Suryaa.co.in

Andhra Pradesh

ఏపీకి కేంద్రం మద్ద‌తు కావాలి

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిసిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మ‌ద్ద‌తు కావాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.విజ‌య‌సాయిరెడ్డి కోరారు. ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని విజ‌య‌సాయిరెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని ఈరోజు తన పార్లమెంట్ కార్యాలయంలో క‌లిశాను. నీతి ఆయోగ్ సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన‌ ఇతర ముఖ్యమైన సమస్యలపై ప్ర‌ధానితో చర్చించాము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలి. ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయాల‌ని కోరిన‌ట్లు విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE