– పవర్ హాలిడేతో 10 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు
– పవర్ హాలిడే ప్రకటించిన జగన్ రెడ్డికి త్వరలో ప్రజలు పవర్ కట్ చేయడం ఖాయం
– టి.ఎన్.టి.యు.సి అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామ రాజు
రాష్ట్రంలోని డిస్కంలు పరిశ్రమలకు విద్యుత్ హాలిడే ప్రకటించడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం. విద్యుత్ హాలిడేతో ఒక్క దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే దాదాపు 1700 పరిశ్రమలు మూతపడనున్నాయి. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో మూతపడే పరిశ్రమలతో ఈ సంఖ్య దాదాపు 4 వేలకు పైనే ఉంటుంది.
ఇంతటి అసమర్ధ పాలకుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేడంటే అతిశయోక్తి కాదు. 2019 లో విద్యుత్ మిగుల రాష్ట్రంగా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ కు ఇంతటి విద్యుత్ కష్టాలు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. 2014 లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేనాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు రాష్ట్రంలో ఉన్నది. విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 9,529 మెగావాట్ల నుంచి 2019 నాటికి 19,680 మెగావాట్లకు పెంచడం జరిగింది.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు. జగన్ రెడ్డి అనాలోచిత చర్యలకు, మూర్ఖపు విధానాలకు నేడు కార్మికులు బలైపోతున్నారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 20 లక్షలమందికి ఉపాధి లేకుండా చేశాడు. ఇప్పుడు విద్యుత్ హాలిడేతో దాదాపు 10 లక్షల మంది ఉపాధి కోలపోనున్నారు. కార్మికుల ఉపాధిపై వైసీపీ ప్రభుత్వం గొడ్డలివేటు వేస్తోంది.
పరిశ్రమలు మూతపడితే కార్మిక వర్గం ఏ విధంగా బ్రతకాలే జగన్ రెడ్డి చెప్పాలి. గ్యాస్, ప్రెట్రోలు ధరలు పెరిగి నిత్యవసర వస్తువులు ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో డిస్కంల నిర్ణయం హేయం. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని కాలేజీ పిల్లవాడిని అడిగినా చెబుతారు. ముందుస్తు చర్యలు తీసుకోకుండా పరిశ్రమలకు విద్యుత్ హాలిడే ప్రకటించడం దుర్మార్గం. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్ధిక సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విద్యుత్ హాలిడేతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దారుణంగా తయారౌతుంది. జగన్ రెడ్డి ఇప్పటికైనా తన అసమర్దతను ఒప్పుకుని పదవి నుంచి దిగిపోవాలి.