Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక క్రమశిక్షణ లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

-రాష్ట్ర ఆర్థిక స్థితి మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి 
-ఏపీలో పెట్టుబడి వ్యయం పై వైస్సార్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి 
-బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి
మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులే లేవు ,రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆశ్చర్యం *. ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక ఖర్చు నిష్ఫలం అని చేప్పిన కాగ్‌ నివేదిక పై జగన్ గారు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వండి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయమే 88.65% ఉండటంతో ఆస్తుల కల్పనకు 11.35% మాత్రమే వినియెగించడం ఏంటి ? స్థిర మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆస్తిని సృష్టించారో వైకాపా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బిజేపీ డిమాండ్ చేస్తుంది.దేశంలో ఓక రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన అప్పులు చెల్లించకుండా , అప్పులు కట్టడం కోసం కొత్త అప్పులు తీసుకుని, వాటిని గతంలో అప్పులు సైతం చెల్లించకుండా వడ్డీని మాత్రమే చెల్లించి, మిగిలిన ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్ళించే ఆర్థిక క్రశిక్షణలేని ఏకైక ప్రభుత్వం ఒక్క వైకాపా మాత్రమే .

LEAVE A RESPONSE