Suryaa.co.in

Andhra Pradesh

టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్

ఎంపీ విజయసాయి రెడ్డి

ఫిబ్రవరి 20: టెలీ మెడిసిన్ సేవల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్ది పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు. దేశం మొత్తం మీద అందించిన టెలీ మెడిసిన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ 30.84% సేవలు అందించి రికార్డు సృష్టించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.86 కోట్ల మందికి టెలీ మెడిసిన్ సేవలు అందించి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు విలువైన వైద్య సేవలు అందించిందని అన్నారు. ఏపీ తరువాత స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచిందని అన్నారు.

జగనన్న విద్యా కానుకతో విద్యార్థులకు మేలు
జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులకు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఖరీదైన బ్యాగులు, సౌకర్యవంతమైన బూట్లు, ఆకర్షణీయమైన యూనిఫామ్ లు, 6,7,8 తరగతుల విద్యార్దులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు సకాలంలో విద్యా కానుక కిట్లు అందించేలా విద్యాశాఖ సన్నద్ధం అవుతోందని అన్నారు.

ఏపీకి మరిన్ని వందేభారత్ ట్రైన్లు కావాలి
విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ పెద్ద ఎత్తున విజయవంతం కావడం ఆంధ్రప్రదేశ్ కు అదనపు ట్రైన్లు నడపాల్సిన ఆవశ్యకత తెలియజేస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు చెన్నై, బెంగళూరు నగరాలకు విశాఖ నుంచి స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కోరుతున్నట్లు తెలిపారు.

ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలి
దేశంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో, వైద్య కళాశాలల్లో అవయవ మార్పిడి కి సంబందించి వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని విజయసాయి రెడ్డి కోరారు. అవయవ మార్పిడిలో సాలీనా 27% వృద్ది నమోదయ్యిందని అన్నారు. అయితే అవయవ మార్పిడి సంబందించి వైద్య సదుపాయాలు కొన్ని ఆసుపత్రులకే పరిమితమై ఉన్నాయని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE