Suryaa.co.in

Andhra Pradesh

పది పరీక్షల ఫలితాల ఎఫెక్ట్ – టీచర్లకు నోటీసులు జారీ

ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఏడాది 6 లక్షల పైచిలుకు మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా..అందులో 4 లక్షల మందే పాస్‌ అయ్యారు. మిగితా 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. అయితే దీనిని సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కార్‌ సంబంధిత ఉపాధ్యాయినీలకు నోటీసులు జారీ చేసింది.

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయినందుకు విద్యాలయాల ఉపాధ్యాయినీలకు సమగ్రశిక్ష అభియాన్ షోకాజ్ నోటీసులు జారీచేసింది. కొందరు విద్యార్థులు కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించలేకపోయారని, ఇది తమ శాఖపై చెడు ప్రభావం చూపిందని ఆయా సబ్జెక్టుల టీచర్లకు పంపిన తాఖీదుల్లో పేర్కొంది. ఈ నోటీసుకు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది తెలిపింది విద్యాశాఖ…!!

LEAVE A RESPONSE