ఇది సినిమా హాలు కాదు, ఫ్యాన్స్ షో కాదు. నాయుడు కోసం సింగపూర్ లో.. ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ మంది తరలివచ్చారు. సీబీఎన్ క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఎవరూ అంచనావెయ్యలేకపోతున్నారు. జన సందోహాన్ని అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని నిర్వాహకులు ఒప్పుకున్నారు.
గతంలో ఏ దేశంలోనూ రానంత మంది అభిమానులు, ప్రజలు సింగపూర్లో చంద్రబాబు కోసం పోటెత్తారు. గంటల తరబడి నిలబడి ఆ కార్యక్రమాన్ని తిలకించారు. వారికి కల్పించిన అసౌకర్యానికి నిర్వాహకులు చివర్లో క్షమాపణలు కోరారు.
తమ అంచనాలు తప్పుకావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అలా చివరి వరకు నిలబడిన వారందరికీ ముందుగా ఫోటోలు తీసి పంపిస్తామని నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
– చాకిరేవు