– మునుపెన్నడూ ఇలా జరగలేదన్న స్థానికులు
కోనసీమ జిల్లా అంతర్వేదిలోని బీచ్లో సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో ఆ తీర ప్రాంతమంతా ఒండ్రు మట్టితో కూడిన బురదతో నిండిపోయింది. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు. అయితే, సోమవారం మధ్యాహ్నానికి అంతర్వేది బీచ్ వద్ద సముద్రం మళ్లీ ముందుకు వచ్చింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సముద్ర కెరటాలు స్థానిక లైట్ హౌస్ ను తాకుతున్నాయి.