– ఒకదాని తరువాత ఒకటి అనర్థాలు
– సూట్ కేసులు లెక్కపెట్టుకొనే పని భారతి రెడ్డిది
– అసెంబ్లీ హాల్ లోకి చంద్రబాబు రాలేదు
– తల్లిని చెల్లిని వదిలేయడం వారిని వెన్నుపోటు పొడవడం కాదా?
– చంద్రబాబునాయుడు ద్రౌపది ముర్ముకు ఓటేయడం వెన్నుపోటు ఎలా అవుతుంది?
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
జగన్ రెడ్డి మూడు సంవత్సరాల అరాచక పాలనంతా ఐరన్ లెగ్ మయంగా సాగింది. అతని ఐరన్ లెగ్ వల్ల అధికారం చేపట్టిన నాటి నుండి అన్నీ విపత్తులే. ప్రపంచానికే కరోనా వచ్చింది. ఒకదాని తరువాత ఒకటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వరదలు రావడం, పడవలు మునిగిపోవడం వంటి ఎన్నో పరిస్థితులు వచ్చాయి.
ఇటువంటి పరిస్థితులలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోకపోగ కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించి జగన్ ముఠా ప్రజలను మోసం చేశారు. పేద ప్రజలు విపత్కర పరిస్థితులలో వున్నప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ప్రజలకు అందించడం రాష్ట్ర బాధ్యత. కోర్టులు వైసీపీ వాళ్ళకి ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన, అక్షింతలు వేసిన దున్నపోతు మీద వాన కురిసినట్టు వైసీపీ వ్యవహార శైలి ఉంది. ఎవరు ఎన్ని అనుకున్న పర్లేదు వాళ్ళ జేబు నిండుతోందా లేదా, భారతమ్మ ఖజానా నిండుతుందా లేదా, సాక్షి పేపర్ కి ప్రకటనలు వస్తున్నాయా లేదా అనే విధంగా ప్రవర్తిస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు.
కరోనా 2 సంవత్సరాలు రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్నే వణికించింది. కరోనాని చూసి అగ్ర రాజ్యాలైన అమెరికా లాంటి దేశాలు కూడా వణికిపోయాయి. జగన్ రెడ్డి మాత్రం బ్లీచింగ్ పొడి చల్లితే సరిపోతుంది, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పడం అవివేకం. అనేక మంది పెద్దలు, చిన్న పిల్లలు, యువకులు చనిపోతున్న విపత్కర పరిస్థితులలో వాళ్ళకి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు రూ.11 వందల కోట్లు రాష్ట్ర గవర్నమెంట్ కి ఇచ్చి కరోనా బాధితులకి, కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా వుండి ఈ డబ్బుకు మరి కొంత డబ్బును జతచేసి కరోన బాధిత కుటుంబాలకి అందచేయమంటే కేంద్రం ఇచ్చినవి ఇవ్వక పొగా, రాష్ట్రం ఇవ్వవలసినవి ఇవ్వక పొగా అవి ఎం అయ్యాయో కూడా అంతు చిక్కని పరిస్థితి. కోర్టులు కూడా దీనిని నిర్దారించి తక్షణం ఈ 11 వందల కోట్ల రూపాయలు జమ చేయాలని చెప్పడం దురదృష్టకరం.
కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి 2వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు 2వేలు? పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి కి, మీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ వస్తే 2 వేలు ఇచ్చారా? 2వేలు ఎవరికి ఇచ్చారో లెక్కలు చూపించే దమ్ము, ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి ఉందా? ఈ విధంగా ప్రజలని మోసం చేస్తూ సామాజిక న్యాయం గురించి ముఖ్యమంత్రి, వైసీపీ భజన బృందం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. రాష్ట్ర ప్రజల చెవులలో పూలు పెడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి జరగాలి, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని కేంద్రం ప్రభుత్వం భావించి కేంద్ర నిధులు 14, 15 నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తే 6వేల 670 కోట్లు స్వాహా చేశారు.
గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు చంద్ర బాబు నాయుడు హయాంలో ఎమ్మెల్యే ల కన్నా పవర్ ఫుల్ గా ఉండేవాళ్ళు. గతంలో 5 లక్షల రోడ్డు, డ్రైన్ల కోసం 10 సార్లు తిరిగితేనే రాని ఫండ్ 2014 నుంచి 2019 మధ్య కాలంలో గ్రామ ప్రెసిడెంట్లే వాళ్ళ సొంత నిధులని, మ్యాచింగ్ గ్రాంటు పెట్టుకొని ఒక్కొక్కరు సుమారు కోటి రూపాయల పనులు చేసియున్నారు. దేశంలోనే చెక్ పవర్ ఉన్న ప్రజా ప్రతినిధి ప్రెసిడెంట్. అటువంటి ప్రెసిడెంట్ పరిస్థితి నేడు డబ్బులు క్రెడిట్ అయ్యాయి ఎదో ఒక పని చేయిద్దాం గ్రామానికి అనుకునేలోపే డబ్బులు డెబిట్ అవుతున్నాయి. డబ్బులు వేసినట్టే వేసి వాళ్ళ ఖాతాలలో డబ్బులు లాగేస్తున్నారు. ప్రెసిడెంట్లు ఆఖరికి బ్లీచింగ్ చల్లించడానికి కూడా డబ్బులు లేక ఎమ్మెల్యేల నిధులు అడిగి డబ్బులు తీసుకొచ్చుకొనే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నారు.
గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా గెలిచి ఆ గ్రామానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు నేడు గ్రామాలకి ఏమి చేయలేక ఇంట్లోనే ఉంటుంన్నారు. బయటికొస్తే ప్రజలు కొడతారేమో అని భయపడి ఊర్లు వదిలి పక్క ఊర్లకు పారిపోయే పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో ఒక ప్రెసిడెంట్ ని చూస్తే గ్రామానికి ఏమి మేలు చేయలేక హైదరాబాద్ కు వెళ్లి చేపలు అమ్ముకుంటున్నాడు. ఇది జగన్ మోహన్ రెడ్డి యొక్క పారదర్శక పరిపాలనకు ఉదాహరణ. పంచాయితీలలోని రోడ్లకి ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలని కొట్టించడానికి కూడా డబ్బులు లేక పంచాయితీ ప్రెసిడెంట్లు అల్లాడిపోతున్నారు. కనీసం కేంద్రం నుంచి వచ్చిన డబ్బులైన చిన్న చిన్న పనులని చేయించడానికి ఉపయోగపడతాయి అనుకుంటే అవి కూడా పంచాయతీలకి అందకుండా జగన్ స్వాహా చేశారు.
సీఎం డెవెలప్ మెంట్ ఫండ్ కింద ఇస్తున్న 2 కోట్ల నిధుల గురించి జరిగిన వైసీపీ మీటింగ్ లో చెప్పుకున్నారు. అవి రోడ్ల పక్కన ఉన్న చెట్ల కొమ్మలని నరికించడానికి కూడా సరిపోవు అన్నారు. 2014 నుంచి 2019 వరకు వున్న ప్రెసిడెంట్లు స్వర్ణ యగంగా భావించారు. అనుకున్న పనులు గ్రామాలకు చేయించుకున్నారు, సంతృప్తిగ ఉన్నారు. వైసీపీ లో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ల డబ్బులని కూడా స్వాహా చేసారంటే ఏమనుకోవాలి. రేషన్ గురించి మాట్లాడుతూ సన్న బియ్యం ఇస్తానని, సన్న బియ్యాన్ని మీ ఇంటి ముందుకి తీసుకొస్తానని చెప్పి, ఎందుకూ పనికిరాని, పురుగులు పట్టిన, ముక్కిపోయిన బియ్యాన్ని రేషన్ డిపోలలో ఇవ్వడానికి సిద్దపడ్డారు. ఆ రేషన్ డిపోలలో డబ్బులు రావని 650 కోట్లుతో 9వేల 800 వాహనాల్ని కొన్నారు.
రేషన్ తీసుకోవడానికి బారాటి రెడ్డి సంచుల కోసం 7 వందల కోట్లు ప్రజల డబ్బుని వృధా చేశారు. చెత్త మీద కూడా పన్ను వేసే దుస్థితికి దిగజారిపోయింది వైసీపీ ప్రభుత్వం. నాలుగు నెలల నుంచి రేషనే ఇవ్వలేదు. గ్రామస్తులు 5 రూపాయలు పెట్టి నచ్చినపుడు రేషన్ తెచ్చుకునే వారు, అలాంటి 5 రూపాయలు బియ్యాన్ని డోరు డెలివరీ చేసి ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నారు. పక్కనే వున్నమద్యం షాపుకి కూడా డోరు డెలివరీ ఉంటుంది కానీ చదువుకోవడానికి మాత్రం 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇది జగన్ రెడ్డి రాజనీతి.
స్మార్ట్ సిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం 17 వందల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 17 వందల కోట్లతో ఒక ప్రణాళిక సిద్ధం చేసి స్మార్ట్ సిటీ కి డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చింది. ఈ ఫండ్ తో చాల డెవలప్మెంట్ చేసేసుకుటామ అని చెప్పి బ్లు ప్రింట్లు, ప్రాజెక్టు పనులు, ప్రజంటేషన్స్ ఇటువంటి హంగామాలు ఎన్నో చేసారు. చివరికి చేసిందేంటి అని చుస్తే అవి కూడా దోపిడీ చేసేసారు. మూడు రాజధానులు వికేంద్రీకరణ చేస్తానన్న దానిలో విశాఖపట్నం కూడా ఉంది. ఆ విశాఖపట్నానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వాహా చేశారు.
రాజధానిని ఏ విధంగా నిర్మించాలని అనుకుంటున్నాడో అర్ధం కానీ పరిస్థితి. అభయహస్తం కి సంబంధించి 2వేల కోట్లని కూడా దారి మళ్ళించాడు. పొదుపు సంఘాలలో వచ్చిన నిధులు 8వేల కోట్లని కూడా యస్.బి.ఐ నుంచి కోపరేటివ్ సొసైటీలకు పంపించుకుంటే అక్కడ జగన్ కి ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటుంది కాబట్టి అందులో పెట్టె పరిస్థితి. ఈ మూడు సంవత్సారాల కాలంలో 8లక్షల కొట్ల రూపాయలు అప్పు చేసారు. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్ళింది? గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేసి ప్రజల మీద భారం మోపారు.
తప్పుల తడకల్ని, అబద్ధాల్ని ధైర్యంగా భారతి రెడ్డి సాక్షి పత్రికలో ప్రచురిస్తున్నారు. రాసిన తప్పులను దిద్దుకోవచ్చు, చేసిన తప్పులు దిద్దుకోలేమని భారతి రెడ్డి గ్రహించాలి. తప్పులు చేసే భర్తను వెనుకేసుకురావడం అన్యాయం. సూట్ కేసులు లెక్కపెట్టుకొనే పని భారతి రెడ్డిది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని చేసిన తప్పులు చేస్తూ పోతే భవిష్యత్తులో జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో భారతిరెడ్డి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు హారతికే పరిమితమయ్యే జగన్ భార్య భారతి నేడు భర్తను వెనకేసుకురావడం, భర్త తెచ్చిన సూట్ కేసులు లెక్కేసుకోవడం, భర్త చేస్తున్న తప్పులను ప్రచార ఆర్భాటాలకు ఉపయోగించడం చేస్తున్నారని పెద్దలు మాట్లాడుకోవడం విన్నాను.
శిశుపాలుడివి వంద తప్పులు అయిపోగానే శిశుపాలుడి వధ జరిగినట్లుగా జగన్ పాలకవర్గానివి వెయ్యి తప్పులయ్యాయి. అతి దగ్గరలోనే వారి పని కూడా అయిపోతుంది. సన్న బియ్యం విషయంలో సాక్షిలో రాసిన రాతలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని సాక్షాత్తు అసెంబ్లీలోనే జగన్ చెప్పాడు. కావున కోర్టుకు జగన్ వెళ్లడు, భారతి రెడ్డి వెళ్లాల్సివస్తుంది. జగన్ ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో భారతి రెడ్డి సాక్షి పత్రికలో అన్నీ తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ చేసే అన్ని రకాల తప్పులకి భారతిరెడ్డి నేడు బాధ్యత వహిస్తోంది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
కేంద్రం రాష్ట్రానికి పంపే నిధులు సక్రమమైన మార్గంలో ఉపయోగపడుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే పంపిన నిధులన్నీ స్వాహా అవుతాయని కేంద్ర ప్రభుత్వానికి అప్పీలు పెడుతున్నాను. ఎక్కడి ఏ డబ్బైనా అతని ఖాతాలోకి, అతని జేబులోకి చేరాలనే కృత నిశ్చయంతో జగన్ ఉన్నాడు. ఇందుకు జగన్ రెడ్డి భజన బృందం తందానా అంటోంది. వరదలొచ్చి జనం అల్లాడుతుంటే ఏరియల్ సర్వే చేస్తూ ఓహో అక్కడ మునిగిందా? అని గాలి కబుర్లు చెబుతున్నారు. ప్రజలు స్పందించాలి.
అసెంబ్లీ హాల్ లోకి చంద్రబాబు రాలేదు. అసెంబ్లీ హాల్ కి, అసెంబ్లీ ప్రైమ్ సిస్ కి చాలా తేడా ఉంది. ఒక ప్రజా ప్రతినిధిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ప్రథమ పౌరురాలిగా ఎన్నికలు జరుగుతుంటే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా రాజకీయం చేసినవాళ్లని పనికిమాలిన బడుద్దాయిలు అంటారు. వైసీపీ నాయకులకు తెలివి మోకాళ్లలోకి వెళ్లిపోయింది. ఎన్నికలకు ముందు సీఎం కుర్చీకోసం జగన్ రోడ్డెక్కాడు కానీ ప్రజల సంక్షేమం కోసం కాదు. చంద్రబాబునాయుడు నిండు సభలో అవమానాలపాలయ్యారు.
బాబాయిని గొడ్డలిపోటు పొడిచారు. – తనకు తనే పొడిపించుకొని కోడికత్తి డ్రామా ఆడి ప్రజలను మోసం చేసి సింపథి పొందాలని చూశాడు. తన పని అయిపోయాక తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రాలకు పంపించేశాడు. ప్లీనరీ సభలో తల్లిని అవమానించిన వ్యక్తి కన్నా వెన్నుపోటుదారుడు ఎవరైనా ఉంటారా? గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించి శాశ్వత అధ్యక్షుడి కింద తను పెట్టుకోవడం అన్యాయం. వైసీపీని నిలబెట్టిన తన తల్లిని చెల్లిని వదిలేయడం వారిని వెన్నుపోటు పొడవడంకాదా? చంద్రబాబునాయుడు ద్రౌపది ముర్ముకు ఓటేయడం వెన్నుపోటు ఎలా అవుతుంది? ఒక గిరిజన మహిళ ప్రథమ పౌరురాలి పొజిషన్ కి వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సపోర్టు చేస్తాడు.
ఆర్ అండ్ బీ సమీక్షా సమావేశంలో జూలై 15కల్లా గుంతలు పూడుస్తానని చెప్పి మాట చెప్పి మడమ తప్పాడు. మాట మార్చి పక్క రాష్ట్రాల్లో గుంతలు లేవా, మిమ్మల్ని తీసుకెళ్తాను, రాజకీయ సన్యాసం చేస్తానని మాట్లాడటం అవివేకం. గుంతల విషయంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు – వరద బాధితులకు తెలంగాణలో రూ.10వేలు ఇస్తుంటే ఏపీలో రూ.2వేలు ఇవ్వడం అన్యాయం. వితండవాదం చేయడంలో వీళ్లే ఫస్ట్.
కొడాలి నానిని మంత్రిగా పనికిరాడని వారు తీసేశారు. గుడివాడలో పనికిరాడని వారు ఎమ్మెల్యేగా తీసేస్తారేమో చూడాలి. పేదల సొమ్మును కొట్టేసి అతని ఖజానాను నుంపుకుంటున్న విషయం అక్షర సత్యం. 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. వీటి సమాచారం కాగ్ లో కూడా ఎక్కడా లేవు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జగన్ సొంత ఖజానాని నింపడానికి తాడేపల్లి ఒక వేదికగా మారింది. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కళ్లు తెరిచి వైసీపీ అరాచకాలను గుర్తించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాగృతం చేశారు.