Suryaa.co.in

Andhra Pradesh

పీఆర్సీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ మద్దతు

ఈరోజు విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు అధికారంలోకి వచ్చిన వెంటనేపరిష్కరిస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా సెక్షన్78(1)కి విరుద్ధమైన జీవో ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జిఓని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ జీఓ విభజన చట్టం ప్రకారం విరుద్ధమైనదని దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతారని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని ఉద్యోగులకి న్యాయం చేయాలని కోరారు. అంతే కాదు ఉద్యోగుల ఉద్యమానికి తమ ఫెడరేషన్ తరుపున సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ఉద్యోగ సంఘాలు కోరితే అన్ని జిల్లాల్లో తమ ఫెడరేషన్ నాయకులు ప్రత్యక్షంగా వారితో ఉద్యమాల్లో పాల్గొంటానికి సిద్ధమని ప్రకటించారు. మడం తిప్పమని మాట తప్పనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగులకే కాదు అన్నివర్గాల వారికి మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక కమిటీ పేరుతో మరోమారు ఉద్యోగులని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మా ఛైర్మన్ గారి పిలుపు మేరకు ఉద్యోగుల సమ్మెలో పాల్గొనటానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు భాను, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE