• వైసీపీ నేతలు రాష్ట్రంలో కొల్లగొట్టిన అవినీతిని సొమ్మును ప్రవేట్ విమానాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు
• ఈ విషయం డిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తుతో బట్టబయలైంది
• నల్లధనాన్ని విదేశాలకు తరలించేందుకు బేగంపేట, విజయవాడ ఎయిర్ పోర్టుల ను కేంద్రంగా మలుచుకున్నారు
• విజయవాడ ఎయిర్ పోర్ట్ కు సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి
• సీఎం సామాజికవర్గానికి చెందిన తెలంగాణ వాసి వి.ఎన్.భరత్ రెడ్డిని ఏరికోరి ఏపీ ఎయిర్ పోర్ట్ కార్పోరేషన్ అడ్వైజర్ గా ఎందుకు నియమించారు?
• గతంలో విజయవాడ నుంచి నేరుగా తిరుపతి వెళ్లాల్సిన సీఎం విమానం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎందుకు ఆగింది
• బేగంపేట్ ఎయిర్ పోర్ట్ తో పాటు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కూడా ఈడీ, సీబీఐ దర్యాప్తు జరపాలి
• గాల్లో నల్ల డబ్బు తరలించటంలో జగన్ రెడ్డి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు
• ఏపీ నుంచి నల్లధనం విదేశాలకు తరలించకుండా అడ్డుకోవాలంటే విజయవాడ ఎయిర్ పోర్ట్ లో సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
వైసీపీ నేతలు రాష్ట్రంలో కొల్లగొట్టిన అవినీతిని సొమ్మును ప్రవేట్ విమానాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని దీనికి బేగంపేటతో పాటు విజయవాడ ఎయిర్ పోర్టు ప్రధాన కేంద్రంగా మారిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ద్వజమెత్తారు. ఆయన గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…..డిల్లీ లిక్కర్ స్కాంలో వేల కోట్ల నల్లధనం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తరలించారని ఈడీ చెప్తోంది. జెట్ సెట్ గో పేరుతో కనికా రెడ్డి ప్రవేట్ విమానాల్ని బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి నడుపుతోంది. ఈ కనికారెడ్డి డిల్లీ లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి భార్య. డిల్లీ లిక్కర్ స్కాం అంతా ఏ1 ఏ2 సన్నిహితుల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇసుక, మద్యం తదితర కుంభకోణాల్లో కొల్లగొట్టిన అవినీతి సొమ్మును విదేశాలకు ప్రవేట్ విమానాల్లో తరలిస్తున్నారని మేం చాలా సార్లు చెప్పాం. ఇప్పుడు డిల్లీ లిక్కర్ స్కాంతో ఆ విషయాలన్ని ఒక్కోటి బయటపడుతున్నాయి.
జగన్ రెడ్డి ముఠా నల్లదనాన్ని తరలిచేందుకు విజయవాడ ఎయిర్ పోర్ట్ ని కేంద్రంగా మలుచుకున్నారు. గతంలో సీఎం దావోస్ పర్యటన సమయంలో విజయవాడ నుంచి నేరుగా దావోస్ వెళ్లకుండా వయా లండన్ మీదుగా వెళ్లినపుడే మేం అనుమానం వ్యక్తం చేశాం. జగన్ రెడ్డి అవినీతి సొమ్మును ఆరోజు ప్ర్యతేక ప్లైట్ లో లండన్ తరలించారన్నది నేడు బేగంపేట ఎయిర్ పోర్ట్ ఉదంతంతో స్పష్టమైంది. బేగంపేట ఎయిర్ పోర్ట్ కేంద్ర బలగాల చేతిలో లేకపోవటం వల్లే ఇస్టానుసారంగా నల్లదనం తరలించారనీ ఈడీ చెప్పింది. మరి విజయవాడ ఎయిర్ పోర్ట్ కూడా కేంద్రబలగాల చేతిలో లేదు.
కాబట్టి విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి కూడా బేగంపేట్ ఎయిర్ పోర్ట్ మాదిరి నల్లధనం తరలించకుండా ఉంటారా? కాబట్టి బేగంపేట్ తో పాటు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కూడా ప్రత్యేక విమానాల రాకపోకలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు జరపాలి. గత మూడున్నరేళ్లలో విజయవాడ నుంచి ఎన్ని ప్రైవేట్ విమానాలు వెళ్లాయో, అవి ఎక్కడికి వెళ్లాయో, అందులో ఎవరు ప్రయాణించారో బయటపెట్టాలి.
విజయవాడ ఎయిర్ పోర్ట్ కు సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు ?
విజయవాడ ఎయిర్ పోర్ట్ కి సీ.ఐ.ఎస్. ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించేందుకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖపై తెచ్చిన ఒత్తిడి తో ఆమోదం లభించింది. మార్చి 7.2019 న సీ.ఐ.ఎస్.ఎఫ్ డైరక్టర్ జనరల్ రాజేష్ రంజన్ కూడా పత్రికా ముఖంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. దేశంలో కొత్తగా 15 విమానాయాశ్రయాలు, పలు సంస్ధలకు భద్రత ఇవ్వదలిచామని, అందులో విజయవాడ ఎయిర్ పోర్ట్ కూడా ఉందని రాజేష్ రంజన్ చెప్పారు. కానీ తర్వాత ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి దాన్ని ఎందుకు అమలు పరచలేదు. మార్చి 2019లో అనుమతి పొందినా కూడా ఇప్పటి వరకు సీ.ఐ.ఎస్.ఎఫ్ భద్రత రాకుండా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు అడ్డుకున్నారు? ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్ పోర్ట్ ఏపీ పోలీసుల చేతిలోనే ఎందుకు ఉంది? సీ.ఐ.ఎస్.ఎప్ భద్రత లేకుంటే విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి వేల కోట్ల నల్లధనం తరలించటం సులువు అవుతుందనా?
రాష్ట్రంలో నీరుగారిన పోలీసు వ్యవస్ధ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అక్రమాలను అడ్డుకోగలదా?
ఈ మద్య విజయవాడ ఎయిర్ పోర్ట్ లో జరిగిన అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభోత్సవం కార్యక్రమంలో వైసీపీ జెడ్పీటీసీ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏసీపీ ని దుర్బాషలాడుతూ.. బెదిరిస్తూ నువ్వెవడివి నన్ను ఆపటానికి అంటూ ఏసీపీని తోసుకుంటూ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లాడు. ఏపీలో పోలీసుల పరిస్థితి ఎంత దైన్యంగా ఉందో ఈ ఘటనే నిదర్శనం. ఇలాంటి పోలీసులు ఇక ఎయిర్ పోర్ట్ లో ఏం భద్రత కల్పిస్తారు? ఎయిర్ పోర్ట్ లో ఏ1,ఏ2 సహా ఏ వైసీపీ నేతనైనా ఆపి తనిఖీలు నిర్వహించే సాహసం పోలీసులు చేయగలరా? గతంలో బంగారం తరలిస్తూ ఓ ప్రభుత్వ అధికారి భార్య పట్టుబడితే ఇంతవరకు చర్యలు లేవు.
భరత్ రెడ్డిని ఏరికోరి ఏపీ ఎయిర్ పోర్ట్ కార్పోరేషన్ అడ్వైజర్ గా ఎందుకు నియమించారు?
తెలంగాణ ఏవియేషన్ డైరక్టర్ గా ఉన్న సీఎం సామాజికవర్గానికి చెందిన తెలంగాణ వాసి వి.ఎన్.భరత్ రెడ్డిని ఏరికోరి ఏపీ ఎయిర్ పోర్ట్ కార్పోరేషన్ అడ్వైజర్ గా ఎందుకు నియమించారు? ఏపీలో అంత మేధావులు ఎవరూ లేరా? ప్రైవేట్ విమానాల ద్వారా నల్లధనం తరలించడంలో సిద్దహస్తుడు కాబట్టే భరత్ రెడ్డి ని నియమించారా? భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రైవేట్ విమానాల్లో నల్లధనం తరలింపు జరిగినపుడు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ఎందుకు జరగవు? విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ఈడీ, సీబీఐ తక్షణమే దర్యాప్తు జరపాలి. అందులో భరత్ రెడ్డి పాత్రపై విచారణ చేయాలి. దీనికి తోడు సీఎం సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎయిర్ పోర్ట్ డైరక్టర్ గా నియమించారు. కాబట్టి దీనిపై లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది.
విజయవాడ టూ తిరుపతి వయా బేగంపేట ఎయిర్ పోర్ట్ ఎందుకు ?
విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాలంటే మద్యలో బేగంపేట ఎయిర్ పోర్ట్ కి వెల్ళాలా? ఈ మద్యన విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి విమానం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎందుకు దిగిందో ఇవాళ ఈడీ దర్యాప్తుతో అర్దమైంది. ఆరోజున విజయవాడ నుంచి బేగం పేటకు ఎన్ని సూట్ కేసుల నల్లధనం తీసుకెళ్లావ్ జగన్ రెడ్డి ? జగన్ రెడ్డి ప్లాన్ లన్నీ నేడు ప్రజలకు స్పష్టంగా అర్దమవుతున్నాయి. గాల్లో నల్లడబ్బు తరలించటంలో జగన్ రెడ్డి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. వైసీపీ పాలనలో నల్లదనం ఎగుమతుల్లో ఏపీ నెం.1 నిలిచింది. ఏపీ నుంచి జగన్ రెడ్డి ముఠా నల్లధనం విదేశాలకు తరలించకుండా అడ్డుకోవాలంటే విజయవాడ ఎయిర్ పోర్ట్ లో తక్షణమే సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలి. అందుకు కేంద్ర విమానాయాన శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కోరారు.
సీబీఐ, ఈడీ తక్షణమే బేగంపేట ఎయిర్ పోర్ట్ లో దర్యాప్తు చేసినట్టు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో దర్యాప్తు చేయాలి. గత మూడున్నరేళ్లలో విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ని విమానాలు ఎక్కడికి వెళ్లాయో, వాటిలో ఎవరు ప్రయాణించారో వివరాలు బహిర్గతం చేయాలని కొమ్మారెడ్డి పట్టాభిరాం డిమాండ్ చేశారు.