• ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ను వైసీపీ రాజకీయ అవసరాలు.. తన ప్రచార పిచ్చికి జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడు
• ప్రభుత్వానికి బయట సాక్షి మీడియా..లోపల ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేలా పరిస్థితి తయారైంది
• సదరు కార్పొరేషన్ పేరుకే ప్రభుత్వ సంస్థ.. చేసేదంతా జగన్ రెడ్డి భజనే
• యూట్యూబ్.. గూగుల్ సంస్థలతో పాటు పలు ప్రైవేట్ వెబ్ సైట్లకు ప్రభుత్వసొమ్ము చెల్లిస్తూ.. జగన్ రెడ్డిని కీర్తించడంలో కార్పొరేషన్ పోటీపడుతోంది
• కార్పొరేషన్ ఉద్యోగులంతా వైసీపీ సోషల్ మీడియా సిబ్బందే
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
ప్రజల సొమ్ము వారికి తెలియకుండానే ఎంత చాకచక్యంగా ఈప్రభుత్వం దుర్వనియోగం చేస్తుందో రాష్ట్రమంతా తెలియాలని, జగన్ రెడ్డి తన పబ్లిసిటీ పిచ్చి కోసం ఈ నాలుగు న్నరేళ్లలో రూ.500కోట్ల జనం సొమ్ముని తన ప్రచారపిచ్చికి తగలేశాడని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
“ ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్) పేరుతో అక్షరాలా నాలుగున్నరేళ్లలో వైసీపీ సర్కార్ రూ.500కోట్ల ప్రజాధనాన్ని ప్రచార మోజుకి తగలేసింది. ప్రజలసొమ్ము ని నిస్సిగ్గుగా తన పబ్లిసిటీ కోసం వాడుకోవడం ఈ సో కాల్డ్ ముఖ్యమంత్రికే సాధ్యమైంది.
వైసీపీ సోషల్ మీడియా సిబ్బందే.. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు
వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో కేవలం అభ్యంతరకర ప్రకటనల కోసమే రూ.500కోట్ల ప్రజలసొమ్ముని తగలేసింది. దీన్ని ప్రజలు.. ప్రతిపక్షాలన్నీ స్కాం అంటుంటే.. ప్రభుత్వమేమో ముద్దుగా స్కీమ్ అంటోంది. టీడీపీ ప్రభుత్వం గతంలో వివి ధ ప్రభుత్వ శాఖలకు ఆయా శాఖలకు సంబంధించిన అంశాల కంటెంట్ తయారీ కోసం కంటెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. సదరు కార్పొరేషన్ కంటెంట్ తయారు చేసి శాఖలకు ఇచ్చినందుకు గాను వాటి నుంచి నిర్ణీత రుసుముని వసూలు చేసేవి.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అలాంటి కార్పొరేషన్ ను ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గా మార్చారు. ఇలా మార్చాలంటే కేబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. కానీ అదేమీ జరగలేదని మాకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు పెంపొందించేందుకు టీడీపీప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ను వైసీపీ ప్రభుత్వం తమపార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పునరావాస కేంద్రంగా మార్చింది.
దాదాపు 125 మంది వైసీపీ వారిని డిజిటల్ కార్పొరేషన్లో నియమించారు. వీరిని నియమించడానికి ఎలాంటి నిబంధనలు.. రాతపరీక్షలు నిర్వహించలేదు. ఇలా నియమించినవారిలో ఎక్కువ మంది కరుడుగట్టిన జగన్ రెడ్డి వీరాభిమానులే.
గతంలో టీడీపీ యువనేత లోకేశ్ పై పనిగట్టుకొని విషప్రచారం చేసిన ఇంటూరి రవికిరణ్ వాళ్లల్లో ఒకడు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసే చాలామంది వైసీపీ సోషల్ మీడియాలో కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. వీళ్లందరితో పాటు.. ఐ డ్రీమ్ అనే యూట్యూబ్ కంటెంట్ ఛానల్ ఓనర్ని నేరుగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ / ఛైర్మన్ గా నియమించారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ కార్యకలా పాల ముసుగులో అధికారపార్టీ తన కార్యకలాపాలు చక్కబెట్టుకుంటోంది.
ప్రభుత్వానికి బయట సాక్షి మీడియా.. లోపల ఏపీ డిజిటల్ కార్పొరేషన్
ప్రభుత్వ సొమ్మని ప్రైవేట్ వెబ్ సైట్స్ కి ధారాధత్తం చేస్తూ విచ్చలవిడిగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ ప్రకటనల నిండా జగన్ రెడ్డి భజన.. వైసీపీ ప్రభుత్వ గొప్పలు తప్ప
ప్రజలకు ఉపయోగపడే సమాచారం ఎక్కడా మచ్చుకైనా కనిపించదు. ప్రభుత్వానికి మద్ధతుగా బయట సాక్షి మీడియా ఏస్థాయిలో విష ప్రచారంచేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. జగన్ రెడ్డి అవినీతి మీడియాను కూడా తలదన్నేలా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రభుత్వం లోపలుండి పనిచేస్తోంది. ఖర్చు ప్రభుత్వలెక్కల్లో జమ అవుతుంటే.. ఆదాయం మాత్రం సాక్షి సంస్థకు చేరుతోంది.
ప్రభుత్వ కార్యక్రమాలు.. పార్టీ కార్యక్రమాలు అనే వ్యత్యాసం లేకుండా జగన్ రెడ్డిని పొగడటమే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా సిబ్బందిని. .. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా నియమించినట్టే… జగన్ రెడ్డి సాక్షి మీడియా సిబ్బందిని.. కొందరు పై స్థాయి ఉద్యోగుల్ని I & PR విభాగంలో నియమించారు.
నాలుగున్నరేళ్లలో జరిగిన రూ.500 కోట్ల స్కాం వివరాలు…
పేరుకే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థ. లోపల జరిగేది మొత్తం ముఖ్యమంత్రి భజనే. తాము ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధిలాంటి వాళ్లం.. ప్రభుత్వానికి ప్రచారం చేయడమే తమ పని అని డిజిటల్ కార్పొరేషన్ బహిరంగంగానే చెబుతోంది. ముఖ్యమంత్రిని పొగడటం.. కీర్తించడం.. అంతిమంగా ఆయన సేవలో తరించడం.. ఇదీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సిద్ధాంతం. డిజిటల్ కార్పొరేషన్ ప్రసారమాధ్యమాలతో పాటు… వివిధ ఆన్ లైన్ సంస్థలకు ఇచ్చే ప్రకటనల వివరాలు పరిశీలిస్తే ఇచ్చిన ప్రకట నలే మళ్లీ మళ్లీ ఇవ్వడం.. చెప్పిందే పదేపదే చెప్పి జనం చెవులకు చిల్లులు పెట్టడం.
ఆన్ లైన్ మాధ్యమమైన గూగుల్ లో ఒకే ప్రకటనను ఏపీ డిజిటల్ కార్పొరేషన్ 10 లక్షల సార్లు ప్రసారం చేయించింది. కొన్ని ప్రకటనల్ని 12 లక్షలసార్లకు పైగా ప్రజెంట్ చేయించింది. గూగుల్ లో ఇచ్చే ప్రకటనలకు ఎవరైనా సొమ్ము చెల్లించాల్సిందే. ప్రకట నను గూగుల్ లో డిస్ ప్లే వేసినందుకే కాకుండా… ఆ ప్రకటనను ఎవరైనా క్లిక్ చేసినా.. చూసేసేందుకు ప్రయత్నించినా మరలా కొంత అదనంగా చెల్లించాలి.
అలానే పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్ యాజమాన్యాలతో మాట్లాడి… తమ కార్పొరేషన్ ద్వారా వచ్చే ప్రకటనల్ని మీమీ ఛానెళ్లలో ప్రసారం చేస్తే అదనంగా చెల్లించేటట్టు మాట్లాడుకున్నారు. తాము ఇచ్చే ప్రకటనలు మీ ఛానెళ్లలో మూవ్ కాకుండా.. స్రీన్ పై ఫిక్స్ డ్ గా ఉంచా లని నిబంధన పెట్టిమరీ ప్రకటనలు ఇస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే కార్పొరేషన్లకు ఖర్చుతోపాటు ఆదాయం కూడా ఉంటుంది. కానీ ఏపీ డిజిటల్ కార్పొరే షన్ కు వచ్చే ఆదాయం సున్నా… ఖర్చు మాత్రం అధికం.
డిజిటల్ కార్పొరేషన్ ప్రకటనలు… ఐ ప్యాక్ ప్రకటనల్లోని సమాచారం సేమ్ టూ సేమ్
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రిని కీర్తిస్తూ గూగుల్ కు ప్రకటనలు ఇచ్చినట్టే.. వైసీపీ కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్ సంస్థ కూడా ఆపార్టీ ప్రచార ప్రకటనలు కొన్ని గూగుల్ కు ఇస్తోంది. కానీ డిజిటల్ కార్పొరేషన్ ఇచ్చే ప్రకటనల్లోని సమాచారం..ఐప్యాక్ సంస్థ వైసీపీ తరుపున ఇచ్చే ప్రకటనల్లోని సమాచారం ఒకేలా ఉండటమే ఇక్కడ కీలకాంశం.
ఐ ప్యాక్ సంస్థ వైసీపీ కోసం గూగుల్ కు ఇచ్చిన ప్రకట నల్లో దాదాపు 5 నుంచి 6 వేలవరకు అంశాల్లోని సమాచారం ఒకేలా ఉంది. ఇదే అంశా న్ని గూగుల్ కూడా గమనించి.. డిజిటల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ సంస్థ అయితే.. అది రాజకీయ పార్టీల మాదిరి పొలిటికల్ యాడ్స్ ఇవ్వడమేంటి అనే సందేహం వెలి బుచ్చింది. గూగుల్ సంస్థ లేవనెత్తిన సందేహాలకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.
దాంతో గూగుల్ మీరు ఇచ్చే ప్రకటనలు ప్రసారం చేయమని నిలిపివేస్తామని డిజిటల్ కార్పొరేషన్ ను హెచ్చరించింది. ఈ విధంగా ప్రభుత్వ సంస్థ ముసుగులో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ. 500కోట్ల వరకు ప్రజలసొమ్ముని జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చికోసం తగలేసింది.
కాగితాలకే పరిమితమైన డిజిటల్ లైబ్రరీలు…
ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం 2021లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల వరకు వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు పెడుతున్నట్టు ప్రకటించింది. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు కోసం రూ.750కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయడం.. దానిలో సగం సొమ్ము విడుదల చేయడం కూడా జరిగింది.
కానీ కడపలో ఏర్పాటు చేసిన మోడల్ సెంటర్ తప్ప, రాష్ట్రంలో ఎక్కడా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు కాలేదు. వాటికోసం ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలచేసిన సొమ్ము ఎటుపోయిందో తెలియదు. ఏపీ డిజి టల్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థ జగన్ రెడ్డి కోసం పనిచేసే అతని సొంత మీడియా సంస్థలా.. వైసీపీకి పనిచేసే బ్రాండ్ అంబాసిడర్లా తయారైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.” అని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.