-తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
జగన్ రెడ్డి పాలనలో దళిత గిరిజన మహిళల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, హక్కుల కోసం అడిగితే ట్రాక్టర్‌తో తొక్కిచ్చి చంపడం సర్వసాధారణంగా మారిపోయిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.
శుక్రవారం పల్నాడులోని రెంటచింతల మండలం, మల్లవరంలో సామునిభాయి అనే గిరిజన మహిళను వైకాపా మద్దతుదారుడు మణికంఠ నాయక్ ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం హృదయవిధారకమని వాపోయారు. సైకో పాలనలో దళిత, గిరిజన మహిళలపై దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ‘2020 ఆగష్టులో గుంటూరు జిల్లా, నకిరేకల్లు మండలం, శివాపురం తండాకు చెందిన మంత్రూబాయి అనే గిరిజన మహిళను వైకాపాకు చెందిన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో దాడి చేసి చంపాడు.
గత ఏడాది జూన్‌లో ప్రకాశం జిల్లా, టంగుటూరి మండలం, రావివారిపాలెంలో హనుమాయమ్మ అనే దళిత మహిళను కోటేశ్వరరావు అనే వైకాపా నాయకుడు ట్రాక్టర్‌తో ఇదే తరహాలో అతిదారుణంగా హత్య చేశాడు. జగన్ రెడ్డి పరిపాలనలో నోరు తెరిచి హక్కులు అడగడమే నేరమన్నట్లు వైకాపా నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. జగన్ రెడ్డి పైశాచికత్వం, సైకోయిజం క్రింది స్థాయి వైకాపా కార్యకర్తలకు కూడా సోకినట్లు ఉంది. దాహార్తి కోసం నీళ్లడితే మహిళ అని కూడా చూడకుండా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?
మనం రాతియుగంలో ఉన్నామా లేక, నాగరిక యుగంలో ఉన్నామా? జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలను, నాయకులను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. జగన్ రెడ్డి నమ్ముకుని రెచ్చిపోతే వైకాపా వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఉన్మాధంతో రెచ్చిపోతూ మహిళలపై అగాయిత్యాలకు పాల్పడుతున్న వైకాపా నాయకులను రాబోయే తెదేపా-జనసేన ప్రభుత్వంలో చట్టం ముందు నిలబెడుతామన్నారు.