Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగింది మరో కోడి కత్తి డ్రామా

నిన్నటి రోజున జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు వేలాదిమంది జనసేన కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు పోవడం, అక్కడ అదే సమయానికి విశాఖ గర్జన ముగించుకొని ఎయిర్ పోర్టుకు పోయిన మంత్రులు రోజా, జోగి రమేష్, వైయస్సార్సీపి విశాఖ ఇన్చార్జ్ వై వి సుబ్బారెడ్డి మీద జనసేన కార్యకర్తలు చెప్పులతో దాడి, వారి చేతిలో ఉన్న పార్టీ జెండా కర్రలతోటి కార్లను కొట్టడం లాంటివి చేశారని ఇప్పటివరకు 60 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకొని, 26 మంది మీద 307 కేసులు పెట్టారని తెలుస్తుంది. నిజాయితీగా పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా అరెస్టు చేస్తే అసలు దోషూలు వీరైతే కానే కాదు ఎందుకంటే అరెస్టు చేసిన వారు అటువంటి పోకడ ఉండే మనుషులు కాదు .

మరి అటువంటి పరిస్థితుల్లో లక్షలాదిమంది ప్రజల గుండెచప్పుడు, ల్యాండ్ అవుతున్న నాయకుడకు వుండే ప్రజా ఆదరణ పోలీసులకు తెలియదా ? అధికార పార్టీ నాయకులు మంత్రులు ఎయిర్ పోర్టుకు పోతున్నప్పుడు, ఎవరికి ఇవ్వవలసిన పోలీస్ ప్రొటెక్షన్ వారికి ఇవ్వవలసిన అవసరం లేదా? పోలీసులు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారా ? ఆ దాడి చేసిన వారిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు లేరని ఇంకా నిర్ధారించలేదు . ఉన్నారని అనుమానం బలంగా ఉంది కానీ నిజంగా జనసేన కార్యకర్తలు వారి మీద దాడి చేసి ఉంటే అది తప్పే.

కానీ దానికి ముందు సంఘటనలు చూస్తే వైస్సార్సీపీ నాయకులకు, జనసేన పార్టీ ఎదుగుతున్న పార్టీ , యువతను ఆకర్షిస్తున్న పార్టీ వారి నాయకుడు మీటింగ్ పెడితే రూపాయి ఖర్చు లేకుండా వేలాది మంది తరలివస్తున్నారని అక్కసుతోటి డిబేట్ల లో , పత్రికా ప్రకటనలలో ఎంత జిగుప్సాకారంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మీరు నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి .మీరు చేసేదంతా రాజకీయ మోసం ఎవరైనా మీ పార్టీకి అడ్డం వస్తున్నారు అంటే వారి మీద రకరకాల కేసులు పెట్టడం బెదిరించడం పోలీసుల చేత లొంగదీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు మీరు కోకొలల్లొ చేస్తున్నారు .రాష్ట్రంలో జరిగిన ఎన్నో విధ్వంసకర చర్యల మీద, చేసిన మీ కార్యకర్తల మీద ఎటువంటి కేసులు పెట్టకుండా, ఏదైనా, ఎక్కడైనా పత్రికల వారు వెలుగులోకి తీసుకొస్తారనో లేదా మీ మీ కార్యకర్తలకు మధ్యన తగవులు పడి కొట్లాడుకుంటే వారి మీద ఒక వర్గం వారి మీద చర్యలు తీసుకోవడం కేసులు పెట్టడం చూశాం. కానీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు దాడి చేసిన వారి మీద ఎవరి మీద మీరు ఎటువంటి చర్య తీసుకోలేదు .

307 సెక్షన్ అనేది అటెమ్డ్ మర్డర్ సెక్షన్.. మర్డర్ చేయడానికి ఒక మనిషి పదునైన ఆయుధంతో, కత్తితో దాడి చేయడానికి వస్తే, దాడి చేస్తే రక్త గాయాలయి హాస్పిటల్ పాలు అయితే చనిపోయే పరిస్థితుల్లో ఉంటే తప్ప 307 సెక్షన్లు మామూలుగా పెట్టరు. కానీ నిన్న జనసేన కార్యకర్తల మీద… కేవలం కర్రలతో ,హెల్మెట్ తో, మీ కారు అద్దాలను, మీ కారును ధ్వంసం చేశారని మీ కార్యకర్తకు ఒక దెబ్బ తగిలిందని, అందరి మీద 307 కేసులు పెట్టడం అనేది క్షమించరాని ఘోరం.

ఈ జరిగిన సంఘటనకు బీజేపీ రాష్ట్ర శాఖ వెంటనే స్పందించి , జిల్లా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ వారికి మద్దతు తెలుపుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది.రాష్ట్రంలో జనసేన పార్టీ ఒంటరిదని మాత్రం ఎవరైనా భావిస్తే అది వారి అమాయకత్వం జనసేన పార్టీ కి హిమాలయాలంతా కొండ బిజెపి పార్టీ అండగా ఉంటుందని జరిగిన సంఘటన మీద బేషరతుగా జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వెంటనే ట్విట్టర్లో స్పందించడం పత్రికాముఖంగా ఖండించడం జరిగింది.

మీకు జనసేన పార్టీ అంటే ఎందుకంత భయం ? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి సాయంత్రం నాలుగు గంటలకు విశాఖపట్నం వదిలి పోవాలని పోలీసు వారు నోటీసు పంపించారు. అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలని అడిగి వారి పర్మిషన్ తీసుకొని వారికి ఇష్టమైతేనే మీటింగ్లు పెట్టుకోవాలా ? మీరు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే మీకు ఏమైనా అడ్డంకులు సృష్టించారా ? మరి మీరు ప్రతిపక్ష పార్టీలు మీటింగ్లు పెట్టుకుంటే వచ్చిన కష్టం ఏమిటి? మీరు ఎందుకు పోలీసులు చేత నోటిసులు ఇప్పి స్తారు ? ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి సంఘటనలు జరగడం జనసేనకు వారి పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు ఒకరకంగా శుభ సూచకమని , మంచిదని నేను భావిస్తాను .జనసేన చేసే అన్ని పోరాటాలలో ప్రతిఘటనలో అవసరమైతే బిజెపి ఉంటుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీర్రాజు తెలియజేయడం మనం చూసాం . ఈ ప్రభుత్వానికి ఇంకా ఉండేది 18 నెలలు మాత్రమే . 9 నెలలు దాటిన తర్వాత వీరి మాట ఏ పోలీస్ అధికారి ఏ అధికారులు వినరు. రాబోయేది బిజెపి జనసేన ప్రభుత్వాలు.

కరణం భాస్కర్
– బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 9290533360 .

LEAVE A RESPONSE