– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
మహిళా సాధికారత విషయంలో ఏపీ ఈ దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎమ్మెల్యేలకు విశాఖపట్టణంలో శనివారం నుంచి మూడు రోజుల వర్క్‌షాపు ప్రారంభమైంది. జాతీయ మహిళా కమిషన్, ముస్సోరిలోని ల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్… అనే పేరుతో ఈ వర్క్‌షాపును నిర్వహిస్తున్నారు. తొలి రోజు వర్క్‌షాపునకు మంత్రి విడదల రజిని గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖపట్టణంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ రాష్ట్రంలో మహిళ అయి ఉంటే చాలు.. ఆమె పుట్టిననాటి నుంచి మరణించేవరకు ప్రతి దశలో ప్రభుత్వం నుంచి ఏదో ఒక సంక్షేమం మహిళలకు అందేలా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారని తెలిపారు.
అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సామాజిక పింఛన్లు, రైతు భరోసా కేంద్రం, పేదలందరికీ ఇళ్లు.. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా మహిళలను ఆర్థికంగా ఆదుకుంటూ, వారికి ఒక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. అధికార పదవులు, రాజ్యాంగ పదవులు, స్థానిక సంస్థల పదవులు.. ఇలా అన్నింటిలోనూ సగం పదవులు మహిళలకే కట్టబెడుతూ నిజమైన మహిళా సాధికారత దిశగా ఏపీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు ముందుకు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. మహిళలంటే హోమ్ మేకర్ లు కాదని, చేంజ్ మేకర్లు అని.. నమ్మి వారిని ముందుకు తీసుకెళుతున్న నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి గారు అని తెలిపారు.