Suryaa.co.in

Andhra Pradesh

కుప్పం డీఎస్పీపై ఏపీ హైకోర్టు ఫైర్

చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ సర్క్యులర్‌, ఆంక్షలపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలయింది. కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంపై అక్కడ డీఎస్పీ విధించిన ఆంక్షలపై హైకోర్టు సీరియస్‌ అయింది. తన అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని హైకోర్టు దృష్టికి న్యాయవాది వెంకటేశ్వర్లు తీసుకువచ్చారు. పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, మునిరత్నం, అమర్నాథ్‌రెడ్డిల ప్రచారానికి ఆటంకాలు కల్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రచారం చేసుకోవడం వారి హక్కని న్యాయవాది పోసాని చెప్పారు.

LEAVE A RESPONSE