ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి భేటీ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం సీఎం జగన్ సన్నాహక సమావేశం జరుగనుంది. కేబినెట్ ముందుకు వచ్చే అంశాల పై ఈ సందర్భంగా చర్చ జరుగనుంది. ఇక ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది.
కాగా, వైఎస్‌ఆర్ లా నేస్తం రెండో విడత నిధులను ఈరోజు సీఎం జగన్ యువ న్యాయవాదుల అకౌంట్లలో జమచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులు ఉన్నారు. వారికి నెలకు రూ. 5,000 చొప్పున 6 నెలల స్టైపెండ్ రూ. 30,000 జమ చేస్తారు. ఇందుకుగాను ప్రభుత్వం మొత్తం రూ. 7,98,95,000 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60,000 రెండు విడతల్లో ప్రభుత్వం అందిస్తోంది.