– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
దేశచరిత్రలో తొలిసారిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన అపర భగరీథుడు చంద్రన్న. ఇది గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం వద్ద గల పట్టిసీమ కాలువ. కృష్ణాడెల్టాలో రైతుల కష్టాలు తీర్చేందుకు కేవలం 11నెలల వ్యధిలో రూ.1360 కోట్ల వ్యయంతో 2016లో ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు.
రికార్డు సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా కూడా పట్టిసీమ లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాలోని రైతులకు ఖరీఫ్ సీజన్లో పుష్కలంగా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టగా, ఈ ప్రాజెక్టు ఫలితాలను 2016-19 నడుమ మూడు సీజన్లలో రైతులు కళ్లారా చూశారు.
రోజూ గరిష్టంగా 8500 క్యూసెక్కుల (0.73 టీఎంసీలు) నీటిని తీసుకునేలా డిజైన్ చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రతిఏటా 100 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి కృష్ణానదికి తీసుకునే అవకాశముంది.
నాడు దండగ అన్న జగన్ కు నేడు పట్టిసీమే దిక్కయింది. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా ఇప్పుడు చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నాడు. దార్శనికుడు చంద్రబాబునాయుడు ముందుచూపుకు నిదర్శనం పట్టిసీమ ప్రాజెక్టు.