Suryaa.co.in

Andhra Pradesh

‘వారధి’తో వికసిత ఏపీ కోసం ఏపీ బీజేపీ

– ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్

విజయవాడ: భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెల రెండు రోజులు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వివిధ రకాల ప్రజా సమస్యల పైన వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమే వారధి అని ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

ఆ వివరాలు… వారధిలో బీజేపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం అందుబాటులో ఉండే బీజేపీ ప్రజాప్రతినిధులు.. దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు -ప్రతి నెలలో మొదటి సోమవారం, మూడోవ సోమవారం. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి శాసన సభ్యులు ప్రతి నెలలో నాలుగోవ సోమవారం, నాలుగోవ మంగళవారం. మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రతి నెలలో మొదటి మంగళవారం, మూడోవ మంగళవారం. సుజనా చౌదరి శాసన సభ్యులు ప్రతి నెలలో మొదటి బుధవారం ,రెండొవ బుధవారం అందుబాటులో ఉంటారు.

ఈశ్వర రావు శాసన సభ్యులు ప్రతి నెలలో మూడోవ బుధవారం, మూడోవ గురువారం. కామినేని శ్రీనివాసరావు శాసన సభ్యులు ప్రతి నెలలో మొదటి గురువారం,రెండోవ గురువారం. విష్ణు కుమార్ రాజు శాసన సభ్యులు – ప్రతి నెలలో నాలుగోవ బుధవారం, నాలుగోవ గురువారం. సీఎం రమేష్ ఎంపీ ప్రతి నెలలో మొదటి శుక్రవారం, రెండోవ శుక్రవారం. ఆది నారాయణ రెడ్డి శాసన సభ్యులు- ప్రతి నెలలో మూడోవ శుక్రవారం,మూడోవ శనివారం అందుబాటులో ఉంటారు. పార్థసారధి శాసన సభ్యులు – ప్రతి నెలలో నాలుగోవ శుక్రవారం,నాలుగోవ శనివారం. భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి – ప్రతి నెలలో మొదటి శనివారం,రెండోవ శనివారం. సోము వీర్రాజు జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ – ప్రతి నెలలో రెండోవ సోమవారం, రెండోవ మంగళవారం.

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు చెప్పే విధంగా జనతా జనార్దన్ అంటే ప్రజలే దేవుళ్లు అనే మాటను నిజం చేస్తూ ప్రజలకు అందుబాటుగా వారి వారి నియిజకవర్గాలతో పాటు, నెలకు రెండు రోజులు పార్టీ కార్యాలయంలో “ వారధి” కార్యక్రమంలో భాగంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది.

పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ ముందుగా నిర్ణయించిన అధికారప్రతినిధులు మరియు పార్టీ పదాధికారుల సమన్వయంతో కలిసి “ వారధి “ కార్యక్రమంను విజయవంతం చేస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ మూలధన వ్యయంతోనే వికసిత్ భరత్ – వికసిత్ ఏపీ సాధ్యం
ముగ్గురు ఐఏఎస్ విద్యార్థులు ఢిల్లీలో ఒక శిక్షణ అకాడమీలో ఆకస్మిక వరదనీరు ప్రవాహం వల్ల మరణం సంభవించిన సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఉచితలపైన ప్రభుత్వాలు చేసే వ్యయ పరిమితి అధికంగా ఉండడం వల్ల మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం అవడం ఇటువంటి ప్రమాదాలకు దారి తీస్తుందని చేసిన వ్యాఖ్య అన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

రాష్ట్రంలో కూడా రాష్ట్ర రహదారుల నిర్వహణ లోపం వల్ల 2019 – 24 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాలలో అనేకమందికి తీవ్రగాయాల అవటం, అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం చూశాం. ఇది కేవలం నాటి రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధ పాలన వల్లే జరిగింది అనే విషయం విదితమే. పోలవరం, వెలిగొండ, హంద్రీ నీవా, గాలేరు – నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టుల పురోగతి గత 5 సంవత్సరాలు జగన్ పాలనలో నిర్లక్ష్యం వల్ల ప్రజలకు త్రాగు నీరు, ప్రజలకు సాగు నీరు, పరిశ్రమలకు నీరు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి.

2019 24 మధ్య రాష్ట్రంలో విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మరియు హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మూడు ఉన్న ఒక్క పారిశ్రామిక నోడును కూడా పూర్తి చేయాలని దౌర్భాగ్య స్థితి నాటి సీఎం జగన్ రాష్ట్రంలో నెల్కొల్పారు.

గ్రామపంచాయతీలు, నగర మున్సిపాలిటీల నిధులను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, అలాగే కేంద్ర నుండి ఆర్థిక సంఘం సిఫారసుతో వచ్చిన నిధులు కూడా ప్రక్కదో మళ్లించడం వల్ల రాష్ట్రంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పట్టణ పాలక సంస్థలు విఫలమయ్యాయి. దీనికి ప్రధాన కారణం, జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వ నిధుల మళ్లింపు.

కేంద్ర ప్రభుత్వ నిధులు, మూలధనవ్యయం ద్వారా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడతాయి, కానీ ఆంధ్రప్రదేశ్ లో గడచిన 5 సంవత్సరాలలో తద్విరుద్ధంగా కార్యక్రమాలు జరిగాయి కాబట్టే అప్పులు పెరిగి ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రాజెక్టులు లేకుండా పోయాయి.

గడచిన అయిదు సంవత్సరాలలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లేదా సులభతర జీవనానికి అవసరమైన మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన లేదు. మూడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యాయాన్ని రికార్డ్ స్థాయిలో పెంచుకుంటూ పోతూ వాస్తవ వ్యయం దానికి అనుగుణంగా చేస్తూన్న, మన రాష్ట్రంలో మాత్రం దానికి భిన్నంగా మూలధన వ్యయం బడ్జెట్ కేటాయింపుల్లో కనీసం 40% కూడా కేంద్ర బడ్జెట్ 2024 25 లో 11.11 లక్షల కోట్లతో వరుసగా మూడోసారి మూలధన వ్యయం కోసం అత్యధికంగా కేటాయింపులు జరిగాయి.

రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని అధికంగా చేసే దిశగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలను 1.50 లక్షల కోట్లు కోట్లు వరకు కేటాయించడం గమనార్హం. మూలధన వ్యయ కేటాయింపు మరియు వడ్డీలేని రుణాలతో 15 లక్షల కోట్ల మూలధన వ్యయం ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్యచరణను తీసుకుంది.

అంతకు ముందు రెండు సంవత్సరాలలో కూడా వరుసగా 10 లక్షల కోట్లు, 7.50 లక్షల కోట్లు కేటాయింపులు చేయడమే కాకుండా అంతకుముందు గడచిన రెండు సంవత్సరాలలో అదనంగా రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం వడ్డీలేని రుణాలు 1 లక్ష కోట్లు, 80 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూర్చడం జరిగింది.

మరోవంక ఆంధ్ర ప్రదేశ్ లో 2014 – 2019 మధ్య మూలధన వ్యయం క్రింద 60 వేల కోట్ల రూపాయిలు అయితే, 2019 – 24 మధ్య జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన వ్యయం కేవలం 25 వేల కోట్ల రూపాయలు మాత్రమే, అందులో 11 వేల కోటలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు కలుపుకొని చేసిన వ్యయం.

రాష్ట్ర బడ్జెట్ పరిమాణం 2019 – 24 మధ్య గత 5 సంవత్సరాలకన్న ముందుకన్నా రెట్టింపు అయిన కూడా మూలధన వ్యయంను భారీగా కోత విధించారు, వాస్తవానికి గడచిన అయిదు సంవత్సరాలలో కనీసం 1 లక్ష కోట్ల వరకు మూలధన వ్యయం ఖర్చు చేయాల్సింది, కేవలం 25 వేల కోట్లు మాత్రమే జగన్ ప్రభుత్వం ఖర్చు చేసినందున ఇరిగేషన్ ప్రాజెక్టులు కాలేదు, మౌలికసదుపాయల కల్పన లేక రాష్ట్రం అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా పోయి అప్పులు మిగిలాయి.

కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ క్రింద మేక్ ఇన్ ఇండియా ప్రోత్సహించేందుకు కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) ప్రకటిస్తే కేవలం ఒకటి లేదా రెండు సంస్థలు మాత్రమే రాష్ట్రంలో పొందగలిగాయి, మరి ఆ సంస్థలు అంత భారీగా కేంద్రం నుండి ప్రోత్సాహకాలు అందుకునే అవకాశం ఉన్నప్పుడు తదనుగుణంగా లక్ష్యాలు ఎందుకు సాధించలేదో రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చెయ్యాలి. అలాగే, పీఎల్‌ఐ స్కీమ్ ఉన్నా రాష్ట్రంలో గత ఐదేళ్ళు పరిశ్రమలు ఎందుకు అనుకున్నంత స్థాయిలో రాలేదో సమీక్షించి పరిస్థితులు చక్కదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతున్నాం.

రాష్ట్రంలో వికసిత ఆంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఆరు ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత తీసుకోవడం, పారిశ్రామిక నోడులు అభివృద్ధికి అడుగులు వేయడం గమనిస్తే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో అవసరమైన మూలధన వ్యయం చేయడం ద్వారా వికసిత ఆంధ్రను వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయడం తథ్యం, దీని కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ను ప్యూహాత్మకంగా రాష్ట్రం వినియోగించుకుని పారిశ్రామిక ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.

LEAVE A RESPONSE