Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో మహిళా వ్యతిరేక పాలన, సైకో పాలన

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ టౌన్ : నందిగామ పట్టణం కొత్త ఏడాది జగన్ రెడ్డి కానుకగా పెన్షన్ల తొలగింపును ఖండిస్తూ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శనివారం నాడు తన కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో మహిళ వ్యతిరేక పాలన నడుస్తోంది. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అనే సాకుతో సంక్షేమ పధకాలు, పెన్షన్ లు కట్ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చర్యలు దారుణం, ప్రజలు వారి కరెంటు బిల్లులు వారే చెల్లించుకుంటున్నప్పుడు సంక్షేమ పధకాలకు కరెంటు బిల్లులకు కొలమానం తుగ్లక్ చర్య. పెరిగిన నిత్యవసర ధరలు, పెంచిన కరెంటు చార్జీలు,ఇంటి పన్నులు పెరిగాయని ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలియజేస్తున్నారు.

ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లను వివిధ రకాల సాకులతో సచివాలయ అధికారులచే నోటీసులు ఇస్తూ ప్రతి నెల పెంక్షన్ పై ఆధారపడి జీవించే వారి పెన్షన్లను తీసివేస్తే వారు ఎలా జీవిస్తారు? నందిగామ నగర పంచాయతీలో 4200 పెన్షన్లు వస్తుండగా వాటిలో సుమారు 330 పెన్షన్లను అకారణంగా కుంటి సాకులతో అధికారులచే తొలగింపు చర్యలకు కమిషనర్ పాల్పడడం అత్యంత దారుణం. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారం రాగానే మాట మార్చి మడమ తిప్పాడు ఇప్పటికీ 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. వైసీపీ పాలనలో పనులు లేక ప్రజల జీవనం భారంగా మారాయి, మహిళా రైతు కూలీ లు చాలా ఇబ్బంది పడుతున్నారు.

మద్యపాన నిషేధం హామీని తుంగలో తొక్కి జగన్ రెడ్డి మద్యం ఏరులై పారిస్తూ మహిళల తాళిబొట్లు తెంచేస్తున్నాడు.వైసీపీ పాలనలో మహిళల జీవనోపాధి కుంటుపడింది,రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లలో తెలుగుదేశం పార్టీ ని గెలిపించుట ద్వారానే మహిళల ఆర్థిక అభివృద్ధి, మహిళా రక్షణ,సాధ్యం.
సైకో శాడిస్ట్ పాలన పోవాలి.. సైకిల్ రావాలి.

LEAVE A RESPONSE