– కర్నాటకలో కమలం కొంపముంచింది ఖుర్షిదే
– ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్
– వైసీపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రె‘ఢీ’?
– త్వరలో ఏపీలో రేవంత్‌రెడ్డి సభలు?
– తెలంగాణ మంత్రుల పర్యటనలు?
– ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై నజర్?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా, ఆమె సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్‌తో కీలక భేటీ అయ్యారు.
గతంలో ఐప్యాక్‌లో సీనియర్ అసోసియేట్‌గా పని చేసిన ఖుర్షీద్ హుస్సేన్, కర్ణాటక ఎన్నికల్లో ‘40% టాక్స్ సర్కార్’ వంటి సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీ ఓటమిలో కీలక పాత్ర పోషించిన అనుభవం ఉంది.
ఈ సమావేశంలో, ఖుర్షీద్ హుస్సేన్ ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి 10 కీలక సూచనలు చేశారు:
నేతలను చేర్చుకోవడం: రాష్ట్రంలో పేరున్న కనీసం ఐదుగురు ముఖ్య నేతలను పార్టీలోకి తీసుకురావాలి. తెలంగాణ సీఎం సహకారం: రాజకీయ వ్యూహాల కోసం హైదరాబాద్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి సహకారం తీసుకోవాలి.
ప్రియాంక గాంధీ సభ: అమరావతిలో ప్రియాంక గాంధీతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి.
తెలంగాణ మంత్రుల ప్రచారం: అవసరమైనప్పుడు తెలంగాణ మంత్రులను ఏపీలో ప్రచారానికి వాడుకోవాలి.
ప్రజా సంఘాలతో పోరాటం: సీపీఐ, సీపీఎం, మరియు ఇతర ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేయాలి.
రాహుల్ గాంధీ సభ: విశాఖపట్నంలో రాహుల్ గాంధీతో ఒక సభ నిర్వహించాలి.
కార్యకర్తలతో మమేకం: క్షేత్రస్థాయిలో ఎక్కువగా కార్యకర్తలతో కలిసి గడపాలి.
విజయవాడలో అందుబాటు: రాష్ట్ర కార్యకలాపాలను విజయవాడ నుంచి పర్యవేక్షించడం ద్వారా అందరికీ అందుబాటులో ఉండాలి.
అనుకూల వర్గాల సమీకరణ: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అనుకూల నేతలతో సభలు పెట్టాలి.
మీడియా వ్యూహం: మీడియా, సోషల్ మీడియా మేనేజ్మెంట్ను చాలా సమర్థవంతంగా నిర్వహించాలి.
ఈ సూచనలు అన్నీ అమలు చేయగలిగితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందని ఖుర్షీద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కూటమికి వ్యతిరేకంగా జగన్ చేసిన కార్యక్రమాలు అన్నీ అభాసుపాలు అయ్యాయి. సమస్యల మీద పోరాటం మానేసి, ఈ రోజు కూడా అనంతపురంలో పెళ్లికి వెళ్లారు.
పార్టీ నాయకుల కుటుంబంలో పెళ్లి అయితే భారీగా ఖర్చు చేసి, పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తారు. అక్కడ పోగయ్యే ఓ 500 మంది వైకాపా కార్యకర్తలను, ప్రైవేటుగా పెట్టుకొన్న రోప్ పార్టీతో అటూ ఇటూ తోసి, బౌన్సర్లతో ఒకరినో ఇద్దరినో బాధడం, ఆ దృశ్యాలు చూపుతూ జగనుకు జనం వస్తున్నారు అని నెల్లూరులో బంగారుపాళ్యం గ్రాఫిక్స్ వాడడం, బ్యాక్ గ్రౌండ్ విజిల్స్, కేకలు పెట్టి, సోషల్ మీడియా ద్వారా శ్రేణులను మోసం చేసుకోవడం ఎక్కువయ్యింది.
ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్స్ ఒరిజినల్ ఓటు బ్యాంకు కొట్టేసిన జగన్, కూటమికి వ్యతిరేకంగా అసలైన సమస్యలను వెలుగులోకి తీసుకు రాకుండా.. రాజకీయ శూన్యాన్ని సృష్టిస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్స్ చాపక్రింద నీరులా పావులు కదుపుతోంది. పులివెందులలో కూడా వైకాపా చావు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ వ్యూహాత్మక సమావేశం ఆషామాషీగా జరుగుతున్నది కాదు.
షర్మిళ చుట్టూ.. కాంగ్రెస్స్‌లో కూడా ఇప్పటికే తన వారిని నింపి తెలుసుకొంటూ రాహుల్ గాంధీ మీద కూడా విమర్శలు మొదలెట్టాడు జగన్. బిజెపి మెప్పుకోసం కాంగ్రెస్స్ని విమర్శిస్తూ.. టిడిపితో రాహుల్ గాంధీ టచ్‌లో వున్నట్లుగా కలరింగు ఇస్తూ కలవరపడుతున్నాడు జగన్.
అంతఃపురంలో రాణిని ఒప్పించి ఆడపడుచుకు దారివ్వకపోతే.. కడపలో మహిళలు తొక్కుకొంటూ వెళుతున్నట్లుగా.. జగన్ మీద షర్మిళ కూడా వెళ్లేలా వుంది. ఆర్థికంగా పొరుగు రాష్ట్రాల నుండి కొంత ఆర్థిక వెసులుబాటు అందేలా వుంది.
కేసుల కోసం మాత్రమే పార్టీ ఉనికిని చాటుతూ.. వెంటిలేటర్ మీద కోమాలో వైకాపాను వుంచిన జగన్ స్వార్థాన్ని వైకాపాలోని కాంగ్రెస్స్ శ్రేణులు పసిగట్టాయి. మానసికంగా కృంగిపోవడం కన్నా.. కాంగ్రెస్స్లోకి వెళితే సీనియారిటీ వస్తుంది అని వారు ఆలోచిస్తున్న దశలో వీరు సమావేశం అవ్వడం కొంచం ఆలోచించతగ్గదే.