– విద్యుత్ రంగ నాశనానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి పాపాల్ని తనభుజాలపై ఎందుకు వేసుకుంటోంది?
• ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, వైఫల్యాలు, ముఖ్యమంత్రి స్వార్థ ప్రయోజనాలు కాపాడటానికే ఏపీఈఆర్సీ కొత్తకొత్త ఆర్డర్లు ఇస్తున్నట్లుగాఉంది.
• ఏప్రిల్ 8వ తేదీనుంచి 22వరకు ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ … నేటికీరాష్ట్రంలో అమలవడానికి కారణమేంటి?
• జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరిత విధానాలే రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చాయి.
• విద్యుత్ లోడ్ రిలీఫ్… డిశ్పాచ్.. కోతలు అనేవి ప్రభుత్వం చూసుకోవాలి.. దానికి ఏపీఈఆర్ సీకి సంబంధంలేదు.
• రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నకంపెనీలను కాదని, ఎక్కడో గుజరాత్ లోని అదానీపవర్ కంపెనీ నుంచి యూనిట్ రూ.4కు ముఖ్యమంత్రి ఎందుకు కొంటున్నాడు?
• జగన్మోహన్ రెడ్డి స్వార్థం.. వ్యక్తిగతప్రయోజనాలకోసం రాష్ట్రం చీకట్లలో మగ్గిపోవాలా?
• రాష్ట్రపారిశ్రామిక రంగం పవర్ లో ఉన్నవారి పవర్ హాలిడేలకు బలికావాలా?
– మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్
భారత దేశంలో ఎక్కడా జరగని అద్భుతాలన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఏపీలోనే జరుగు తున్నాయని, విద్యుత్ ఉత్పాదన, పంపిణీ, సరఫరా, పర్యవేక్షణ నిమిత్తం ఏపీఈఆర్ సీ (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్)ని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక సదరుసంస్థ కేవలం విద్యుత్ కోతలు, వాటితాలూకాప్రకటనలకు సంబంధించిన ఆదేశాలిచ్చేసంస్థగా మారిందని టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఏపీఈఆర్ సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థని, అలాంటిసంస్థను నిర్వీర్యంచేసేకుట్రలు ఈ ప్రభుత్వంలో జరగడం బాధాకరం. విద్యుత్ లోడ్ రిలీఫ్, డిస్పాచ్ వంటిపనులు రాష్ట్రస్థాయి లోఉండే స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు చేస్తాయి. విద్యుత్ కోతలు, లోడ్ రిలీఫ్ కు సంబంధించి న, ప్రకటనలు ఏపీఈఆర్ సీ ఇవ్వడం చూస్తుంటే, సదరుసంస్థ రాజ్యాంగసంస్థేనా అన్న అను మానం అందరికీ కలుగుతోంది.
ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, వైఫల్యాలు, ముఖ్యమంత్రి స్వార్థప్రయోజనాలు కాపాడటానికే ఏపీఈఆర్సీ కొత్తకొత్త ఆర్డర్లు ఇస్తున్నట్లుగాఉంది. ఏప్రియల్ 8వ తేదీనుంచి 22వరకు ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ … నేటికీరాష్ట్రంలో అమలవుతోంది. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, పాలనాలోపాలు ఎత్తిచూపితే విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడటం మంత్రులకు అలవాటైంది. వైసీపీ ప్రభుత్వంలోని విద్యుత్ నియంత్రణమండలి వారుఇచ్చిన ఆర్డర్ లోని అంశాలను సదరుమంత్రులు గమనిస్తే, వారికివాస్తవాలు అర్థమవుతాయి.
సదరు ఆర్డర్ లో రాష్ట్రంలో ఉన్న ఏ పరిశ్రమఅయినా వారికి ఉన్నకనెక్టెడ్ లోడ్ లో 50శాతం విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని, వారంలో ఒకరోజు పవర్ హాలిడే ఇవ్వాలని, ఈ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై లక్షలరూపాయల బాదుడుపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకోసమున్నప్రభుత్వాలు, వారికి విద్యుత్ ఇబ్బందులు లేకుండాచూడాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నాయి. ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బందులుపడుతుంటే, విద్యార్థులు పరీక్షల సమయంలో కరెంట్ లేక నానాఅవస్థలుపడుతుంటే, ప్రభుత్వానికి పట్టదా? విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నాకూడా యూనిట్ విద్యుత్ ను రూ.12కంటే ఎక్కువధరకు కొనవద్దని ఏపీఈఆర్ సీ ప్రకటించడం ఏమిటి? ఏపీఈఆర్ సీ ప్రభుత్వంకోసం పనిచేస్తోందా.. లేక ప్రజల కోసమా?
ముఖ్యమంత్రి మాట్లాడితే వ్యవసాయానికి 9గంటల విద్యుత్ ఇస్తున్నామనిచెబుతుంటారు. కానీ వాస్తవంలో ఇస్తున్నది ఏడుగంటలే. ఆ 7గంటలవిద్యుత్ కూడా సక్రమంగా, నిరంత రాయంగా అందడంలేదు. మరీముఖ్యంగా ఆక్వారైతులు విద్యుత్ కోతలతో నానాగడ్డీ కరుస్తు న్నారు. ఏపీఈఆర్ సీ ప్రకటనలోని అంశాలుచూస్తుంటే పవర్ కట్ లు, పవర్ హాలిడేల్లో జగన్ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం సాధించనంత ప్రగతి సాధించినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు గారిహాయాంలో ఏనాడూ పవర్ కట్ లు.. పవర్ హాలిడేలు ఎలాఉంటాయో కూడా ప్రజలు చూసిఎరుగరు.
విద్యుత్ నియంత్రణ, విద్యుత్ కోతలు… పవర్ హాలిడేలతో రాష్ట్రంలో పరిశ్రమలనేవి ఎక్కడా నిలిచే పరిస్థితి లేదు. ఉన్న పరిశ్రమలు అన్నీ పొరుగురాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక కొత్త గా ఎక్కడా మచ్చుకైనా చిన్నపరిశ్రమకానీ, కంపెనీకానీ కనిపించడంలేదు. జగన్మోహన్ రెడ్డి విధానాలతో రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ తమరాష్ట్రానికి తరలివస్తున్నాయన్న సంతోషం తెలం గాణ సీఎం ముఖంలోస్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఉదయంలేవగానే జగన్మోహన్ రెడ్డి ఫోటోకి దండవేసి దండంపెడుతున్నాడని, ఇప్పటికే సామాజికమాధ్యమాల్లో ఛలోక్తులు విసురుతున్నారు. రాష్ట్రవిద్యుత్ రంగం సర్వనాశనం అవ్వడానికి, ప్రజలంతా చీకట్లో మగ్గడా నికి, పరిశ్రమలు మనుగడ కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణంకాదా?
ఎన్నికలముందు చంద్రబాబునాయుడు గారు విద్యుత్ కొనుగోళ్లకుసంబంధించి అధికధరల కు ఒప్పందాలు చేసుకున్నాడని, అవినీతిలోభాగంగానే ఒకేసారి 25ఏళ్లకు ఒప్పందాలు చేసు కున్నాడని జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన దుష్ప్రచారమంతా చేశాడు. ఆనాడు అలాచెప్పిన జగన్మోహన్ రెడ్డే నేడు యూనిట్ విద్యుత్ రూ.20కి కొందామన్నాఎవరూఇవ్వడంలేదని నిస్సిగ్గుగా అబద్ధాలుచెబుతున్నాడు. గతప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూ.4లకు కొంటే, ఈ ముఖ్యమంత్రి లేదుఇంకా తక్కువకు ఇచ్చేవారు చాలామందిఉన్నారని చెప్పుకొచ్చాడు. రాష్ట్రంలోని విద్యుత్ తయారీకంపెనీలమెడపై కత్తిపెట్టి, విద్యుత్ తయారుచేయొద్దనిచెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అసమర్థత, విధానపరమైన నిర్ణయాలవల్లే రాష్ట్రంలో విద్యుత్ కోతలని చెప్ప డంలో ఎలాంటిసందేహం లేదు.
రాష్ట్రంలో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుంటే కాదని, వీటీపీఎస్…కృష్ణపట్నం, ఇతరత్రా థర్మల్ ప్లాంట్లన్నీ మూసేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కారణం ఏమిచెప్పిందం టే థర్మల్ విద్యుత్ తయారీకి ఎక్కువఖర్చు అవుతుందనిచెప్పుకొచ్చింది. బొగ్గుతయారీ, సరఫరాసంస్థలతో జగన్ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాలుచేసుకోనికారణంగానే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ తయారీసంస్థలకు సదరుసంస్థలు బొగ్గుసరఫరా నిలిపివేసిన మాట నిజం కాదా? తనస్వార్థప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలకోసమే జగన్మోహన్ రెడ్డి థర్మల్ ప్లాం ట్లు మూతపడేలా చేశాడు.
సోలార్ పవర్ ప్లాంట్ల విషయానికి వస్తే, గతప్రభుత్వంలో చేసుకు న్న సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దుచేశారు. రాష్ట్రంలోఉన్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలనుకాదని, ఎక్కడో గుజరాత్ లోఉన్న అదానీ సోలార్ విద్యుత్ ఉత్పత్తికేంద్రంనుంచి యూనిట్ విద్యుత్ ను రూ.4లకు ఎందుకుకొంటున్నాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి?
పెద్దవాడినికొట్టి పేదలకుపెట్టడం అనేది సాధారణంగాజరిగేదని, కానీ జగన్మోహన్ రెడ్డి తన చీకటిఒప్పందాలకోసం రాష్ట్రప్రజలనుదోచుకుంటూ, ఆసొమ్ముని అదానీకి కట్టబెడుతున్నా డు. అదానీ అనేకార్పొరేట్ దిగ్గజాన్ని బాగుచేయడంకోసం రాష్ట్రంలోని పేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది వాస్తవమా…కాదా? జగన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రం అంధకారప్రదేశ్ గా మారింది. గతంలో వానరాకడ, ప్రాణంపోకడ ఎప్పుడుజరుగుతుందో తెలియదనేవారు..కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో విద్యుత్ రాకడ, పోకడ ఎప్పుడనేది దేవుడికే తెలియడంలేదు.
ఎన్నికల ముందు చిలకపలుకులు పలికిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బాదుడేబాదుడు స్కీమ్ పకడ్బందీగా అమలుచేస్తున్నాడు. ప్రభుత్వం ఉంది ప్రజల కోసమని, కానీ జగన్మోహన్ రెడ్డి తనస్వార్థపరమైన విధానాలతో, రాజకీయప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశాడు.
జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో పొరుగురాష్ట్రాలకు మేలుజరుగుతోందనేది పచ్చినిజం. ఒకపరి శ్రమ కేవలం 50శాతం విద్యుత్ వినియోగంతో మాత్రమే నడపాలంటే అదిసాధ్యమయ్యేపనేనా ? ఒక్కోపరిశ్రమపై ఆధారపడి కొన్నివేలమంది బతుకుతుంటారు. విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలతో పరిశ్రమలుమూతపడితే, వేలాదికార్మికులంతా రోడ్డునపడక ఏంచేస్తారు. ఇలాంటి వాటిపై ఏపరిశ్రమవారైనా, ఎవరైనా మాట్లాడితే వారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి నోటీ సులు అందిస్తారు.
కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిఫొటోకి దండ ఎందుకువేస్తున్నాడంటే.. ఇలా చేస్తుంటే ఎందుకు వేయరు? మన రాష్ట్రంలో హైడల్, సోలార్ పవర్.. విండ్ పవర్.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. అలాంటప్పుడు విద్యుత్ ఉత్పత్తి అనుకున్నస్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు గతంలో దేశంలోనే అత్యధిక పీఎల్ఎఫ్ సాధించాయి. మరినేడు 50శాతం విద్యుత్ ఉత్పత్తిసామర్థ్యంతో ఎందుకునడవలేకపోతున్నాయి? విద్యుత్ ఉత్పత్తి, లోడ్, రిలీఫ్, డిశ్పాచ్ అనేవిప్రభుత్వాలబాధ్యత. విద్యుత్ శాఖవారు సాధారణంగా పలానాసమయంలో విద్యుత్ కోతలుంటాయని చెబుతూ ఉంటోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వంచేయాల్సిన పనిని ఏపీఈఆర్ సీ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి పాపానికి ఏపీఈఆర్ సీ సంస్థఎందుకు బలికావాలి అనిప్రశ్నిస్తున్నాం?
పరిశ్రమల్లో పొరపాటున ఏదైనా మిషనరీ (యంత్రాలు) పనిచేస్తున్నాయో లేదో అని చెక్ చేయడానికి కూడా వీల్లేదంటున్నారు. భారతదేశమంతా విద్యుత్ కోతలున్నాయని చెబుతున్నవారు.. కొన్నిరాష్ట్రాల్లో ఎక్కువగా..కొన్నిరాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయనే వాస్తవం ఒప్పుకోవాలి. తక్కువ విద్యుత్ కోతలున్న రాష్ట్రాలతోపోల్చుకోకుండా.. ఎక్కువ విద్యుత్ కోతలున్నరాష్ట్రాలగురించే చెబుతూ, దేశమంతా ఇలానే ఉందని చెప్పి, తాను అంతా బాగానే చేస్తున్నానని ప్రజలను నమ్మించాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
తనకు కేసీఆర్ చేసిన సాయం తాలూకా రుణం ఇంకా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తీర్చుకున్నట్లు లే డు. అందుకే ఇలా రాష్ట్ర విద్యుత్ రంగాన్ని నిర్వీర్యంచేస్తూ… ఉడతాభక్తిగా ఆయన రుణం కొత్తకొత్తపద్ధతుల్లో తీర్చుకుంటున్నట్లున్నాడు. ఒక్కసారి గ్రామాలకువెళ్లిచూస్తే మంత్రులకు విద్యుత్ కోతలు ఉన్నాయోలేవో తెలుస్తుంది. రంజాన్ మాసంలో విద్యుత్ కోతలతో ముస్లిం సోదరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలుచేసింది నిజమా..కాదా?
మంత్రులకు విద్యుత్ కోతలు కనిపించవు….వారుఉండే ప్రాంతాల్లో కరెంట్ తీయరుకదా! వారువారి కుటుంబసభ్యులతో ఎవరికీతెలియకుండా, మారుమూలగ్రామాలకు, మున్సిపల్ కేంద్రాలకు వెళ్లిఉంటే అక్కడ ప్రజలు పడే అవస్థలు తెలుస్తాయి.