సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీ
వినోద్ కుమార్ తో భేటీ అయిన సీపీఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, అంగన్ వాడి యూనియన్ ప్రతినిధులు
గత 19 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం నిరవధికంగా చేస్తున్న సమ్మెను రాష్ట్ర అంగన్ వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ( ఏ.ఐ.టీ.యు.సీ., సీ.ఐ.టీ.యు. ) ప్రతినిధులు విరమించారు.
శుక్రవారం మంత్రుల నివాసంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో సీపీఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అంగన్ వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సమ్మె చేయాల్సి వచ్చిన పరిస్థితులను వారు వినోద్ కుమార్ కు వివరించారు.సమస్యలను, డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీనిచ్చి.. సమ్మెను విరమించాలని సూచించారు.
వినోద్ కుమార్ హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు అంగన్ వాడి టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ( ఏ.ఐ.టీ.యు.సీ., సీ.ఐ.టీ.యు. ) నాయకులు జయలక్ష్మి, కరుణ కుమారి, చందన, రజిత, పద్మ, వెంకటమ్మ, యూసుఫ్, సమ్మయ్య ప్రకటించారు.