రబాబుకు అవినీతి కొత్త కాకపోయినా ఇది సాదాసీదా క్రైం కాదు.
– అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం, హైకోర్టు నిర్మాణం పేరుతో రూ.118 కోట్ల ఐటీ నోటీసులు చాలా సీరియస్‌ క్రైం.
– ఇది చంద్రబాబు అవినీతి సముద్రంలో ఒక నీటిబొట్టు మాత్రమే.
– ఐటీ నోటీసుల్లో 4 పేజీలు చదివే సరికే వీళ్లకు తడచిపోతోంది.
– అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
– రెండు మూడు రోజుల్లో అరెస్టు అయ్యే అవకాశం ఉందని హింట్‌లు ఇస్తున్నాడు.
– అప్పుడైనా అరెస్ట్‌ చేయరేమోనని ఆయన ఆశ..అలాంటి మొహమాటాలు ఏవీ ప్రభుత్వాలకు- చట్టాలకు ఉండవు.
– నువ్వు వృద్ధుడువని వదిలేయదు… ఎవ్వరు తప్పు చేసినా వదిలే పరిస్థితి ఉండదు.
– చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది.

ప్యాకేజీ లెక్కలు బయటపడతాయనేనా..?:
– పవన్‌ కల్యాణ్‌…మీరు ఎక్కడ బాబూ..? మాయమై పోయారు…పత్తా లేకుండా పోయారు..మీ ట్విట్టర్‌ కూడా మూగబోయింది.
– బాబును ప్రశ్నిస్తే నీ ప్యాకేజీ లెక్కలు బయటపడుతుందని భయమా..?
– పురంధేశ్వరి.. బాబుకు రూ. 118 కోట్ల ముడుపులకు సంబంధించి ఐటీ నోటీసులు ఇస్తే, మీకు ఇది సాధారణ విషయంగా ఎలా కనిపిస్తోంది..?
– పేద ప్రజల సొమ్ము తినేస్తే.. బాబు అవినీతికి మీ బంధుప్రీతి అడ్డమొస్తుందా..?
– కాంగ్రెస్‌ ఉందో లేదో తెలియదు..సీపీఐ నారాయణ ఎక్కడ చికెన్‌ తింటున్నాడో తెలియడం లేదు.
– మాకు ఇవేం కనపడవు..వినపడవు అంటూ ఒక్క వార్త రాయని పచ్చ మీడియాకు అసలు సిగ్గనిపిండటం లేదా?

ఆంధ్రా చౌతాలా చంద్రబాబు
– ఈ నోటీసులు కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు బాబు అవినీతి చిట్టా మరింతగా బయటకు వస్తుంది.
– వీటి నుంచి డైవర్ట్‌ చేసేందుకే లోకేష్ యువగళం యాత్రలో రౌడీలకు ఎర్ర టీ షర్టులు వేయించి, భీమవరంలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు.
– రాబోయే రోజుల్లో కఠినమైన శిక్షలకు మీరు సిద్ధంగా ఉండండి.
– తండ్రీ కొడుకుల మీద ఉన్న సాక్షాధారాలను బట్టి మీకు అరెస్ట్‌ తప్పదు.

LEAVE A RESPONSE