– ఉపాధ్యాయులపై కేసులు పెట్టి లోపల వేస్తోంది
– తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలోని సిద్దిపేటలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వజ్రోత్సవ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఏ ప్రభుత్వానికైనా వంద శాతం పనులను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి ఎలా లోపల వేస్తున్నారో.. తెరాస ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందో గమనించాలని సూచించారు. దేశంలోనే 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణదని కొనియాడారు.