– ఏపీలో రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు
– ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపీలో బహుముఖీయ పేదరికం నుంచి 30.02 లక్షల మంది బయటపడ్డారని నీతి ఆయోగ్ తెలిపిందని రాజ్యసభ సభ్యులు,వైయస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు.సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఐదేళ్ల కాలంలో (2015–16…2019–2021) ఆంధ్ర రాష్ట్రంలో దారిద్య్రం తగ్గిన వివరాలు సోమవారం వెల్లడయ్యాయని చెప్పారు.. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–4 ఐదు సంవత్సరాల క్రితం (2015–2016) ఆంధ్రప్రదేశ్ లో పేదల సంఖ్య 11.77 శాతంగా ఉందని చెప్పారు.. తర్వాత ఐదేళ్ల కాలంలో జరిగిన పేదరిక నిర్మూలన కృషి వల్ల 2019–2021 నాటికి రాష్ట్రంలో దారిద్య్ర రేఖ దిగువున ఉన్నవారి సంఖ్య 6.06 శాతానికి తగ్గిందని జాతీయ కుటుంబ సర్వే–5లో తేలిందన్నారు.
అంటే ఆంధ్రలో ఈ ఐదేళ్ల కాలంలో 5.71 శాతం మంది పేదరికం నుంచి విముక్తి పొందారని ఈ సర్వే లో తెలిందన్నారు. దేశంలో పేదల సంఖ్య తగ్గించిన రాష్ట్రాల జాబితాలో నిష్పత్తిపరంగా ఏపీ 17వ స్థానంలో ఉందని చెప్పారు. విద్య, వైద్యం వంటి 12 అంశాల ఆధారంగా ఈ కుటుంబ సర్వేలను నిర్వహించారని తెలిపారు.
జాతీయ బహుముఖీయ పేదరిక సూచీ–ప్రగతి సమీక్ష–2023 పేరుతో రూపొందించిన దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాల ఫలితాలను నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్, అరవింద్ విర్మాణీ, సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు సుమన్ భేరీ నిన్న విడుదల చేశారని తెలిపారు. అధికంగా తగ్గిన పేదల సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందని ఈ సర్వేలో తెలిందన్నారు..
ఎగుమతుల విషయంలోనూ ఏపీ స్థితి మెరుగవుతోంది
దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎగుమతుల విషయమై జరిపిన సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ 2021తో పోల్చితే 2022లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని తెలిపారు. ఎక్స్ పోర్ట్ ప్రిపేర్డ్ నెస్ ఇండెక్స్–2022 (ఎగుమతుల సన్నద్ధత సూచీ) ప్రకారం ఏపీ దేశంలో 8స్థానంలో ఉందని చెప్పారు. మొత్తంమీద ఎగుమతుల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి 59.27 శాతం స్కోరు లభించిందన్నారు.
నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం తీర ప్రాంత రాష్ట్రాల్లో ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని (ఐదో స్థానం) ఈ ఏడాది కూడా నిలుపుకుందని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎగుమతుల వృద్ధికి అమలు చేసే పాలసీలు, వ్యాపార–వాణిజ్యాలకు దోహదం చేసే పరిస్థితులు, ఎగుమతులకు అనువైన వాతావరణం, ఎగుమతులు చేసే తీరు వంటి అంశాల ఆధారంగా నీతి ఆయోగ్ ఈ అంచనాలు రూపొందించిందని ఆయన తెలిపారు..
ఏపీలోకి రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ లో గత ఆర్థిక సంవత్సరం 2022-23 ఏడాదిలో రికార్డు స్థాయిలో 284.22 మిలియన్ల యూఎస్ డాలర్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ తెలిపారని వి. విజయసాయిరెడ్డి చెప్పారు.
విదేశీ పెట్టుబడుల విషయంలో రాజ్యసభ ద్వారా తెలుగు దేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంపై చేయాలనుకున్న దుష్ప్రచరాన్ని కేంద్రం ఇచ్చిన ఈ సమాదానం తిప్పికొట్టిందన్నారు . రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ధైర్యం టిడిపి అనుకుల మీడియాకు ఉందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు..