Suryaa.co.in

Andhra Pradesh

పడిపోయే వైసీపీని ఎవరూ ఆపలేరు

-జగన్ వైఫల్యాలపై మరో ఉద్యమం
-టిడిపి జగన్ ట్రాప్ లో పడింది
-బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి

అమరావతి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మొదటి రోజు బిజెపి పదాధికారుల సమావేశం జరిగింది బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశం. బిజెపి జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సునీల్ దేవధర్, సత్యకుమార్, కన్నా , పార్టీ పదాధికారులు పాల్గొన్నారు .రేపు కూడా కొనసాగునున్న పదాధికారుల సమావేశం.బిజెపి భవిష్యత్తు కార్యాచరణ పై ఈరోజు కీలక సమావేశం జరిగింది.రేపు కూడా రెండో సమావేశాలు జరుగుతాయి.

ఎపిలో రాజధాని పేరుతో జరుగుతున్న పోటీ ఉద్యమం ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాం ఎపి లో సమస్యలు ను డైవర్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించడమే జగన్ వ్యూహం.జగన్ రాజకీయ డ్రామాతో టిడిపి కూడా వాళ్ల ట్రాప్ లో పడింది.అమరావతి ప్రాంతం లో నిలిచిన పనులను మా అధ్యక్షులు పరిశీలించారు.ఎయిమ్స్ కు నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేక పోయింది.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే బిజెపి విధానం. వైసిపి మాత్రం అన్ని ప్రాంతాలను నాశనం చేసింది.బిజెపి ప్రజా పోరులో ప్రజలు అనేక సమస్యలు మా దృష్టి కి తెచ్చారు.వీటి‌పై చర్చ చేసి భవిష్యత్తు లొ మరో పోరాటం చేపడతాం.అన్ని‌విధాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది.గ్రామాలకు రావాల్సిన నిధులు పక్కదారి పట్టించారు.రాష్ట్రం లో రోడ్లు పరిస్థితి ఘోరంగా ఉంది. ఎపిలో పడిపోయే వైసీపీ ని ఎవరూ ఆపలేరు. జగన్ వైఫల్యాల పై మరో ఉద్యమం చేపడతాం.దేశంలో కమ్యూనిస్టు లు ఎబిసిడిలుగా చీలిపోయారు.దేశంలో కమ్యూనిస్టు లు కనుమరుగు అయిపోయారు.

అదే బిజెపి, ఆర్.యస్.యస్ ఈ తొంభై యేళ్లల్లో ఎంతో అభివృద్ధి చెందింది.దేశంలో కమ్యూనిస్టు లు లేకుండా పలఎందుకు చేశారో నాయకులు ఆలోచన చేయాలి.ఆ పార్టీతో పాటు నాయకులకు వయసు అయిపోయింది. సిపిఐ నారాయణ .. నిత్యం బిజెపి, ఆర్.యస్.యస్ మీద నోరు పారేసుకుంటున్నాడు. కాంగ్రెస్ జోడో యాత్ర తో ఎపిలొ కి వచ్చాడు. కాంగ్రెస్ లో ఇద్దరు నాయకులను కూడా కలపలేడు.పార్టీ ని నడపలేక పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ.ఆయన దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్దరిస్తానని మాట్లాడతాడు. కమ్యూనిస్టులు ముందు కలవండి… ఆ తరువాత సవాల్ చేయండి. ఎపి ని నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ దే.మమ్మలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు.మిమ్మలను ఎందుకు ప్రజలు దూరం పెట్టారో కమ్యూనిస్టు లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.ఎపిలో ఉన్న కుటుంబ పార్టీ లు కూడా రాష్ట్రానికి అన్యాయం చేశాయిఎపిలో బిజెపి, జనసేన పొత్తు తో అధికారంలోకి వస్తుంది.

మంత్రులు కారు మీద దాడి ఘటన పై..
మంత్రుల కార్ల పై జనసేన దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించ లేదు. వైసిపి నాయకులు మాత్రమే ప్రకటనలు చేస్తున్నారు.దాడుల సంస్కృతి మంచిది కాదు.. మేము దానికి వ్యతిరేకం.పవన్ కళ్యాణ్ వస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. సంఘటనలు జరగకుండా ఆపాల్సింది ఎవరు?
పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిట్ర శివ న్నారాయణ , రాష్ట్ర మీడియా ఇన్చార్జి లక్మీపతి రాజా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE