Suryaa.co.in

Telangana

అంతన్నారు.. ఇంతన్నారు..

తెలంగాణ ప్రజలపై మరో గాడిద గుడ్డు మోపిండ్రు
తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి?
రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు ఆ సంగతేంది?
– రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు జరిగిన అన్యాయం పై మండిపడ్డ తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పా రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అబద్ధాల పుట్ట. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలేవి ? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు ఆ సంగతేంది? రాష్ట్రంలోని ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి మరి వాటి ప్రతిపాదనలేవి? నిధులెక్కడ? మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం చేస్తామని చెప్పిన మీరు బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదు?

పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను అని ఎన్నికల ముందు చెప్పిన్రు బడ్జెట్ లో ఆ ఊసేలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ఈ ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు మొండి చేయే చూపిన్రు.

అంతన్నారు. ఇంతన్నారు.. ఏవో అంకెలు6 చూపించి, జనానికి గొప్పగా చూపించారుబడ్జెట్ తో గతి తప్పి ప్రగతి మునకేయడమే తప్ప ఏం కనపడ్తలేదు. అంగడికి పోయి గొంగడి తెచ్చినట్లు ప్రగతి తెచ్చే బడ్జెట్ ప్రకటిస్తామని అసెంబ్లీలో తెలంగాణ ప్రజలపై మరో గాడిద గుడ్డు మోపిండ్రు. రాష్ట్ర ఆదాయానికి కేటాయింపులకు ఖర్చులకు పొంతనలేదు బడ్జెట్ పేరుతో చేస్తున్న అంకెల గారడివి జనం చూసి నవ్వుకుంటున్నారు.

బట్టి మాటలన్నీ శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే ఏమో అంకెలు పేరు జనానికి గొప్పగా చూపిస్తామని రీతిలో అసెంబ్లీలో సినిమా చూపించిండ్రు తప్ప ఒరిగింది ఏమి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలను విమర్శించడం అధికారం కోసం వేరే పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం బుడిబుక్క మాటలు మాట్లాడడం తప్పా, తెలంగాణ ప్రజల క్షేమం తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే విధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఏమాత్రం లేదు అని అనిపిస్తుంది.

LEAVE A RESPONSE