Suryaa.co.in

Andhra Pradesh

అప్పులతోపాటు రెవిన్యూ లోటులోనూ దేశంలో నెంబర్.1గా ఆంధ్రప్రదేశ్!

-ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి
-జగన్ రెడ్డి వ్యక్తిగత ఖజానా కళకళ..రాష్ట్ర ఖజనా విలవిల
-పాలు,గుడ్లు, భోజనం బిల్లులు కూడా చెల్లించలేరా?
– జగన్ రెడ్డి ప్రభుత్వ దివాలాపై టీడీపీ జాతీయ అధికారప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజం
రాష్ట్రంలో జగన్ రెడ్డి నిర్వాకంతో అప్పులు, రెవిన్యూలోటు రెండింట్లో ఆశ్చర్యకరంగా రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. జాతీయ మీడియా కథనాలు, కాగ్ నివేదికలు జగన్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని కళ్లముందుంచాయి. చంద్రబాబునాయుడి ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర రెవెన్యూలోటు రూ.11,716కోట్లుకాగా, జగన్ రెడ్డి… రాష్ట్ర రెవెన్యూలోటుని రూ. 33,140కోట్లకు చేర్చాడు. ఎకనమిక్ టైమ్స్ పత్రిక సి.ఏ.జి వివరణ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటులో 662శాతంతో దేశంలోనే నంబర్ 1స్థానంలో ఉందని గణాంకాలతో సహా బట్టబయలు చేసింది.
20201-22 బడ్జెట్లో రాష్ట్ర రెవెన్యూలోటు రూ.5వేలకోట్లుగా అంచనావేయగా, కేవలం తొలి 6నెలల్లోనే సెప్టెంబర్ ఆఖరు నాటికే 662శాతం పెరిగి రూ.33,140కోట్లకు చేరింది. అప్పుల్లో సైతం ఈ ఆర్థికసంవత్సరంలో ఏపీప్రభుత్వం మొదటిస్థానంలో నిలచింది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే అక్షరాలా రూ.39,933కోట్ల అప్పు చేశారు. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.37వేలకోట్ల అప్పు చేస్తామని చెప్పి, కేవలం ఆరునెలల్లోనే రూ.40వేలకోట్లు అధిగమించారు. అప్పులతోపాటు రెవిన్యూ లోటులో రాష్ట్రం నెంబర్ 1 ఎలా నిలిచిందో, అదెలా సాధ్యమైందో జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి.
సామాన్య కుటుంబాలు సైతం వచ్చే ఆదాయానికి తగినట్లు ఖర్చులు చేసుకోవడానికి ప్రణాళికలు వేస్తుంటారు. కానీ జగన్ రెడ్డి అండ్ కో విచ్చలవిడిగా అప్పులుచేస్తూ కూడా రెవిన్యూలోటు పెంచుతూ అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. ఈ చేతగాని ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్రం అన్నింటిలో అధోగతిపాలైందని చెప్పడానికి సీఏజీ నివేదికలు, ఎకనమిక్ టైమ్స్ కథనాలే నిదర్శనం. ప్రభుత్వం తెస్తున్న అప్పులసొమ్ము, ప్రజలను వివిధపద్ధతుల్లో బాది వసూలుచేస్తున్న రూ.వేలకోట్లసొమ్ము అంతా పక్కదారి పడుతోంది. వచ్చిందంతా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తిగత ఖజానాకు తరలిపోతోంటే, రాష్ట్రానికి రెవెన్యూలోటు మిగలక ఏం మిగులుతుంది?
కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం కేపిటల్ ఎక్స్ పెండేచర్ లో(మౌలికసదుపాయాల కల్పనకు చేసే ఖర్చు) కేంద్రం విధించిన లక్ష్యాన్నికూడా ఏపీ చేరుకోలేదు. దాంతో అప్పులు తెచ్చే సౌలభ్యాన్నికూడా ఏపీ కోల్పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31,198కోట్లు కేపిటల్ ఎక్స్ పెండేచర్ చేస్తామని బడ్జెట్లో పెట్టిన జగన్ ప్రభుత్వం, కేవలం రూ.6,700కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. సెప్టెంబర్ 2021 నాటికి జగన్ రెడ్డి ప్రభుత్వంచేసిన కేపిటల్ ఎక్స్ పెండేచర్ కేవలం 21 శాతం మాత్రమే. మౌలిక సదుపాయాలకు ఈ విధంగా ఖర్చుపెట్టబట్టే పోలవరం ప్రాజెక్టు అటకెక్కి రైతుల నోట్లో మన్నుపడింది..
రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఇలా ఉంటే సంక్షేమపథకాలు ఎలా అమలవుతాయి.. ఉద్యోగులకు జీతాలెలా ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ కు వైద్యరంగం తాలూకా పరికరాలు సరఫరాచేసే అసోసియేషన్ వారు 100శాతం చెల్లింపులుజరిపేవరకు ఏ ఉత్పత్తిదారుడు ఏపీకి పరికరాలు సరఫరాచేయొద్దని స్పష్టంచేస్తూ, రెడ్ నోటీసు ఇచ్చింది. రాష్ట్రం పరువుపోయేలా ఇలాంటి ఘనకార్యాలు సాధించిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకోవాలి. వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించి విద్యుత్ డిస్కంలకు ఏపీ ప్రభుత్వం రూ.25వేలకోట్లు బకాయిపెట్టింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు ఏపీ ప్రభుత్వం రూ.130కోట్లుబకాయి పడింది. 20లక్షలమంది పిల్లలకు పాలుకూడా ఇప్పించలేని దుస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉండటం దురదృష్టకరం.
అంగన్ వాడీలకు కోడిగుడ్లు సరఫరాచేసే గుత్తేదారులకు జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.110కోట్లు బకాయిపెట్టింది. రూ.40వేలకోట్ల అప్పులుచేసిన జగన్ ప్రభుత్వం పిల్లలపాలు, కోడిగుడ్లకు కూడా డబ్బులు చెల్లించకుండా డబ్బంతా ఏంచేసింది? ఆఖరికి కోవిడ్ రోగులకు భోజనాలుపెట్టిన కాంట్రాక్టర్లకు కూడా జగన్ ప్రభుత్వం డబ్బులివ్వలేదు. విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలపెంపు, ఆస్తిపన్ను, ఇంటిపన్ను, నీటిపన్నులపేరుతో ప్రజలను వీరబాదుడు బాదుతూ వసూలుచేస్తున్నదానితోపాటు, అప్పులుతెచ్చిన సొమ్మంతా జగన్ రెడ్డి ఏంచేస్తున్నారు?
జగన్ రెడ్డి ఏపీని పూర్తిగా దివాలా తీయించడంతో దేశమంతా రాష్ట్రాన్ని వెనిజులాతో పోలుస్తోంది. జగన్ రెడ్డి తెస్తున్న అప్పులు దుర్వినియోగం అవుతుండబట్టే, ఆర్థికలోటు పూడటంలేదు. ప్రభుత్వం తెస్తున్న అప్పులు, ప్రజలనుంచి బాదుళ్లరూపంలో వసూలుచేస్తున్న సొమ్మంతా ముఖ్యమంత్రి సొంతఖజానాకే చేరుతోంది. జాతీయస్థాయిలో రాష్ట్రఆర్థికపరిస్థితిపై ఈ విధమైన కథనాలు వస్తున్నందు కు నిజంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూలోటు రూ.33,140కోట్లుగా ఉంది. ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్ర రెవెన్యూలోటు రూ.5వేలకోట్లుగా పేర్కొంటే, అది కేవలం తొలి 6నెలల్లోనే సెప్టెంబర్ ఆఖ రునాటికే 662శాతం పెరిగి, రూ.33,140కోట్లకు చేరిందని సెప్టెంబర్ ఆఖరుకి సీఏజీ ప్రచురిం చిన నివేదికలో పేర్కొన్నారు. సీఏజీ నివేదికపై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గనగారు ఏం సమాధానం చెబుతారు? దేశంలోనే అత్యధికంగా ఏపీలో మాత్రమే అత్యధిక రెవెన్యూలోటు నమోదవడంపై ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి.
తమిళనాడు రాష్ట్ర రెవెన్యూలోటు రూ.9,418కోట్లుగా ఉంటే, ఉత్తరప్రదేశ్ రూ.29వేలకోట్లు, రాజస్థాన్ రూ.28వేలకోట్లు, పశ్చిమబెంగాల్ రూ.24,703కోట్లు, మధ్యప్రదేశ్ రూ.24,848 కోట్లు, బీహార్ రూ.15,648కోట్లు, ఒడిశా రూ.11.898కోట్లు, కర్ణాటక రూ.3,243కోట్లు, వెనుకబడిన రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ రూ.2,917కోట్లు, ఉత్తరాఖండ్ రూ.1867కోట్ల రెవెన్యూ లోటులో ఉన్నాయి. దేశంలో ఏరాష్ట్రం తీసుకున్నా, మనరాష్ట్ర ఆర్థికలోటు కంటే చాలా తక్కు వగానే ఉన్నాయి. ప్రతిదానిలో తామే నెంబర్ అని చెప్పుకునే జగన్ రెడ్డి, దేశంలోనే ఏ రాష్ట్రానికి లేనంత రూ.33,140కోట్లతో రెవెన్యూలోటునిచ్చి, నంబర్ వన్ గా నిలిపాడు.
ఈ ముఖ్యమంత్రి సాధించిన ఘనతకు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు, ఉత్సవాలు చేసుకుంటే మంచిది. ఈ రకంగా రాష్ట్రాన్ని దివాలాదిశగా తీసుకెళ్తున్నందుకు నిజంగానే ఈ ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. టీడీపీప్రభుత్వం దిగిపోయేనాటికి, మార్చి 2019నాటి సీఏజీ నివేదికప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.11,716కోట్లు. రాష్ట్ర విభజనసమయంలో రూ.16వేలకోట్ల ఆర్థికలోటు ఉంటే, దాన్ని టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో తగ్గించింది. 2019 మార్చినాటికి రాష్ట్రరెవెన్యూలోటు రూ. 11,716కోట్లని సీఏజీ నివేదికతోనే స్పష్టంచేసింది. చంద్రబాబునాయుడు గారు ఆర్థికక్రమశిక్ష ణతో రాష్ట్ర రెవెన్యూలోటుని తగ్గిస్తే, ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కేవలంరెండున్నరేళ్లలోనే ఆర్థికలోటులో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలోనిలిపాడు.
మిగతారాష్ట్రాలు ఈ ఆర్థికసంవత్సరంలో ఆరునెలల్లోచేసిన అప్పులను పరిశీలిస్తే మన రాష్ట్రమే ముందుంది. బీహార్ రూ.23,860కోట్లు, తమిళనాడు రూ. 22,269కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.20,729కోట్లు, రాజస్థాన్ రూ.18,508కోట్లు, హర్యానా రూ.14,697కోట్లు, ఏపీ కంటే ఎంతో పెద్దదైన మహారాష్ట్ర రూ.13,673కోట్ల అప్పుచేసింది. కర్ణాటక రూ. 12,064కోట్ల అప్పులు తెస్తే, తెలంగాణ రూ.8058కోట్లు, గుజరాత్ రూ.8,974కోట్ల అప్పులు చేశాయి. వెనుకబడిన రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ రూ.7,489కోట్ల అప్పుచేస్తే, మధ్యప్రదేశ్ రూ.2,049కోట్ల అప్పుచేసింది. ఈ విధంగా దేశంలో ఏరాష్ట్రాన్నిచూసినా ఏపీకంటే అప్పుల్లో తక్కువస్థానాల్లో నే ఉన్నాయి.
ఈ విధంగా ఒకేరాష్ట్రం అప్పుల్లో, ఆర్థికలోటులో నంబర్ 1 ఉండటం ఎలా సాధ్యమైందో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. సాదాసీదా కుటుంబాలవారు కూడా వచ్చేఆదాయానికి తగినట్లు ఖర్చులుచేసుకోవడానికి, కుటుంబాలను ఎలా నడపాలనే దిశగా ప్రణాళికలు వేస్తుంటారు.
కానీ జగన్ రెడ్డి అండ్ కో బరితెగించి విచ్చలవిడిగా అప్పులుచేస్తూ కూడా ఆర్థికలోటుని పెంచుతూ, రాష్ట్రాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీస్తూ, అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం భారీఎత్తున అప్పులు చేస్తున్నప్పుడు ఆర్థికలోటు ఆ స్థాయిలో ఉండకూడదుకదా? రాష్ట్రానికి ఉన్న ఆర్థికలోటుని పూడ్చటానికి అప్పులు తెస్తున్నా కూడా లోటుపూడటం లేదంటే, నిధులు పక్కదారి పడుతున్నట్టా…కాదా? వచ్చిన రూపాయి వచ్చినట్టు పక్కదారి పడితేనేకదా.. రాష్ట్రఆర్థిక లోటు అలానే ఉండేది.! అప్పుల్లో నెంబర్ 1గా ఉన్నవారు ఆర్థికలోటులోకూడా నెంబర్ 1 గా ఎలా ఉంటారు? మిస్టర్ బుగ్గన దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇంకా ఇంకా అప్పులుతేవడానికి ఊరికే ఢిల్లీలో దాక్కుంటే కుదరదు..రాష్ట్రప్రజలకు సమాధానంచెప్పాల్సిందే.
ఈ చేతగాని ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్రం అన్నింటిలో అధోగతిపాలైందని చెప్పడానికి సీఏజీ నివేదికలు, ఎకనమిక్ టైమ్స్ కథనాలే నిదర్శనం. ప్రభుత్వం తెస్తున్న అప్పులసొమ్ము, ప్రజలను వివిధపద్ధతుల్లో బాది వసూలుచేస్తున్న రూ.వేలకోట్లసొమ్ము అంతా పక్కదారి పడుతోంది. వచ్చిందంతా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తిగత ఖజానాకు తరలిపోతోంటే, రాష్ట్రానికి రెవెన్యూలోటు కాక ఏం మిగులుతుందని ప్రశ్నిస్తున్నాం. అప్పులుతెస్తున్న ప్రతిరూపాయి, పేదలను బాదుడు పేరుతో పీల్చిపిప్పివసూలుచేస్తున్నదంతాకూడా పక్కదారి పడుతోంది.
కాబట్టే, గతంలో సీఏజీ వారు రూ.41వేలకోట్లకు ఒకసారి, రూ.30వేలకోట్లకు ఒకసారి ప్రభుత్వాన్ని లెక్కలుఅడిగారు. పాలకులఅవినీతికి ప్రభుత్వసొమ్ముతోపాటు, ప్రజలనుంచి వస్తున్నదంతా ఆవిరవుతోంది. కేంద్రఆర్థిక శాఖ నిన్న ఒకపత్రికా ప్రకటన విడుదలచేశారు. దానిలో వారు చాలాస్పష్టంగా కేపిటల్ ఎక్స్ పెండేచర్ ఖర్చులో(మౌలికసదుపాయాల కల్పనకు చేసే ఖర్చు) కేంద్రం విధించిన లక్ష్యాన్నికూడా ఏపీ చేరుకోలేదు. కేంద్రం విధించిన లక్ష్యాలను చేరుకోని రాష్ట్రాలకు అప్పులుతీసుకునే వెసులుబాటు లేకుండాచేసింది. దాంతో అప్పులు తెచ్చే సౌలభ్యాన్నికూడా ఏపీ కోల్పోయింది.
ఈ ఆర్థికసంవత్సరంలో ఏడురాష్ట్రాలు మాత్రమే కేంద్రంవిధించినలక్ష్యాలకు అనుగుణంగా కేపిటల్ ఎక్స్ పెండేచర్ ఖర్చుచేశాయి. అలాఖర్చుచేసిన రాష్ట్రాల్లో చత్తీస్ ఘడ్ కు అదనంగా రూ.895కోట్లు, కేరళకు రూ.2,256కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ.2,590కోట్లు, మేఘాలయకు రూ.96కోట్లు, పంజాబ్ కు రూ.2,869కోట్లు, రాజస్థాన్ కు రూ.2,593కోట్లు, తెలంగాణకు రూ.5,392కోట్లు అదనంగా అప్పుతెచ్చుకునే అవకాశాన్ని కేంద్రప్రభుత్వం కల్పించింది. ఏరాష్ట్రమైనా అభివృద్ధిచెందాలంటే కేపిటల్ ఎక్స్ పెండేచర్ అనేది చాలా ముఖ్యమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31,198కోట్లు కేపిటల్ ఎక్స్ పెండేచర్ చేస్తామని బడ్జెట్లో పెట్టిన జగన్ ప్రభుత్వం, కేవలం రూ.6,700కోట్లు మాత్రమే ఖర్చుచేసింది.
సగం ఆర్థికసంవత్సరం అయిపోయిన తరుణంలో, సెప్టెంబర్ 2021 నాటికి జగన్ రెడ్డి ప్రభుత్వంచేసిన కేపిటల్ ఎక్స్ పెండేచర్ కేవలం 21 శాతం మాత్రమే.
మౌలిక సదుపాయాలకు ఈ ముఖ్యమంత్రి అరాకొరా ఖర్చుపెట్టబట్టే, రాష్ట్రానికి అన్నంపెట్టే రైతులనోట్లో మట్టిపడింది. పోలవరం ప్రాజెక్ట్ పడుకుంది. రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు అటకెక్కాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడం లేదు. ఆఖరికి బుగ్గలునిమిరిన అవ్వాతాతలకు వాగ్ధానం ప్రకారం రూ.3వేల పింఛన్ కూడా ఇవ్వడంలేదు.
రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఇలా ఉంటే సంక్షేమపథకాలు ఎలా అమలవుతాయి.. ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు సంక్షేమఫలాలుఎలా ఇస్తారు? ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్కఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తికాలేదనడానికి కేంద్రఆర్థికశాఖ చెప్పిన గణాంకాలే నిదర్శనం. మౌలిక సదుపాయాలకు ఏపీప్రభుత్వం అథమంగా కేటాయింపులు చేయబట్టే, కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు తీసుకునే అవకాశం లేకుండా చేసింది.
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీస్ (ఏఐఎంఈడీ) హెచ్చరికజారీచేస్తూ, ఏపీకి రెడ్ నోటీసుఇచ్చారు. దానిలో వారు చెప్పినవి చూస్తే నిజంగా రాష్ట్రప్రజలంతా సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రాష్ట్రపౌరుడిగా, ఈ జగన్ రెడ్డి చేసినదానికి నేనైతే నిజంగానే సిగ్గుపడుతున్నాను. వారుఇచ్చిన నోటీసులో “ This is a Warnining to all Members, not to Supply in Future to Andhrapradesh Medical Services And Infrastructure Devolopment Carporation directly or Through Their Distributors without 100 persent Advance Payment Terms”. అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైద్యరంగం తాలూకా పరికరాలు సరఫరాచేసే కంపెనీల అసోసియేషన్ వారు వారి వెబ్ సైట్లో ఏపీకి సంబంధించి రెడ్ నోటీసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ఎవరూ కూడా పరికరాలు (ఎక్విప్ మెంట్) సరఫరాచేయొద్దని, అక్కడ పేమెంట్లు (చెల్లింపులు) జరగడంలేదని చాలా స్పష్టంగా చెప్పారు. 100శాతం చెల్లింపులుముందుగా జరిపేవరకు ఏ రాష్ట్రం ఏపీకి పరికరాలు సరఫరాచేయొద్దని స్పష్టంచేశారు. రాష్ట్రం పరువుపోయిందని, రాష్ట్రప్రతిష్ట గంగపాలైందని పత్రికల్లో నేడు కథనాలుకూడా వచ్చాయి. దేశంలో ఏరాష్ట్రమూ చేయనివిధంగా ఇలాంటి ఘనకార్యాలు సాధించిన ముఖ్యమంత్రి నిజంగానే తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు, ఉత్సవాలు చేసుకోవాలి.
ప్రభుత్వశాఖలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు డిస్కంలకు చెల్లించడంలేదు. రూ.9,783కోట్లను వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రభుత్వం విద్యుత్ డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ముకాక సబ్సిడీలరూపంలో మరో రూ.16వేలకోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ విధంగా మొత్తంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ డిస్కంలకు రూ.25వేలకోట్లు బకాయిపెట్టింది. దాంతో ఏపీ ఈఆర్ సీ విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డిస్కంలకు నోటీసులిచ్చింది. ఇంతగొప్ప ఘనతసాధించినందుకు జగన్ రెడ్డి నిజంగానే పండగచేసుకోవాలి.
అదొక్కటే కాదు.. ఈ జగన్ రెడ్డి ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఏపీకి పాలసరఫరా ఆపేయమనిచెప్పింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు ఏపీ ప్రభుత్వం రూ.130కోట్లుబకాయి పడింది. 20లక్షలమంది పిల్లలకు సంపూర్ణపోషణ పథకం కింద పాలుకూడా ఇప్పించలేని దుస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉండటం దురదృష్టకరం. పిల్లలకు సరఫరాచేసే పాలబకాయిలు ఇవ్వడానికి కూడా జగన్ రెడ్డి వద్ద డబ్బులులేవా? ఇంతటి దిక్కుమాలిన స్థితిలో ఈ రాష్ట్రప్రభుత్వముందా? అంగన్ వాడీలకు కోడిగుడ్లు సరఫరాచేసే గుత్తేదారులకు జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.110కోట్లు బకాయిపెట్టింది. పిల్లల పాలకు రూ.130కోట్లు, కోడిగుడ్లకు రూ.110కోట్లు కూడా ఇవ్వకుండా, 6నెలల్లో తెచ్చిన రూ.40వేలకోట్ల అప్పులన్నీ ఏంచేశారు? ఆఖరికి కోవిడ్ రోగులకు భోజనాలుపెట్టిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ.30కోట్లను కూడా చెల్లించకుండా జగన్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది.
ఇక కాంట్రాక్టర్లయితే ఈ ప్రభుత్వం వంకే చూడటంలేదు. రోడ్లమరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాని దుస్థితి. పాలుసరఫరాచేసేవారికి, కోడిగుడ్లుసరఫరాచేసేవారికి, భోజనం పెట్టినవారికి, విద్యుత్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు అందరికీ బకాయిలే మిగిల్చిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఉద్యోగులకుజీతాలు, పీఆర్సీలు, డీఏలు ఇవ్వని స్థితిలోఉంది.
విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలపెంపు, ఆస్తిపన్ను, ఇంటిపన్ను, నీటిపన్ను, ఆఖరికి మరుగుదొడ్లకు పన్నులేస్తూ ప్రజలను వీరబాదుడు బాదుతూ వసూలుచేస్తున్నదానితోపాటు, అప్పులుతెచ్చిన సొమ్మంతా జగన్ రెడ్డి ఏంచేస్తున్నారు? ఎవరికి దోచిపెడుతున్నారు? ఒకపక్కన కేంద్రప్రభుత్వమేమో ఏపీకి అప్పులు లేవంటోంది.. మరోపక్కన 662శాతం ఆర్థికలోటు పెరిగిపోతోంది.
పవర్ ఫైనాస్స్ కార్పొరేషనేమో తీసుకున్న అప్పులు రాష్ట్రం చెల్లించడంలేదని ఎన్ పీఏ చేస్తామంటోంది. జగన్ రెడ్డి ఏపీని పూర్తిగా దివాలా తీయించడంతో దేశమంతా రాష్ట్రాన్ని వెనిజులాతో పోలుస్తోంది. హిగో ఛావేజ్ అనే నియంత ఈ రాష్ట్రముఖ్యమంత్రి జగన్ రెడ్డిలాగే తయారై, వెనిజులా దేశాన్ని ఆర్థికంగా అథ:పాతాళానికి తొక్కేశాడు. వీటన్నింటిపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానంచెప్పాల్సిందే. రాష్ట్రానికి వచ్చి సమాధానం చెప్పకుండా, ఢిల్లీలో కూర్చొని ముఖం చాటేస్తానంటే కుదరదు. ఈ వాస్తవాలన్నింటినీ రాష్ట్రప్రజలంతా కూడా అర్థంచేసుకోవాలని కోరతున్నాం.
ENCLOSURES:
క.స రాష్ట్రం అప్పులు(కోట్లలో) క.స రాష్ట్రం రెవెన్యూ లోటు (కోట్లలో)
1 ఆంధ్రప్రదేశ్ 39,914 1 ఆంధ్రప్రదేశ్ 33,140
2 కేరళ 37,783 2 కేరళ 30,282
3 బీహార్ 23,860 3 ఉత్తరప్రదేశ్ 29,108
4 తమిళనాడు 22,269 4 రాజస్థాన్ 28,454
5 పశ్చిమబెంగ 20,729 5 తెలంగాణ 25,573
6 రాజస్థాన్ 18,508 6 పశ్చిమబెంగ 24,703
7 హర్యానా 14,697 7 మధ్యప్రదేశ్ 21,882
8 మహారాష్ట్ర 13,673 8 బీహార్ 15,648
9 కర్ణాటక 12,064 9 ఒడిశా 11,898
10 గుజరాత్ 8,974 10 పంజాబ్ 9,779
11 తెలంగాణ 8,058 11 తమిళనాడు 9,418
12 చత్తీస్ గఢ్ 7,489 12 హర్యానా 9,386
13 పంజాబ్ 5,699 13 మహారాష్ట్ర 5,278
14 ఉత్తరప్రదేశ్ 4,064 14 కర్ణాటక 3,243
15 మధ్యప్రదేశ్ 2,049 15 చత్తీస్ గఢ్ 2,917
16 ఉత్తరాఖండ్ 972 16 ఉత్తరాఖండ్ 1,867
17 హిమాచల్ ప్రదేశ్ 72 17 హిమాచల్ ప్రదేశ్ 1,860
18 జార్ఖండ్ 38 18 అరుణాచల్ ప్రదేశ్ 1,732
19 ఒడిశా (-)5,530 19 గుజరాత్ 1,503
20 అరుణాచల్ ప్రదేశ్ (-)1,174 20 జార్ఖండ్ 194

LEAVE A RESPONSE