Suryaa.co.in

Andhra Pradesh

విద్యారంగంలో అగ్ర‌గామిగా ఏపీ

జగనన్న విద్యా కానుక నాలుగో విడత పంపిణీలో రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం: విద్యారంగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంద‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. సింగుపురం జెడ్పీ హైస్కూల్ లో జ‌గ‌న‌న్న విద్యా కానుక పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అన్ని రాష్ట్రాల క‌న్నా ముందంజ‌లో ఉంచుతున్నామ‌ని,ఇవ‌న్నీ ఓట్లు కోసం ఆశించి చేస్తున్న ప‌నులు కావని అన్నారు. విప‌క్ష నాయ‌కులు చంద్ర‌బాబు నాయుడు అన్న విధంగా ఇదంతా ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకే అంటున్నారు అని, ఆ మాట‌లేవీ న‌మ్మ‌వ‌ద్ద‌ని, జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకే ఇవ‌న్నీ చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు మేం కృషి చేస్తుంటే ఇదంతా మోసం అని ఎలా అంటారు అని ప్ర‌శ్నించారు. రాజ్యాంగానుసారం ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డం అన్న‌ది ఓ ప్ర‌భుత్వ బాధ్య‌త అని చెప్పారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ..మన పిల్లలు ప్రపంచం తో పోటీ పడలి అని ఇంగ్లీష్ మీడియం తీసుకు వచ్చాము. అదేవిధంగా నాడు నేడు పేరిట ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపు రేఖ‌ల‌నే మార్చేశాం. ఒక ప్రభుత్వం త‌న ప‌ద‌వీ కాలం పూర్తి కాకముందే సమాజంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రయత్నానికి అందరి సహాయ సహకారాలు ఉంటే అసాధ్యం ఏవీ కావు. ఇవ‌న్నీ ఫ‌లించి ఈ ప్రభుత్వ ప్రయత్నం వల‌న దేశంలోనే విద్య లో అగ్రగామిగా ఏపీ రూపుదిద్దుకుటోంది. ప్రజలకు సంబంధించి వచ్చే ప్రతి సమస్య కు వెంటనే స్పందించే వ్యవస్థ తీసుకు వచ్చాము.

అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ స్కీమ్ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే చేస్తున్నాము. పెన్షన్ గ్యారెంటీ స్కీం తీసుకువచ్చాం, క్యాబినెట్లో అప్రూవ్ చేశాం. ఇప్పుడు ఉద్యోగస్తులు అందుకున్న స్టాండర్డ్స్ కు తక్కువ చేయ‌కుండా రిటైర్మెంట్ సమయంలో కూడా అందేవిధంగా చర్యలు రూపకల్పన చేశాము. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న 90వేల కోట్ల ఆదాయంలో జీతాలకు సుమారు 83,000 కోట్లు వెచ్చిస్తున్నాం.అంతేకాకుండా రాష్ట్రంలోని పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేయూతనివ్వడానికి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశాం. అభివృద్ధి చెందిన వర్గాల చెంత వారిని చేర్చాలని గొప్ప ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

LEAVE A RESPONSE