Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు ఆగ్రహం.. బెయిల్‌తో ముగిసిన అంకబాబు అరెస్టు కథ

సీనియర్ జర్నలిస్టు అంకబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడం టిడిపి మరియు జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయడం కోర్టు బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో గురువారం అర్ధరాత్రి వాట్సాప్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేశాడని రాజద్రోహం కేసు కింద సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకొని గుంటూరుకు తరలించారు.

ఈ సమాచారాన్ని అందుకున్న టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున సిఐడి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అధ్యక్షులు అచ్చం నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు అంకబాబు అరెస్టును ఖండించారు. అంకబాబు కుటుంబ సభ్యులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

స్థానిక సిఐడి కార్యాలయం వద్ద శుక్రవారం మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్థానిక నేతలు నజీర్ అహ్మద్, కోవెలమూడి నాని, డేగల ప్రభాకర్, రాయపాటి సాయి కృష్ణ, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.

వీరితోపాటు జర్నలిస్టు సంఘాల నేతల కూడా ఆందోళన చేపట్టారు. వినకొండలో వినకొండ లో ఏపీయూడబ్ల్యూజే యార్లగడ్డ రామ మోహన్ రావు, బ్రహ్మచారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం సాయంత్రానికి సిఐడి పోలీసులు అంకబాబును కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేయాలని కోర్టు సిఐడిని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇలా అరెస్టు – నిరసనలు బెయిల్ మంజూరుతో అంకబాబు కద సుఖాంతమైంది.

LEAVE A RESPONSE