October 3, 2026

అంగన్‌వాడీలే అసలైన వారధులు

  • మల్కాజిగిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల అసమాన ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లో అంగన్‌మిలాన్‌సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుతో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో గర్భిణీ లు, నవజాత శిశువులు, చిన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ, అంకితభావంతో పనిచేస్తున్న అంగన్‌‌ వాడీ సిబ్బందిని మరియు ఆశా వర్కర్లను ఘనంగా సత్కరించి వారి సేవలను అభినందించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ముఖ్యంగా మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని కొనియాడారు.

గ్రామీణ స్థాయి వైద్య, ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో అంగన్‌ వాడీ మరియు ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, సంక్షేమ ఫలాలను ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటి గడపకూ చేరవేయడంలో వీరే అసలైన వారధులని ప్రశంసించారు. దేశ ప్రగతిలో మన మాతృశక్తి భాగస్వామ్యం వెలకట్టలేనిదని, నేడు గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది మహిళల ఆధ్వర్యంలోనే విజయవంతమవుతున్నాయని తెలిపారు. మహిళలకు గౌరవం పెంచేలా భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి , మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్.కే. శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి బొల్లేపల్లి మాధవి , సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం కన్వీనర్ ముత్యం రెడ్డి , ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ బాల చందర్ గౌడ్ , మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ధనలక్ష్మి , మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు శైలేష్ రెడ్డి , ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మార్నేని ఫణీంద్ర , మల్లాపూర్ ప్రధాన కార్యదర్శి యాదగిరి చారి , సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్, గడ్డం సాయి కిరణ్, గోనె శ్రీకాంత్ , మహేష్ , శివ , తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Total Visitors: 2,854,740