Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ

– తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధులా
– సోషల్ మీడియాలో పోస్టు పెడితే తప్పుడు కేసులు.. షేం షేం జగన్ రెడ్డీ
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

చట్ట బద్దంగా, న్యాయ సూత్రాలకు అనుగుణంగా పని చేయాల్సిన ఏపీ సీఐడీ.. చట్ట వ్యతిరేక వ్యవస్థగా మారిపోతోంది. జగన్ రెడ్డి ఆడమన్నట్లు ఆడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు దిగుతోంది. ఐదు సంవత్సరాల పిల్లల్ని కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోవడం జగన్ రెడ్డి అరాచక, నియంతృత్వ పోకడలకు నిదర్శనం. టీడీపీ నేత చింతకాయల విజయ్ పై అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లో బీభత్సం సృష్టించడం దుర్మార్గం.

ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటైన వ్యవస్థ పౌర హక్కుల్ని కనీసం గౌరవించకపోవడం బాధాకరం. జగన్ రెడ్డి మాటలు విని గుడ్డిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పవనే విషయాన్ని సీఐడీ అధికారులు గుర్తుంచుకోవాలి. గతంలో జగన్ రెడ్డి మాటలు విన్న వారంతా ప్రస్తుతం కోర్టు కేసులు, జైళు శిక్షలతో పశ్చాత్తాపపడుతున్నారు. ప్రస్తుతం జగన్ రెడ్డి మాట విని తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో పశ్చాత్తాప పడడం తప్పదని గుర్తుంచుకోవాలి. తప్పుడు కేసులపై కోర్టుల్లో పోరాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం.

LEAVE A RESPONSE