Home » సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు.. సమాచార శాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

Leave a Reply