Suryaa.co.in

Andhra Pradesh

దేశంలో ఏపీని గంజాయిలో నెం.1 స్థానంలో ఉంచారు

-సొంత పార్టీ ఎంపీ నే నేను తెలంగాణ మారుతున్నానని చెప్పాడు కనీసం సిగ్గుపడాలి కదా?
-శాంతి భద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి
-శాంతిభద్రతలను కాపాడటానికి ఒక ప్రత్యేక అధికారిని కేంద్రం నియమించాలి
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశంలో
మాట్లాడుతూ…..*రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, దోపిడిని గవర్నర్ కు వివరించాం. నాలుగేళ్లకాలంలో జరిగిందంతా ఒక ఎత్తయితే జూన్ నెలలో 30 రోజుల్లో 15 సంఘటనలు జరిగాయి. రాష్ట్రంలో రోజుకో హత్య, రోజుకొక దోపిడీ, మానభంగం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయి రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఉంది.

కాబట్టి ఈ విషయాన్ని గవర్నర్ కు స్పష్టంగా వివరించాం. అత్యంత కిరాతకమైన సంఘటన మనకు అత్యంత దగ్గరలోనే వున్న రేపల్లెలో జరిగింది. పదవ తరగతి చదువుతున్న అమర్ నాథ్ గౌడ్ వాళ్ల అక్కని ఏడిపిస్తున్నాడని తల్లికి చెప్తే మీ పిల్లవాడు మా అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్తే దానిపై కక్ష పెట్టుకోని టూషన్ వెళ్తున్న విద్యార్థిని ఒక పథకం ప్రకారం ఒక్క ప్లాన్ వేసి నోట్లో కాగితాలు పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టుడం సభ్యసమాజానికి ఎంత చెడ్డపేరు వచ్చిందో సభ్య సమాజం తల దించుకోంది.

పేర్ని నాని మా నాయకుడ్ని పనిగా పెట్టుకొని బూతులు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఇంటికి అతి సమీపంలో మారక ద్రవ్యాలు తీసుకుని వైసీపీ కార్యకర్త ఒక స్కూల్ అమ్మాయి ని పాడుచేసిన సంఘటన మచిలీపట్నం లో పేర్ని నానీకి కనపడలేదా?. దాని మీద స్పందిచని దద్దమ్మ ఈ పేర్ని నాని. మా అధ్యక్షలు మాట్లాడుతూ గంజాయిని ఏపీ లో నెం. 1 స్థానానికి తెచ్చాడు ఈ ముఖ్యమంత్రి.

మరక ద్రవ్యాలకు అడ్డగా ఏపీ ని మార్చారు. ఈ జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. యువత దీనికి బానిస అవుతారు తల్లికి, చెల్లికి తేడా లేకుండా వ్యవహరిస్తానని వాపోయారు. ఈనాలుగేళ్లలో ఇటువంటి సఘటనలన్ని జరుగుతా ఉన్నాయి. దేశంలో మహనగరంలో ఒకటి విశాఖపట్నం దాని మీద జగన్ రెడ్డి బ్యాచ్ కన్ను పడి ఆ నగరాన్ని సర్వనాశనం చేసి దోపిడిదారులకు అడ్డగా మార్చారు.

విశాఖ ని రాజధాని అని పేరు పెట్టి అక్కడ ప్రవేట్, ప్రభుత్వ భూములను రూ. 40 వేల కోట్ల రూపాయలు ఉన్న భూములను దోపిడీ చేస్తుంటే. అనునిత్యం మేము చెప్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ భూమి లావాదేవీల విషయంలో రెండు రోజుల కితం ఏమి జరిగిందో అక్కడ చూశాం. ఒక సామాన్యుడు కాదు? సాక్షాత్తు వైసీపీ పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 48 గంటలు కనీసం పోలీసులకు తెలియకుండా చేయడమంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్న ఒక ఉదాహరణ చెప్పవచ్చు. అదే ఎంపీ ఈ రాష్ట్రంలో బతకలేమని చెప్పడం మాకుటుంబం ఈ ప్రాంతంలో ఉండలేమని చెప్పి, ఈ ప్రదేశం లోనేను వ్యాపారాలు చేయలేనని చెప్పడం ఎంత దుర్మార్గమో అర్థమౌతుంది. సొంత పార్టీ ఎంపీ నే నేను తెలంగాణ మారుతున్నానని చెప్పాడు కనీసం సిగ్గుడాలి కదా?కనీసం దానిమీద మాట్లాడిన దాఖలాలు కూడా లేవని తెలియజేస్తున్నాను. సాక్షాత్తు పులివెందులలో ఒక దళితుడ్ని హత్య చేస్తే ఈ రోజు వరకు ఎటువంటి విచారణ లేకపోవడం బాధాకరం.

కనీసం ముఖ్యమంత్రి స్పందిచిన పాపాన పోలేదు. దళితుల ఓట్లతో గెలిచి గద్దె నెక్కిన ముఖ్యమంత్రి నిన్ను దళితులే ఇంటికి పంపుతారని హెచ్చరిస్తున్నాం. ఏలూరు లో అనంతపురంలో ఒక విలేకరు తన భూమిని తాను కాపాడుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. అమలాపురం మున్సిపల్ చైర్మన్ నాకు తెలియకుండా సమావేశం ఎందుకు జరిపారని అడిగితే అక్కడ ఉన్న కౌన్సిలర్ గంజాయి తీసుకొని అమెపై దాడి చేసిన పరిస్థితి.

పోలీస్ వ్యవస్థ ఏమి చేస్తుంది. పోలీసులంతా జగన్ రెడ్డి కి సైనికులుగా పనిచేస్తూ టీడీపీ నాయకులపై దాడిచేసిన వైసీపీ నాయకులకు సేవలు చేయడమే సరిపోతుంది. ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమాలను అణచివేయడానికి తప్ప పోలీసు వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడటం లేదు. సాక్షాత్తు రాష్ట్ర పోలీసు అధికారి ప్రెస్ మీట్ శాంతి భద్రతలు బాగానే ఉన్నాయనడం పోలీసు వ్యవస్థ ఎంతటికి దిగజారి పోయిందో అర్థమౌతావుంది.

ఒక రౌడీ షీటర్ లేడు ఒక్క సంఘటన లేదని చెప్పడం సిగ్గుచేటు అతని వెంటనే డీజీపీ పథవికి రాజీరామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో క్రైం ట్రాకింగ్ సిస్టమ్ ను అమలు చేశాం. జగన్ రెడ్డి చేసే దొంగతనాలు, అడపిల్లలపై జరిగే అక్రమాలు ,మానభంగాలు , దోపిడీలు భయపడతాయని ఆ ట్రాకింగ్ సిస్టమ్ ను పూర్తిగ నీరుగార్చారు. ఎన్నో దోంగతనాలను ఉపయోగపడ్డ ట్రాకింగ్ సిస్టమ్ ను తొలగించడం వేసుక పెద్ద కుట్రలు ఉన్నాయని గుర్తుచేశారు.

చేతకాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి ఎవరు దోసులైతే వారిని శిక్షించాలని చెప్పడం,రేపల్లె లో జరిగిన సంఘటన వల్ల దేశం విస్పోటన చెందింది. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి నివ్వెర పడ్డ సంఘటన. తన పార్టీ కార్యకర్త చనిపోతే ప్రత్యేక విమానంలో వెళ్లి పలకరించి వచ్చిన పరిస్థితి మనం చూస్తూన్నాం. మీకు సిగ్గుందా బలహీన వర్గాలంటే నీకు అంతా సులకన? నీకు ఏమని చెప్పాలో మాకే అర్థం కానీ పరిస్థి తి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. రాష్ట్రంలో పూర్తిగ శాంతి భద్రతలు క్షీణించిపోయాయని అర్థంమౌతుంది జగన్ రెడ్డి.

ఈ విషయాలన్నీ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. మీరు పూర్తి సమాచారం సేకరించి రాష్ట్రపతికి ప్రధానమంత్రి కి కూడా సమాచారం తెలియజేయాలని కొనియాడం. శాంతి భద్రతలు ఉండాలంటే కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని సెక్షన్ 355 ద్వారా రాష్ట్రాన్ని కాపాడాలని గుర్తుచేశాం. మణిపూర్ జరిగిన సంఘటన విషయంలో కేంద్రమే జోక్యం చేసుకొని అధికారి నియమించినట్లు ఈ రాష్ట్రంలో కూడా అదే పద్దతిని అమలు చేయాలని. వెంటనే రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలన్నాం. గవర్నర్ సానుకూలంగానే స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం హామీ ఇచ్చారు

LEAVE A RESPONSE