Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంది

-రాష్ట్రం సమర్ధుడైన నాయకుడి చేతిలో ఉంది
-ఆంధ్రప్రదేశ్‌ ఏనాటికీ శ్రీలంక మాదిరిగా కాబోదు
-ఆ దేశంతో మన రాష్ట్రాన్ని ఏ విధంగానూ పోల్చలేం
-చంద్రబాబు దీనిపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు
-ఆయన హయాంలోనే రాష్ట్రం అప్పులు ఎక్కువయ్యాయి
-గణాంకాలతో సహా మీడియాకు వివరించిన విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, జూలై 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్దిక పరిస్థితి కేంద్రప్రభుత్వం కంటే మెరుగ్గా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయుకులు వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని అనేక ధనిక రాష్ట్రాలు చేసిన అప్పులతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ చాలా మెరుగైన పరిస్థితులలో ఉందని గణాంకాలతో సహా ఆయన వివరించారు.

ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో గురువారం పార్టీ లోక్‌ సభాపక్ష నాయకుడు పి.వి. మిధున్‌ రెడ్డితోపాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలతో కలసి విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమర్ధుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పధంలో నడుస్తోందని అన్నారు. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అప్పులు-జీడీపీ నిష్పత్తి 57% ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 32.4% మాత్రమే ఉంది. పంజాబ్ 47%, రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్‌ 38.8%, కేరళ 38.3%తో ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాయని తెలిపారు.

ఈ నెల 19న శ్రీలంకలో జరిగిన పరిణామాలపై కేంద్ర ఆర్దిక మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రుల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంకలోని పరిణామాలు, ఆ దేశానికి ఎలా సహాయపడగలం అన్న విషయాలపై చర్చ మొదలెట్టి ఆశ్చర్యకరంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్దిక పరిస్థితులపైకి దానిని మళ్ళించారని విజయసాయి రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి, అప్పులపై మంత్రులు వివరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, కేంద్రం చేసిన అప్పుల గురించి మాత్రం సమావేశంలో ప్రస్తావించకపోవడం విశేషం. రుణాలు – జీఎస్డీపీ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు 8,500 కోట్లు. ద్రవ్యలోటు 25,194.62 కోట్లని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర ద్రవ్యలోటు జీఎస్డీపీతో పోల్చకుంటే కేవలం 2.1%కన్నా తక్కువగానే ఉంది. ఇది 15వ ఆర్దిక సంఘం సూచించిన 4.5% పరిమితి కంటే తక్కవగానే ఉందని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 6.9% ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు కేవలం 3.18% మాత్రమే ఉందని తెలిపారు.

అసలు శ్రీలంక సంక్షోభానికి కారణాలేమిటి?
ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా అయిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వాస్తవాలు తెలసుకోవాలని ఆయన అన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం ఆ దేశం నుంచి ఎగుమతులు భారీగా క్షీణించాయి. విదేశీ చెల్లింపులు (రెమిటెన్స్)లు గణనీయంగా తగ్గిపోయాయి. వ్యవసాయోత్పత్తులు తగ్గి, టూరిజం ఆదాయం దారుణంగా పడిపోయింది. శ్రీలం కరెన్సీ విలువ పడిపోయింది. పైగా శ్రీంక దిగుమతులపై ఎక్కువగా ఆధారపడినందున విదేశీ మారకద్రవ్యం మొత్తం ఆవిరైపోయింది.

శ్రీలంక సంక్షోభానికి ఇవే ప్రధాన కారణాలని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 2019-20 సంవత్సరానికి శ్రీలంక వ్యాపార ఎగుమతులు 12.9 బిలియన్ డాలర్లు. ఆంధ్రప్రదేశ్ ఎగుమతులు 85,665 కోట్లు. 2021లో శ్రీలంక మొత్తం ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల వద్దే స్తంభించిపోయింది. ఏపీ ఎగుమలుతు ఎకంగా 62% పెరిగి 2 లక్షల కోట్లకు చేరింది. 2020లో భారతదేశంలోకి వచ్చిన విదేశీ చెల్లింపులు 83 బిలియన్ డాలర్లు. శ్రీలంకకు వచ్చింది 7.1 బిలియన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. 2021-22లో విదేశీ చెల్లింపులు భారతదేశంలో 87 బిలియన్ డాలర్లకు పెరిగింది. శ్రీలంకకు వచ్చిన విదేశీ చెల్లంపులు 5.49 బలియన్ డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన విదేశీ చెల్లింపులు 4.35 బిలియన్ డాలర్లని అన్నారు. విదేశీ చెల్లింపులు అందుకోవడంతో ఏపీ సుస్థిర పెరుగుదల నమోదు చేసిందని అన్నారు. ఈ కారణాల నేపథ్యంలో శ్రీలంక సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్‌కు ఏ విధంగా పోలిక పెడతారని ఆయన ప్రశ్నించారు.

టాక్స్ రెవెన్యూలో తగ్గుతున్న రాష్ట్రాల వాటా…
కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మొత్తంలో 41% రాష్ట్రాలకు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్నటికీ వాస్తవంగా అది ఎప్పడూ జరగలేదు. 2015-16లో పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 14.4 లక్షల కోట్లు. వాటి నుంచి కేవలం 34.91% మాత్రమే రాష్ట్రాలకు వాటాగా ఇచ్చింది. అందులో ఏపీకి వచ్చింది 1.50% మాత్రమే. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మెత్తం 14.4 లక్షల కోట్ల నుంచి ఏకంగా 28 లక్షల కోట్లకు పెరిగింది. అయినప్పటికీ అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన వాటా 1.5% నుండి 1.32%కి తగ్గిపోయిందని అన్నారు. 2015-16లో కేంద్ర నిధుల పంపిణీలో ఏపీ వాటా 21,791 కోట్లు. 2021-22 సంవత్సరంలో ఇచ్చింది 35,685 కోట్లు మాత్రమే అన్నారు.

రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్న కేంద్రం
కేంద్రం సెస్‌లు, సర్‌చార్జీల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్రాలకు వచ్చేఆదాయాన్ని ప్రణాళికా బద్దంగా తగ్గించేస్తున్నదని అన్నారు. రాష్ట్రాలకు ఆదాయం వచ్చే పన్నులు పెంచకుండా ఒక ప్రణాళికతో పన్నులపై సెస్, సర్‌చార్జీలు పెంచుకుంటూ పోతుంది. పెరిగిన సెస్, సర్‌చార్జీల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరంలేనందున కేంద్రం తన ఆదాయాన్ని ప్రతి ఏటా పెంచుకుంటూ పోతుంది. సెస్, సర్‌ఛార్జీలలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సివచ్చుంటే కేంద్రం నుండి ఈ అయిదేళ్ళలో రాష్ట్రానికి రమారమి 50 వేల కోట్లు వచ్చుండేవని అన్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఏపీతో పాటు ఇతర రాష్రాలు కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని అన్నారు. దీనిపై చట్టం చేయాల్సిన అవసరం ఉందని, సెస్, సర్‌ఛార్జీలలో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాల్సిందేనని విజయసాయి రెడ్డి అన్నారు.

చంద్రబాబు హయాంలో 117.42% పెరిగిన అప్పులు
2014-19 కాలానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% అధికంగా అప్పులు చేస్తే, ఆ కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 117.42% అప్పులు చేసింది. సీఏజిఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) అప్పులు చంద్రబాబు హయాంలో 16.8%కి పెరిగిందని అన్నారు. 2019-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు 49.6% పెరిగితే ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 43% మాత్రమే పెరిగిందని అన్నారు. సీఎజీఆర్ అప్పులు 12.75% మాత్రమే పెరిగిందని అన్నారు. కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలోనూ రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ డీబీటీ (డైరెక్ట్ బెనిషిట్ ట్రాన్స్‌ఫర్‌ ) పథకాల ద్వారా నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు 1.62 లక్షల కోట్లు సాయంగా అందించిందని అన్నారు.

బాబు హయాంలో విచ్చలవిడిగా నిధులు దుర్వినియోగం
తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం బదులిస్తూ 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1,62,828 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేసింది. దీనికి అతీగతీలేదని, అది రెగ్యులరైజ్ కాలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో నిధులు ఏవిధంగా దుర్వినియోగం అయ్యాయో అర్దం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్నవి ఉచిత పథకాలు కావని అన్నారు. అవి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అందించే చేయూతని అన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అభివృద్ది, ఎకనామిక్ బెనిఫిట్స్, ఎంప్లాయి్ మెంట్ గ్యారెంటీ స్కీంలు, హెల్త్ స్కీంలు, విద్యా, వైద్య రంగం అభివృద్ది చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రజలకు అందిస్తున్న పథకాలను చూసి ఓర్వలేని తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర బిజేపీ నేతలు ఉచితాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

నవరత్నాలు ఇప్పడు డజన్ స్కీంలు
రాష్ట్రంలోని 1.68 కోట్ల కుటుంబాలకు గానూ 1.4 కోట్ల కుటుంబాలకు పథకాలు అందుతున్నాయని అన్నారు. నవరత్నాలు ఇప్పడు డజన్ స్కీములుగా మారాయని అన్నారు.

ఏపీ అభివృద్ది సూచికలు, రికార్డు స్థాయిలో జీవిఏ పెరుగుదల
2020-21 లో రాష్ట్ర జీఎస్ డీపీ 1014373 కోట్లు కాగా 2021-22 నాటికి 1201736కి పెరిగింది. 2022-23 నాటికి 13,38,575 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. జీవీఏ (గ్రాస్ వాల్యూ ఏడిషన్ ) 2021-22 లో 18.47% పెరిగిందని, రాష్ట్ర విభజన తరువాత అత్యధిక పెరుగుదల నమోదు చేసుకుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రంగంలో 14.5%, హార్టికల్చర్ 13.24%, లైవ్ స్టాక్ రంగం 11.46%, మత్స్యరంగం 25.92%, పారిశ్రామిక రంగం 25.58%, మైనింగ్ 38.41%, తయారీ రంగం 24.84%,నిర్మాణ రంగం 26.75% అభివృద్ది సాధించిందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని అన్నారు.

చంద్రబాబు హయాంలో ఆ 5 మందికే లబ్ది…
వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది వివిధ రకాలుగా లభ్దిపొందితే, చంద్రబాబు హయాంలో కేవలం 5 మందికి మాత్రమే లబ్ది చేకూర్చారని అన్నారు. చంద్రబాబు – ఆయన కుటుంబ సభ్యులు, రామోజీరావు – ఆయన కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ – ఆయన కుటుంబ సభ్యులు, టివీ5 బీఆర్‌ నాయుడు – ఆయన కుటుంబ సభ్యులు, వీరితో పాటు మరో వ్యక్తి లబ్ది పొందారని అన్నారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మంది ప్రయోజనాల కోసం పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం ఆ 5 మంది బాగు కోసం మాత్రమే పోరాడుతున్నారని అన్నారు.

మరో రాజపక్స చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికీ శ్రీలంకగా మారబోదు. చంద్రబాబు నాయుడు మాత్రం రాజపక్సలా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు త్వరలో ఏ సింగపూర్‌కో ఇంకో దేశానికో పారిపోయే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE