– చంద్రబాబు కూడా.. మార్గదర్శిలో చేరారు
– ఉగాది రోజే ఆంధ్రాలో.. మొదలైందా?
– మానసిక మార్పు మొదలయ్యింది
– ఇది మరో మన దేశ విప్లవంగా మారుతుంది
జెండా పండగ రోజు నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొన్న చిన్న పిల్లాడిలా జేబుకు బ్యాడ్జ్ పెట్టుకొని చంద్రబాబు కూడా.. మార్గదర్శిలో చేరారు!
సున్నితమైన మనసుతో స్పందిస్తూ.. కుప్పంలో 250 పేద కుటుంబాలకు తాను మార్గదర్శిగా వుంటానని, ఐ యామ్ మార్గదర్శి అనే బ్యాడ్జ్ ధరించి ముందుకు వచ్చారు.
తాను ఆచరిస్తేనే మిగిలిన వారు ఉద్యమంలా వస్తారు అని మార్గదర్శిగా మారారు.
ఒకప్పుడు గ్రామాల్లో పేదవారికి 100 రూపాయలు అవసరం అయితే.. ప్రామిసరీ నోటు మీద వేలి ముద్రలు వేస్తే సరిపోదు. ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలను పెట్టిన ఆ గ్రామాల్లోని వారే ఆ నోట్లల్లో గ్యారెంటీ సంతకాలు పెట్టడానికి గ్రామాల్లో గాడిద చాకిరీ చేయించుకునే పరిస్థితులు. కొన్ని ప్యాక్క్షన్ గ్రామాల్లో అయితే ఇంట్లో ఆడోళ్లను పంపించు అనే ఘోరమైన పరిస్థితులు.
ఆ పరిస్థితులలో డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల ఉద్యమంకు ఊపిరిపోశారు నాయుడు. వంటింటి నుండి ఊరి రచ్చ వరకు వచ్చి విదేశీ నాయకుల ముందు ధైర్యంగా మాట్లాడే వరకు తీర్చిదిద్దారు. ఆంధ్రా మహిళలను చూసి దేశ వ్యాప్తంగా ఆ ఉద్యమం విస్తరించింది.
ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడు అడిగినా ఇవ్వకండి, కేసులు పెట్టండి అనే ఓట్ల రాజకీయంతో.. ఆ అప్పులు కూడా దొరక్క వడ్డీరేట్లు పెరిగాయి.
నేడు ఆ వంద కాదు, లక్ష నుండి కోటి వరకు అప్పు తెచ్చుకొనే సంఘాలు ఉన్నాయి. 500 నోటుకు చిల్లర అడిగే స్థాయికి వెళ్లారు.
ఈ మార్గదర్శి, బంగారు కుటుంబం పి4 అనేది రాజకీయ ప్రచారం అనుకొన్నారు. అప్పట్లో డ్వాక్రాను కూడా ఇలాగే అనుకొని ఆ మహిళల మీద జోకులు వేసేవారు రచ్చబండల వద్ద.
మొదట్లో ఏదో కాంట్రాక్టర్లు మార్గదర్శులుగా అవుతున్నారులే అనుకొన్నారు. ఎంత సంపాదించినా తృప్తి దొరకదు సాటి మనిషికి, సరైన సమయంలో సాటి మనిషికి సాయం చేస్తే దొరికే తృప్తి ముందు ప్రపంచ ధనవంతుల జాబితాలో పేరు లేకపోయినా పర్లేదని వారెన్ బఫెట్ నుండి బిల్ గేట్స్ వరకు దానాలు మొదలెట్టారు. ఇటీవల ఈ దాన గుణంతో.. బాబు స్నేహితుడు బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో వెనుకబడినారనే వార్త వచ్చింది.
డబ్బు కాదు చిన్నపాటి మాట సాయంతో మేము ఎదగాలనుకొన్నాం అని కసిగా వచ్చే బంగారు కుటుంబాలకు మీ ఆస్తులు, డబ్బులు ఇవ్వక్కరలేదు, వారి చేయి పట్టుకొని నడిపిస్తే.. వారిలో ఒక అట్టడుగు పేద వ్యక్తి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెక్కు చెదరిని ఒక రాజ్యాంగంను వ్రాసి ఇవ్వవచ్చు, రాకెట్ గురించి కలలు కని సాకారం చేసి దేశ గర్వాన్ని రోదసీలోకి పంపే ఒక రాష్ట్రపతి అవ్వవచ్చు అని ఈ కాలంలో పదే పదే చెబితే.. వినే వారు వుంటారా అని నాలా చాలా మంది, సందేహంగా మనసుల్లో అనుకొని వుంటారు.
కానీ మొన్న ఒక యువకుడు ఐర్లాండ్ నుండి వచ్చి చంద్రబాబును కలిశాడు. సార్ మీ విదేశీ విద్యా పథకంతో చదువుకొని, వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నా.. నేను ఆనాటి నాలాంటి పేదలకు సాయం చేస్తా అనే ఆ యువకుని మాట ఆయన్ను తప్పకుండా కదిలించి ఉంటుంది.
పట్టుమని పదేళ్లు కూడా కాకుండానే.. తాము చదువులకు పంపిన ఒక యువకుడు ఐర్లాండులో వ్యాపారవేత్తగా ఎదిగి వచ్చి, తన పి4 పిలుపుకు స్పందించి, తన ముందు కనిపిస్తే తొలుత గర్వపడినా.. అది ఒక సున్నితమైన మనసున్న నాయకుని ఆలోచనలను ఎంత మార్చుతుందో అర్థం చేసుకోవాలి మనం.
అది జరిగి వారం తిరగలేదు. రోజుల్లోనే.. తన పాలసీతో ఫలాలు ఇచ్చేలా ఒక వృక్షంలా నిలబడ్డ ఆ యువకుడిని చూసి తప్పకుండా ఇంట్లో చెప్పివుంటారు. ఆయన ఆలోచనతో మారే జీవితాల కోసం సదా త్యాగాలు చేసే ఆ ఇంట్లో వారు ప్రభావితం అయ్యుంటారు. మారలానే తపన వున్న 250 మంది పేదల జీవితాలకు ముందుకు వచ్చి, ఆయన చేత ప్రణాళికలు వేసి మార్చి చూపిస్తా అనే పంతంతో జేబుకు ఐ యామ్ మార్గదర్శి అని పెట్టుకొని ముందుకు వచ్చేలా ఆయనకు అండగా నిలబడ్డారు.
కొన్ని దశాబ్దాల క్రితం సినిమాల్లో షావుకారు పాత్రలు సృష్టించి విలన్లుగా చూపి కలెక్షన్ల వ్యాపారం చేశాయి. అఫ్కోర్స్ లాబీయింగ్ చేసి ఎదిగే వారు ఒక శాతం వుండొచ్చు. కానీ నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. కష్టపడి పైకి వచ్చిన వారే నిలబెట్టుకొంటారు. పేదలు పెత్తందార్లు అనే సినిమాలు, కథలు ఈ కాలంలో నడవవు.
ఎవరు కష్టపడినా చిన్నపాటి అండ దొరికితే విజేత అవ్వడానికి కసిగా చూస్తున్న బంగారు కుటుంబాలు లక్షల్లో వున్నాయి. వేలల్లో మార్గదర్శులు ముందుకు వచ్చినా.. సమాజం, రాష్ట్రం మారిపోతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేలా దేశానికి మార్గదర్శిగా ఆంధ్రా అగ్రస్థానంలో నిలుస్తుంది.
మానసిక మార్పు మొదలయ్యింది. ఇది మరో మన దేశ విప్లవంగా మారుతుంది. అవతల తన దార్శనిక లక్ష్యాల కోసం నిద్రపోని నాయకుడు నాయుడు కాబట్టి, మొదట దేశం తర్వాత ప్రపంచం మాట్లాడుకొంటుంది.