– కొనియాడిన గుజరాత్ గవర్నర్ , దేశ ప్రధాని
బనగానపల్లె మండలం యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం లో ప్రకృతి వ్యవసాయం రైతులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెలీ కాన్ఫరెన్స్ లో ప్రసంగించడం జరిగింది. మరియు కేంద్ర వ్యవసాయ శాఖ నరేంద్ర సింగ్ తోమర్ గుజరాత్ గవర్నర్ ప్రసంగించడం జరిగింది.
గోమయం, గోమూత్రంతో వ్యవసాయం చేయడం వల్ల భూమిలోని సేంద్రీయ పదార్థాన్ని పెంచవచ్చని అలాగే సేంద్రీయ వ్యవసాయ విధానం లో పండించిన పంటలను తినడం వలన జీవన ప్రమాణాలు నేల యొక్క సారం పంటల నాణ్యత పెంపొందించవచ్చు అని దేశంలోని వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీలు చెబుతున్నాయని దేశంలోని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం బాట పట్టాలని సేంద్రీయ వ్యవసాయ విధానం లో ఆంధ్ర ప్రదేశ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నారని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే వ్యవసాయ విధానాన్ని అవలంబించాలని గవర్నర్ ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరియు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది మాస్టర్ టైలర్స్ యూనిట్ ఇంచార్జ్ లు ఐ సి ఆర్ పి లు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది.