(చాకిరేవు)
జగన్ వచ్చినా.. నెల్లూరులో బంగారుపాళ్యం చూపించుకోవాలి. ఇదీ నా తడాఖా అని వందమందితో డీఎస్పీ కార్యాలయం వద్ద బలప్రదర్శన చేసి, తాడేపల్లికి తన తడాఖా చూపాడు అనిల్ కుమార్ యాదవ్!
నన్నా మీరు నెల్లూరులో మీ వాళ్ల చెప్పుడు మాటలు విని, కనీసం నెల్లూరు జిల్లాలో టికెట్ ఇవ్వకుండా.. నరసరావుపేట పంపి ఓడించేది అని తాడేపల్లికి పరోక్షంగా హెచ్చరిక పంపాడు. తనదైన శైలిలో డీఎస్పీ కార్యాలయం ముందు తన అనుచరుల అల్లరిని నియంత్రించాడు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అనిల్‌ను ప్రశ్నిస్తున్నారు.
జగన్ వచ్చినప్పుడు జన సమీకరణ చెయ్యని అనిల్ కుమార్ యాదవ్, తన బిల్డప్ చూపించుకోడానికి ఇలా చేస్తున్నాడని నెల్లూరు వైకాపా వర్గాలు తాడేపల్లికి ఫిర్యాదు చేశారట.
అసలే జగన్ పర్యటన వైఫల్యం అయ్యి, నెల్లూరులో బంగారుపాళ్యం అని ట్రోల్స్‌కు గురై, మహిళల మీద వాగింది చాలక, పుండు మీద కారంలా ఈ బలప్రదర్శన ఎందుకు చేశాడనే చర్చ నెల్లూరు వైసీపీ వర్గాల్లో మొదలైంది.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నను జగన్, అనిల్ ఇద్దరూ సమర్థించడంపై వైసీపీ మహిళా నేతలు అసహ్యించుకుంటున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల నెల్లూరులో పార్టీ మనుగడ కష్టమేనని సీనియర్ వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.