– మీకు తోడ్పాటునందించే మంచి నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులు, అధికారులున్నారు
-ఉత్సాహం, సామర్థ్యం, సహనం కలిగిన యువ అధికారులు, నాయకులు మీ ముందున్నారు
– ముంబయ్ రోడ్ షోలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎన్ని చూసినా, చదివినా.. వ్యక్తిగత అనుభవం, అనుభూతి వేరు.ఏపీలో ప్రతి 50 కి.మీల దూరంలో ఒక పోర్టు లేదా ఎయిర్ పోర్ట్ కలవు.పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యామ్నాయం లేదు.వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులలో ఏపీకి తిరుగులేదు.ఆటోమొబైల్, ఐ.టీ, హ్యాండ్లూమ్, టెక్స్ టైల్. హెల్త్ కేర్,పెగ్రో కెమికల్, మెడికల్ ఎక్విప్ మెంట్ , తయారీ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు.
ఔషధ రంగం, తయారీలో కీలకమైన పరిశ్రమలన్నీ ఏపీవే.4 ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్లున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం గతేడాది ఏపీకి వచ్చిన పెట్టుబడులు రూ.45వేల కోట్లు.వేగంగా పరిశ్రమల ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం.జలమార్గాలపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి సారించింది.27 టెర్మినళ్లను 2029 కల్లా నిర్మించే దిశగా అడుగులు.
సులభతర వాణిజ్యం, చౌకగా వ్యాపారానికి ఏపీ చిరునామా. పర్వతాలు, సముద్రం, కొండలతో విశాఖ ఆకర్షణీయ నగరం.విద్యుత్, నీరు, భూమి, సహజ వనరులతో పాటు స్థిరమైన ప్రభుత్వం ఏపీలో ఉంది.ప్రతీ అభివృద్ధికి ఓ పరిధి ఉంటుంది..కానీ ఏపీలో అవధులు లేని అవకాశాలు. సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల వసతులు అదనం.చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి పొడిగింపు ఏపీ వైపు.నైపుణ్యం, కష్టపడే గుణం, కలిసి పని చేయడంలో తెలుగు యువతకు ఎవరూ సాటిరారు.దేశ జీడీపీలో ఏపీ వాటా పెరుగుతోంది, ఎగుమతులలో దేశ వృద్ధి రేటులో 10శాతం వాటా ఏపీదే.
రూ.50 జీతం తీసుకునే స్థాయి నుంచి 5వేల మందికి జీతాలిచ్చే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి.ఏపీ సీఎం సొంత జిల్లా కడపలో జేఎస్ డబ్ల్యూ రూ. 8,800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన. హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, ఏపీఐడీసీ ఛైర్ పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీల, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి , మహారాష్ట్ర సీఐఐ వైస్ ఛైర్మన్ రాబిన్ బెనర్జీ తదితరులు