Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో బీసీ వ్యతిరేక పాలన – బీసీ ద్రోహి జగన్ రెడ్డి

– పూలే ఆశయాలే టీడీపీ సిద్దాంతాలు
– నిధులు, విధులు లేని కార్పోరేషన్ పదవులు, అధికారం లేని మంత్రి పదవులతో బీసీలకు మోసం
-బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి అరాచక పాలనను తరిమికొట్టాలి
– టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

రాష్ట్రంలో బీసీ వ్యతిరేక పాలన సాగుతోందని, జగన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం, ద్రోహం గత 30 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని, బీసీలంతా ఐక్యంగా జగన్ రెడ్డి అరాచక పాలనను తరిమికొట్టాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మహాత్మజ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా టీడీపీ నేతలు జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్న మోసాన్ని, అన్యాయం, ద్రోహాన్ని ఎండగట్టారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించగా, తెలుగుదేశంపార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 195వ జయంతి ఉత్సవాలను పండగ వాతావరణలో జరుపుకుంటున్నాం. బలహీన వర్గాల కుటుంబంలో పుట్టిన సామాన్యుడైన పూలే సంఘంలోని రుగ్మతల పోగొట్టేందుకు కృషి చేసిన వ్యక్తిగా జ్యోతిరావు పూలే మన బీసీ కావడం గర్వకారణం. పూలే ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ పెట్టకముందు బలహీన వర్గాలు కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే ఉండేవారు.

బలహీన వర్గాలకు ఆర్ధికంగా, సామాజకంగా, రాజకీయంగా అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. బీసీలను నాయకులుగా తయారుచేసిన ఫ్యాక్టరీ టీడీపీ. సామాన్య కుటుంబంలో పుట్టిన మాలాంటి వాళ్లకు రాజకీయ అవకాశం కల్పించి బడుగులకు అండగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవకాశాలు ఎక్కువ సార్లు రావు, వచ్చిన దానిని సద్వినియోగం చేసుకున్న వారు నాయకులుగా తీర్చిదిద్దుతారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు అమలు చేశారు.

విదేశాల్లో చదువుకోవాలంటే పథకం, పేద బడుగు ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు పథకాన్ని అమలు చేసిన పార్టీ టీడీపీ. వైఎస్ఆర్ కుటుంబానికి బలహీన వర్గాలంటే కోపం. నాడు వైఎస్ఆర్ నేడు జగన్ రెడ్డి బలహీన వర్గాలను ఉక్కుపాదంతో అణచివేశారు. రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల ముందు బీసీ ఫెడరేషన్లు పెట్టి ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఫెడరేషన్లను కార్పొరేషన్లు మార్చారు.

దామాషా ప్రకారం నిధులు కేటాయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. 23 ఏళ్లు అధికారంలో, 17 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ జెండాను వీడని వారు బలహీన వర్గాలు మాత్రమే. జగన్ రెడ్డి కార్పొరేషన్ నిధులు వెనక్కి తీసుకున్నారు. 3 ఏళ్ల పాలనలలో బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ రెడ్డి వేదిక నిర్వహిస్తే మీరేం చేశారో, మేమేం చేశామో బహిరంగ చర్చకు సిద్ధం. నాలుక గీసుకునే పదవులు ఎందుకు?

ఏపీని మూడు ముక్కలు చేసి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి దారాదత్తం చేశారు. జగన్ రెడ్డి 151 సీట్లు గెలిస్తే 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. అదే టీడీపీ 103 సీట్లు గెలిస్తే 9 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాం. టీడీపీలో అనేక మంది బీసీలకు ఉన్నతమైన పదవులు ఇచ్చారు, వైసీపీలో కనీసం మంత్రులకు కూడా విలువ ఇవ్వడం లేదు. కార్పొరేషన్, మంత్రుల పదవులు బీసీలకు అక్కర్లేదు. గతంలో టీడీపీ బీసీలకు అమలు చేసిన పధకాలు కొనసాగిస్తే చాలని బడుగు బలహీనవ వర్గాలు భావిస్తున్నారు.

విద్యార్ధులకు విద్య, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి గాని ఎందుకు కొరగాని పదవులు ఇచ్చారు దాని వలన బలహీన వర్గాలకు ఉపయోగం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 19 కులాలు చట్టసభల్లో గొంతు విప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి కులాలకు వెతికి వెతికి ప్రాధాన్యమిచ్చారు. జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా బీసీని, టీడీపీని విడదియ్యలేరు. బీసీలు ఆర్ధికంగా, రాజకీయంగా ఎదగకూడదని జగన్ రెడ్డి కక్షకట్టారు.

బీసీలకు న్యాయం కావాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. చిన్న చిన్న మనస్పర్ధల వలన పార్టీకి దూరమైన వారు తిరిగి పార్టీలోకి రావాలని జ్యోతిరావు పూలే జయంతి రోజున పిలుపునిస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 సీట్లు టీడీపీ గెలుస్తుంది. రాష్ట్రంలో ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం ఎక్కడా లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. చంద్రబాబు నాయుడును అదికారంలో కూర్చోబెట్టి రామరాజ్యాన్ని తెచ్చుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఎలాగూ తరువాత అధికారంలోకి వచ్చేది టీడీపీనే కాబట్టి మాకు ఇప్పుడు మంత్రి పదవులు రాలేదని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. 25 మంత్రులుంటే 11 మందిని పాత వాళ్లను తీసుకున్నావు అంటే తొలగించిన మంత్రులు అవినీతిపరులా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎక్కువ అవినీతి ఆరోపణలు వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. జగన్ రెడ్డి 3 ఏళ్లుగా ఒక్క కార్పొరేషన్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పూలే, అంబేద్కర్ ఆశయ సాధన కోసం టీడీపీ పనిచేస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ…
దేశంలో మొట్టమెదటిగా మహాత్మా బిరుదు పొందిన వ్యక్తి జ్యోతిబాపులే. జ్యోతిబాపులే సిద్దాంతాలు, ఆశయాలు అందరూ స్పూర్తిగా తీసుకోవాలి. అంబేద్కర్ కి ఆదర్శప్రాయుడు జ్యోతిబాపులే టీడీపీ ఏర్పడక ముందు అసలు బీసీలకే గుర్తింపే లేదు బీసీల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారు. సంక్షేమ పధకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు మహిళలకు రిజర్వేషన్లు, రూల్ ఆప్ రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే. 25 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 40 శాతానికి పెంచేందుకు ‎నాడు దైర్యంగా టీడీపీ నిర్ణయం తీసుకుంది.

కానీ కొంత మంది కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. బీసీలే టీడీపీకి వెన్నెముక, టీడీపీ హయాంలో బీసీలli అన్ని విధాలు మేలు జరిగింది. బీసీల్లో నలుగురికి మంత్రి పదవులిస్తే బీసీలందరీకీ మేలు జరుగుతుందా? బీసీలు సమాజంలో ఎదగాలంటే ఆర్దిక సమానత్వం కావాలి, విద్యలో ఎదగాలి బీసీ కులాలన్నీ ఐక్యంగా ఉంటేనే గుర్తింపు ఉంటుంది. వచ్చే తరాలకైనా సమాజంలో సమానత్వాన్ని అందించేందుకు బీసీలంతా ఐక్యంగా కృషి చేయాలి. జగన్ రెడ్డి రిజర్వేషన్లు 24 శాతా తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా బీసీ సబ్ ప్లాన్ కి రూ. 12 వేల కోట్లు కేటాయించాం. బీసీల నిధుల్ని జగన్ రెడ్డి దారి మళ్లిస్తున్నారు, బీసీల నిధులు ఏం చేస్తున్నారో జగన్ రెడ్డిని నిలదీయాలి.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. బీసీ జనగణన జరగాలి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్దే ద్వేయంగా ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన సంక్షేమ పధకాలు అందించేందుకు చంద్రబాబు నాయుడు సిద్దంగా ఉన్నారని యనమల అన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ…
మహిళా విద్యకు ఆద్యుడు జ్యోతి బాపులే, ఆధునిక భారతదేశ సామాజిక ఉద్యమపితామహుడు జ్యోతిబాపులే. సమాజంలో బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. స్ధానిక సంస్ధలలో రిజర్వేషన్లు , మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే. చంద్రబాబు నాయుడు బీసీ పక్షపాతి .దేశ చరిత్రలో మొట్టమెదటి బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ‎ రూ. 64 వేల కోట్లతో బీసీల అభివృద్దికి పాటుపడ్డాం. టీడీపీ హయాంలో ఒక్కో విద్యార్ధికి రూ. 15 లక్షలతో 975 మంది బీసీ విద్యార్దులకు విదేశీ విద్య అందించాం.

జగన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారో చెప్పగలరా ? ఎన్నికలకు ముందు 139 కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తానన్న జగన్ 56 కార్పోరేషన్లకు కుదించారు, వాటికీ కనీసం ఒక్క రూపాయి నిదులు విడుదల చేయలేదు. స్ధానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి 16 వేల మంది బీసీలకు రాజకీయ పదవులను దూరం చేశారు. చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బీసీకి ఇస్తే జగన్ మాత్రం సొంతబాబాయికి ఇచ్చారు జగన్ రెడ్డి సలహాదారుల్లో బీసీలు ఎంతమందో చెప్పాలి ? టీడీపీ బీసీ నాయకులపై జగన్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారు.

జగన్ రెడ్డి భయపెడితే మేం భయపడం, ఆకలినినైనా చంపుకుంటాం గానీ మా ఆత్మగౌరవాన్ని చంపుకోము.జగన్ రెడ్డి దుర్మార్గాలపై పోరాటం చేస్తాం, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి మహనీయుడు పూలే , జ్యోతిబాపులే ఆశయాలతో ఎన్టీఆర్ టీడీపీ స్ధాపించారు. టీడీపీ ఆవిర్బావం తర్వాతే సమాజంలో వెనుకబడిన వారికి రాజకీయ గుర్తింపు దక్కింది. పవిత్రమైన టీటీడీ చైర్మన్ బీసీలకు ఇచ్చిన ఘనత టీడీపీదే. బీసీలు పల్లకి మోసే బోయలు కాదు, అంటూ బీసీలను పల్లకి ఎక్కించిన ఘనత ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుదే. ఏం పీకుతారని జగన్ రెడ్డి అంటున్నారు. బీసీలను వంచించిన జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేసేందుకు బీసీలంతా సిద్దంగా ఉన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీలకు, రాష్ట్రానికి భవిష్యత్

టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… సామాజిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి పూలే. జ్యోతిపూలే, ఎన్టీఆర్ ఆశయాలు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల మంత్రులకు పూర్తి స్వేచ్చనిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే. నిధులు, విధులు లేని కార్పోరేషన్లతో జగన్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారు. ఆధరణ పధకాన్ని జగన్ రెడ్డి రద్దు చేసి బీసీల పొట్టగొట్టిన వ్యక్తి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి బీసీలకు చేసిన అన్యాయంపై గ్రామ స్ధాయిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. బీసీలకు ఆత్మగౌరవం కల్పించిన పార్టీ టీడీపీ, టీడీపీని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ…. టీడీపీ స్ధాపనతోనే బడుగు,బలహీన వర్గాలకు స్వాతంత్ర్యం వచ్చింది. బడ్జెట్కేటాయింపులు, కార్పోరేషన్ల నిధులతో బలహీన వర్గాల అభివృద్దికి చంద్రబాబు నాయుడు కృషి చేశారు. లోకేశ్ నాయకత్వంలో యువతంతా జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనపై పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. జగన్ రెడ్డి బీసీలను, ఎస్సీలను అన్ని విధాల అణగ ద్రోక్కుతున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనపై గ్రామ స్ధాయిలో బీసీలందర్నీ ఐక్యం చేయాలి.

ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ… టీడీపీ అంటేనే బీసీల పార్టీ , ఎన్టీఆర్ బీసీలకు అన్ని అంశాల్లో ప్రాధాన్యత ఇచ్చారు, ఆ స్పూర్తిని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారు చట్ట సభల్లో ఉన్నారంటే అది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చలువే. బీసీలను రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులే. జ్యోతిబాపులే స్పూర్తితో జగన్ రెడ్డి అరాచక పాలనపై బీసీలంతా పోరాటం చేయాలి.

గుంటూరు పార్లమెంట్ అద్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ…జ్యోతిబాపూలే లింగ వివక్షత, రైతాంగ, కార్మిక సమస్యలపై చేసిన పోరాటం అజరామమం. సమాజంలోని కుల తత్వాన్ని ప్రశ్నించిన పూలే ఆశయాలు నిత్య ఆచరణీయం. పూలే ప్రచారం, నాటకాలతో సమాజ వికాసానికి పాటుపడ్డారు. బ్రాహ్మణ భావజాలాన్ని వ్యతిరేకించి.. అదే బ్రాహ్మణ బాలుడిని దత్తత తీసుకున్న వ్యక్తి పూలే. కూడు, గూడు, గుడ్డే అసలు సిసలైన సామాజిక న్యాయం. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో బలహీన వర్గాలకు న్యాయం చేసింది ఎన్టీఆరే.

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే.చేతి వృత్తుల వారికి అడుగడుగునా అండగా నిలిచింది టీడీపీనే.విద్యతోనే సామాజిక న్యాయ సాకారమవుతుందని పూలే భావించారు. జ్యోతిబా పూలే ఆదర్శాలకు అనుగుణంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు టీడీపీ ఘనతే. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. అధికారం సజ్జల చేతిలో పెట్టారు. 56 కార్పొరేషన్లకు ఎంత బడ్జెట్ కేటాయించారో, ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు మెరుగైన జీవితం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే.

జగన్ పాలనలో బడుగు బలహీన వర్గ మంత్రులకు శాఖలపై అధికారమే లేదు. ఏ శాఖలో సమస్యలొచ్చినా.. జగన్ సామాజిక వర్గమే కలుగజేసుకుంటుంది. టీడీపీ హయాంలో ఎవరి శాఖ వారిదే.. ఎవరి ప్రాధాన్యం వారిదే. జగన్ రెడ్డి మంత్రి పదవులిచ్చి నెత్తిన సొంత వారిని కూర్చోబెట్టి రాజ్యమేలుతున్నారు. జగన్ పాలనలో ఏ బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగుపడ్డారో సమాధానం చెప్పాలి.నియంతృత్వ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడం తధ్యం.

ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాట్లాడుతూ….మను ధర్మం ప్రకారం సూద్రులు విద్యకు అనర్హులన్న విధానాన్ని బద్దలు కొడుతూ జ్యోతిరావు పూలే విద్యను అందరికి అందించారు. పూలే, అంబేద్కర్ తరువాత ఎన్టీఆర్ నే విద్యకు ప్రోత్సాహం అందించారు. క్యాబినెట్ లో మహిళలకు మంత్రి పదవులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఒక్కొక్క కులం నుంచి నాయకుడిని అందించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. విదేశీ విద్య, విద్యోన్నతి పథకాలను ఇచ్చి విద్యార్ధులు అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది.

తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు నుంచి మొన్నటి వరకు బీసీలు టీడీపీ వెంట నడిచారు. 70 శాతం బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామని జగన్ రెడ్డి చెబుతున్నారు. కాని వారి ఎలాంటి ప్రాధాన్యత లేదు. హోం మంత్రి సుచరిత దగ్గరకు వెళ్లి ఒక్క కానిస్టేబుల్ సెల్యూట్ చేసిన ధాఖలాలు లేవు. బలహీన వర్గాల మంత్రులు జగన్ రెడ్డికి ఊడిగం చేయడానికి తప్ప బీసీ అభ్యున్నతి కోసం పాటు పడిన వ్యక్తి ఒక్కరు లేరు. పదవులు పొందిన నాయకులు బలహీన వర్గాల సమస్యలను తీర్చే వరకు పోరాడాలి.

మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ…జ్యోతిబాపులే స్పూర్తితో పేద, బడుగు బలహీన వర్గాల వారికోసం ఎన్టీఆర్ టీడీపీ స్ధాపించారు, టీడీపీ అంటే బీసీలు, బీసీలు అంటే టీడీపీ. సమాజంలోని అన్ని వర్గాలకు టీడీపీ హయాంలోనే మేలు జరిగింది .రాష్ట్రం బాగుపడాలంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బ్యోతిబాపులే ఆశయాలు సాధించగలం.
నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…

బీసీలకు టీడీపీ చేసిన మేలు గతంలోగానీ, ఇప్పుడు గానీ ఎవరూ చేయలేదు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేయడం గొప్ప నిర్ణయం. చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ల కోసం పోరాడింది తెలుగుదేశం మాత్రమే. చట్ట సభ్లలో రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పోరాడాల్సిన అవసరం ఉంది.

గంజి చిరంజీవి మాట్లాడుతూ…విద్యలో విప్లవం తెచ్చిన మహానీయుడు జ్యోతిరావు పూలే.ఉన్నత లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించారు. 40 ఏళ్ల క్రితం ఏపీలోని రాజకీయ వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ ఛైతన్య కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుదే. జ్యోతిరావు పూలేకి నిజమైన వారసుడు ఎన్టీఆర్. ఓటర్లుగా మిగిలిన బీసీ వర్గాల కోసం, సామాన్య జనం కోసం, తెలుగు వారి ‎కోసం, కూడు గూడు, గుడ్డ కోసం, జ్యోతిరావు పూలే ఆశయాలను తీర్చిదిద్దేందుకే ఆయన పార్టీ పెట్టారు.

జగన్ రెడ్డి వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని కళ్ల బొల్లి కబుర్లు చెబుతున్నారు. కాసులు లేని కార్పొరేషన్ పెట్టి వెనకబడిన వర్గాల వెన్ను విరిచిన వ్యక్తి జగన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి, పేద బడుగు బలహీన వర్గాల కోసం అమరావతి రాజధానిగా ఇచ్చిన మహానీయుడు చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ గారు సామాన్యులు, అణగారిన వర్గాల ఆశయాల కోసం కృషి చేస్తున్నారని చిరంజీవి అన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ చంధ్రశేషు మాట్లాడుతూ….దేశంలోనే మొట్ట మొదటి సారిగా సామాజిక నేతగా కీర్తింపబడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. సమాజంలో అసమానతలు పోవాలంటే విద్య ద్వారానే సాధ్యపడుతుందని, విద్యను అందించేందుకు హంటర్ కమీషన్ కు జ్యోతిరావు పూలే ఇచ్చిన రిపోర్ట్ వల్లే నేడు విద్యా వ్యవస్థ బలంగా ఉంది. తన భార్యను మొట్ట మొదటి ఉపాధ్యాయురాలిగా చేసిన వ్యక్తి పూలే. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్ధులకు గురుకులాలు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు నాయుడు హయాంలో బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్న జగన్ రెడ్డి ‎56 కార్పొరేషన్లు మాత్రమే పెట్టారు. వాటికి కూడా నిధులు ఇవ్వలేదు. 50 శాతంగా ఉన్న బీసీలకు మూడేళ్లల్లో 3 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? బీసీలు కాలర్ ఎగరేయాలంటే టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని శ్యామ్ చంద్రశేషు అన్నారు.

బీసీ నాయకురాలు నూకాలమ్మ మాట్లాడుతూ… చదువుకుంటే వెనకబాటు తనం పోతుందని నమ్మిన వ్యక్తి జ్యోతిరావు పూలే. బీసీ అంటే తెలుగుదేశం తెలుగు దేశం అంటే బీసీ. తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నందుకు బీసీలందరూ గర్వపడుతున్నారు. నేడు రాష్ట్రాన్ని పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలు సామాంత రాజులుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు.

నేడు బీసీ మంత్రులు అధికారాలను సద్వినియోగం చేసుకున్న ధాఖలాలు లేవు. వైసీపీ పాలనలో ఏ ఒక్క బీసీకి న్యాయం జరగలేదు. ఒక్క బీసీకి ఒక్క సబ్సిడీ రుణం తీసుకోలేదు. విదేశీ విద్యను సైతం జగన్ రెడ్డి రద్దు చేశారని నూకాలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE