Suryaa.co.in

Andhra Pradesh

కల్తీసారా, జేబ్రాండ్ల మద్యం అమ్మకాలు జగన్ రెడ్డి అమలుచేస్తున్న పదోరత్నం

– ఆ రత్నమే రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలన్నింటికీ కారణం. సదరు పదోరత్నంతో ముఖ్యమంత్రి తనకుపనికొచ్చేవిమాత్రమే చేస్తున్నాడు.
• ఉత్తుత్తి దిశా యాప్ తో మహిళల మానప్రాణాలు ఎంతవరకుకాపాడాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.
• దిశాయాప్. దిశాచట్టంతో మహిళలకు ఒనగూడని న్యాయం.. దిశాద్విచక్రవాహనాలతో ఒరుగుతుందా జగన్ రెడ్డి?
• నాటుసారా, కల్తీమద్యం, డ్రగ్స్ లాంటివాటిని అరికట్టకుండా, రాష్ట్రంలో మహిళా భద్రత ఎలా సాధ్యమవుతుందో సమాధానంచెప్పు జగన్ రెడ్డి.
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

వైసీపీప్రభుత్వపాలనలో రాష్ట్రం దుశ్వాసనులు, దుర్మార్గులకు అడ్డాగామారితే, ఏపీలో మహిళాభద్రతఅనేది ప్రశ్నార్థకంగా మారిందని, జగన్మోహన్ రెడ్డి మహిళాద్రోహి అనిచెప్పడానికి అనేకఉదాహరణలు ఉన్నాయని, వాటిలో సొంతతల్లి, చెల్లికి ఆయనచేసిన అన్యాయంతోపాటు, తనకు ఓట్లేసిన ఎందరోఅక్కచెల్లెమ్మల మానప్రాణాలు పణంగాపెట్టిమరీ, తానుసాగిస్తున్న మద్యవ్యాపారంవంటి అనేకనిదర్శనాలు ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగుమహిళరాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
బుధవారం ఆమె జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.. ఆ వివరాలు ఆమె మాటల్లోనే ..!

జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, అతని వ్యవహారశైలి మహిళల మనుగడకే ప్రమాదకరంగా మారాయి. జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీమద్యం, నాటుసారా విక్రయాలకు మహిళల మాంగల్యాలు పుటుక్కున తెగుతున్నాయి. జంగారెడ్డి గూడెంలో సంభవించిన కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వహత్యలే. అక్కడచనిపోయినవారితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 మంది కల్తీసారా, మద్యంమహమ్మారికి బలి అయ్యాయి. అటువంటి మరణాలను ఆపాలన్న ఆలోచనకూడా ఈ ముఖ్యమంత్రి చేయకపోవడం దుర్మార్గం.

ప్రజలప్రాణాలంటే వైసీపీ నేతలకు, ముఖ్యమంత్రికి అసలు లెక్కేలేదు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏంచెబితే దానికి వైసీపీసభ్యులు, మంత్రులు భజనచేస్తూ తానతందాన అంటున్నారు. చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోని ముఖ్యమంత్రి, ఆయనపరివారం ఆఖరికి నోటిమాటగా కూడా వారికి భరోసాఇవ్వలేని దుస్థితిలో ఉండటం సిగ్గుచేటు. ఇలాంటి వాళ్లనా మనం ఎన్నుకుందని ప్రజలంతా సిగ్గుపడుతున్నారు. జంగారెడ్డిగూడెంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా చనిపోతున్నవారి చావులన్నీ ముఖ్యమంత్రి ధనదాహానికిబలిఅవుతున్నవే అనిచెప్పడానికిఎలాంటి సంకోచంలేదు.

ఇసుక, ఖనిజసంపదను దోచుకుంటున్న జగన్ రెడ్డి.. ఆఖరికి కల్తీమద్యం, నాటుసారా, గంజాయి, ఇతరమాదకద్రవ్యాల అమ్మకాలతో ప్రజలప్రాణాలు తీస్తూ ఆడబిడ్డల మాంగల్యాలు తెంచేస్తున్నాడు. తానుసాగిస్తున్న మద్యంవ్యాపారం..దానిలోతనపార్టీవారికి ఉన్న వాటాలు బయటపడతాయనే ముఖ్యమంత్ర్రి సభలో నాటుసారా మరణాలపై చర్చించకుండా తప్పించుకుంటున్నాడు. అక్కడే ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రిశవం పక్కనే సీఎం కుర్చీ కోసం సంతకాలు సేకరించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.

కల్తీసారా, జే బ్రాండ్లమద్యం అమ్మకాలను ముఖ్యమంత్రి పదోరత్నంలా అమలుచేస్తున్నాడు. ప్రజల్ని తనమద్యం బ్రాండ్లకు బానిసల్ని చేస్తూ, వాటినే వారంతా తాగేలా నిర్బంధతాగుడు పథకాన్ని, తనకుమాత్రమే పనికొచ్చే పథకంలా అమలు చేస్తూ, అయినకాడికి ప్రజలప్రాణాలుతీస్తూ దోచుకుంటున్నాడు. సభలో టీడీపీసభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానంచెప్పలేని ముఖ్యమంత్రి, తనపార్టీ మహిళాప్రజాప్రతినిధులతో సిగ్గులేకుండా డబ్బాలు కొట్టించుకుంటున్నాడు.

భర్త తాగితేనే భార్యకు చేయూత-కొడుకు తాగితేనే తల్లికి అమ్మఒడి.. ఇదేనా జగన్ రెడ్డి సంక్షేమపాలన? ఆడబిడ్డలకు జగన్ రెడ్డి తీరనిద్రోహంచేస్తున్నాడు అనడానికి భర్తలతో తాగిస్తూ, భార్యలకు చేయూతఇవ్వడమే పెద్దఉదాహరణ. మహిళలమాంగల్యాలు తెంచుతూ, వారికి తూతూమంత్రంగా ఏదో కొద్దిగా డబ్బులిస్తూ, వారిని ఉద్ధరిస్తున్నట్టుగా, మహిళాభద్రతకు తానే పెద్దపీటవేస్తునట్టు, సభలోనేడు జగన్ రెడ్డి ఊదరగొట్టాడు. ఎవరో తనకునచ్చినవారికి రెండు మంత్రి పదవులు ఇచ్చి మహిళలను ఉద్ధరిస్తున్నానంటే సరిపోతుందా..

జగన్ రెడ్డీ, నీకునిజంగా దమ్ము, ధైర్యముంటే నీతల్లిని, నీఇద్దరు చెల్లెళ్లను పక్కన కూర్చోబెట్టుకొని మీడియాతో మాట్లాడు. అప్పుడు తేలుతుంది నీ సత్తాఏంటో..నువ్వేంటో? ఒకచెల్లి అయితే ఏకంగా నిన్ను ముఖ్యమంత్రిని చేయడంకోసం తనతండ్రినే కోల్పోయింది. అలాంటి చెల్లి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో తనప్రాణాలకు రక్షణలేదని మీడియాతోచెప్పుకొని వాపోయింది. అదీ నువ్వు ఆమెకుచేసినగొప్ప సాయం? ఆడబిడ్డలను. వారిపిల్లల్ని అనాథల్నిచేస్తూ, కుటుంబాలను రోడ్డున పడేయడమేనా జగన్ రెడ్డి చెబుతున్న మహిళా సాధికారతా? అలాంటినువ్వు మహిళల్ని ఉద్దరించడానికి దిశయాప్ తెచ్చాను..

ద్విచక్రవాహనాలు తెచ్చానంటూ జెండాలుఊపితే సరిపోతుందా జగన్ రెడ్డీ?
ఉత్తరకుమారుడైన జగన్ రెడ్డితెచ్చిన తీసుకొచ్చిన ఉత్తుత్తి దిశా యాప్ ఎందరు మహిళల మానప్రాణాలు కాపాడిందో ఆయన చెప్పగలరా? అసలు మహిళా హోంమంత్రికే దానిపై అవగాహనలేదు. దిశాచట్టం, యాప్ లానే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రారంభించిన దిశా పెట్రోలింగ్ వాహనాలు కూడా ఉత్తుత్తిబొమ్మవాహనాలుగానే, అలంకారప్రాయంగానే మిగిలిపోతాయని ఘంటాపథంగాచెప్పగలం. ఆ వాహానాలతో అత్యాచారాలు ఆగిపోతాయని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటిఉండదు. నిన్నటికినిన్నకూడా నెల్లూరుజిల్లా వెంకటగిరిలో ఒకఉన్మాది మహిళగొంతుకోశాడు.

దానికి కారణం ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వ చేతగానితనంకాదా? నాటుసారా తాగినఇద్దరు ఆటోడ్రైవర్లు మహిళలపై అత్యాచారయత్నానికి ఒడిగట్టి, వారిని వేధించిన ఘటనఆళ్లగడ్డలో జరిగింది. ఇవేవీ ముఖ్యమంత్రికి తెలియదా? ఇన్నిజరుగుతున్నా రాష్ట్ర మహిళాకమిషన్ ఏంచేస్తుందో తెలియదు? మహిళాహోం మినిస్టర్ కు తన పదవిఉంటే ఎంత..లేకపోతే ఎంతా? ఆడబిడ్డలను కాపాడలేని తనపదవి తనకుఎందుకని ఆమె రాజీనామాచేసుంటే మహిళాలోకం ఆమెను నెత్తినపెట్టుకొని ఉండేది. నాటుసారా అమ్మకాలతోనే నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత, ముఖ్యమంత్రి అసమర్థత, చేతగానితనంవల్లే రాష్ట్రంలో మృగాళ్లు చెలరేగిపోతున్నారు.

ప్రజాస్యామ్యంలో దేవాలయంగా విలసిల్లాల్సిన చట్టసభలను, జగన్ రెడ్డి కౌరవసభలకంటే దారుణంగా తయారుచేశాడు. అసెంబ్లీలో మహిళలపై వైసీపీ నేతలు అసభ్యపదజాలంతో మాట్లాడుతుంటే హోంమంత్రికి సిగ్గుగా అనిపించడంలేదా? ఒకడేమో అసెంబ్లీలో ముండా అంటాడా.. మరొకడేమో తల్లిని, భార్యలను తిడతాడా? అలాంటివాళ్లకు తల్లి, చెల్లి, కూతుళ్లు లేరా? అలాంటితిట్లమధ్యన నవ్వుకుంటూ సభలో కూర్చున్నారంటే మీరెలాంటి వారో అక్కడే అర్థమవుతోంది. రేపు భవిష్యత్ లో మిమ్మల్ని తిడితే అలానే నవ్వుతారా? నాటుసారా తాగి 26మంది చనిపోతే కనీసబాధ్యత కూడాలేకుండా ప్రవర్తిస్తారా? మానం, అభిమానం, సిగ్గున్నవారెవరైనా సభలో అలా ప్రవర్తిస్తారా?

ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుతూ, పాలనచేస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? టీడీపీనేతలు ఎక్సైజ్ కార్యాలయాలను ముట్టడించకుండా వారిని గృహనిర్బంధంచేయించడంలో చూపిన ముందుచూపును, ఈ ముఖ్యమంత్రి ఆడబిడ్డలను కాపాడటంలో చూపితే నిజంగానే సంతోషించేవాళ్లం. రాష్ట్రంలో రోజురోజుకీ మహమ్మారిలా వ్యాపిస్తున్న కల్తీమద్యం, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, వాటిసరఫరా అరికట్టకుండా మహిళా భద్రత ఎలాసాధ్యమవుతుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.మహిళా పోలీస్ స్టేషన్ల లో పనిచేసే మహిళలకే నీప్రభుత్వంలో రక్షణలేని దుస్థితి. మహిళా భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నావు ..జగన్ రెడ్డీ… ఖబడ్దార్.

LEAVE A RESPONSE